"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

17 జూన్, 2014

గోడ

నేనొక హౌస్ ఫ్లై ..అయ్యో 
అచ్చు తప్పు హౌస్ వైఫ్ ..
నేను మొన్నటి వరకు వాలేదాన్ని 
మా ప్రక్కింటి కి మాకు మధ్య గోడ పై ..

అప్పుడు మోగేది సహజమైన ఒక 
ఆకలి గంట , పిల్లల ఆగమనం మరొక గంట 
ఆ పై కాలు ఝాడిస్తూ ,నడక షూ లు 
కట్టి ,సాగించేవారం మా మాటల ఆటలు .. 

హితురాలు ,స్నేహితురాలు తో 
ఇంటి విషయాలు ,ప్రాపంచిక కబుర్లు 
ప్రక్కింటి కథలు ,పిల్లల లోట్లు ,
కావేవి మా కబుర్ల కి అర్హాలు .. 

అక్కడక్కడ కుదిరి కూర్చున్న 
ఆ పై పై ఒంటి బరువు అంత వీసీ కాదు 
సుమా కరిగించడం అంటూ వాపోతూ 
కంచం లో చేయి కడిగే వాళ్ళం ..కుంభాలు లాగిస్తే 

మరి వచ్చేది ముందు నిద్ర ,ఆ పై ఉదరం 
అంటూ ప్రత్యక్ష ప్రహసనం చూసి కాస్త 
విచారించి , మన వల్ల కాదు లే ,మన మేమీ 
ఐస్వర్యా ,సుస్మితాలమా ? ఏమిటి లెస్తూ ..

అని సరిపెట్టుకుంటున్న సమయం లో 
వచ్చి పడింది ,ఇంటింటా ఠణా ఠణ్ అంటూ 
నెట్ సౌలబ్యం ,ఆపై తొండ ముదిరి నట్టూ 
వై ఫై అయింది ..మరి మా గోడ పై మాటల 

ఆకారం ,స్థానం మారింది ,మరొక ముఖ పత్రం 
గోడ వచ్చి కూర్చుంది , మా ప్రక్కింటి స్నేహ లత 
నా మధ్య ,ఐతే ఏం కానిం అని అలాగే కొనసాగించాం 
ఈ లోగా తామర తుంపల లాగా " ఈ " స్నేహితుల 

సంఖ్య పెరిగింది ,ఏం రాస్తే అదే లైకు అన్నారు ,
ఇంకా రాయండి మీరు అంటూ చప్పట్లు చరిచి 
కామెంట్స్ అంటూ పెట్టి ,ఉత్సాహ పరిచారు ,
అదేమి స్నేహం ,ముఖం తెలుసా ? మాట తెలుసా ? 

అని ముక్కు మీద వేలు వేసుకున్న వాని మీద 
కోపగించి కటీఫ్ చెపుతామంటే ,అబ్బే , నాతి చరామి 
అనేసావు కదా అనేసారు ,ఐతే సరే ,నా ముఖం కన్నా 
నాకు ఈ ముఖ మే ఎక్కువ అని తెగించేసాను ..

సరే నీ ( ఖర్మ ) ఇష్టం అనిపించేసాను ,ఇదిగో 
ఇవాళే చూసాను ,నా స్నేహ లత ఎలా ఉందో అని 
అలగలేదు కానీ ,ఎక్కడికి మాయం అయిపోయారు అంటూ 
ఇక్కడే ఉన్నానే అంటే ? ఎక్కడా మన గోడ మీద మీరు 

మరి కనిపించటం లేదు ,ఇదేం పని , 
మీ మాటల గల గల లు కోసం 
కలవరిస్తున్నాను ,ఈ మాటలు కాదండోయ్ 
నిజం గా మాటలు ,కంఠం నుంచి వెలువడే మాటలు ..

అవురా ? ఎంత తప్పు చేసాను అంటూ 
కంఠం సవిరించాను ,మాట రాదే ..
ఏదో స్టాటిక్ సౌండ్ వస్తోంది ..ఇప్పుడు నేనే 
గోడ నై పోయాను ..అయ్యో ..అయ్యయ్యో ....

2 కామెంట్‌లు: