"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

26 మార్చి, 2019

హైకూలు..

మొగ్గలు ఏమని
ప్రార్ధించాయో
పూలు గా వికసించడానికి..

గాలి ఏ ఊరులో
పుట్టిందో
మరిచిపోతూనే ఉంటుంది..

వెన్నెల చల్లగా
ఉండాలని ఎవరు
దీవించారో..

గజిబిజిగా
ఎవరో అక్షరాలు చల్లారు
ఆకాశం పలక పై.

చాలా దూరమే
ప్రయాణం చేసాం అనుకుని
నెమ్మదించాయి యేటి అలలు.

పూలు తొడిగిన చెట్టు
ఎంత వందనంగా ఉందో
రేపటికి రాలిపోతాయని తెలుసు..

చమేలి పూలు మల్లెల తో
పోటీ పడవు..
వాటి కి ఋతువు లతో పని లేదు.

చామంతి బంతి
పలకరించుకునే ఉంటాయి
హేమంతం లో..

సముద్రం ఒడ్డున
నేను లోతు
కొలుచుకుంటూ..

సంతోషం గాలిలో
ప్రయాణిస్తే
నీకూ అందుతుంది.

హమేషా నవ్వుతూ
ఉండాలని
తమాషాగా పూలు చెప్పాయి.

రైలు పట్టాల పై
ప్రయాణం
నేనా నువ్వా..చెట్టు పుట్టా..

వసంతలక్ష్మి  పి
కువైట్
ఇవాళ ఇలా అనిపించింది..

2 కామెంట్‌లు:

  1. హైకూలలో భావ సాంద్రత ఇంకా ఉండాలి అనిపించింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బుచుకి గారికి
      ధన్యవాదాలు అండీ.మీ స్పందనకు.
      మరొక ప్రయత్నం చేస్తాను.చదివి స్పందించినందుకు పలు ధన్యవాదాలు మీకు.
      వసంత లక్ష్మి.

      తొలగించండి