"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

16 మార్చి, 2010

వికృత నామ ఉగాది శుభాకాంక్షలు.

వికృతి నామ సంవత్సరం ట.. అంత వికృతం గా ఉంటుందా అని కంగారు పడుతున్నారు, కొంతమంది. మనం ప్రకృతి కి ఎంత దూరం గా జరిగి పోయమో గుర్తు చేయడానికే వచ్చిందేమో, ఈ ఉగాది. పచ్చని చెట్లు కొట్టేస్తాం, చిక్కని అడవుల్లో, రోడ్డులు వేసి, అటవీ సంపద అని కొల్ల గొడతం, అటవీ పుత్రులని తరిమి తరిమి, పట్టణాల్లోకి పంపిస్తాం, పులులు కనిపిస్తే, చర్మం కోసం ,గోళ్ళు కోసం, షూట్ చేస్తాం, నదులని ఎండ కడతాం, ఎడ పెడ ఆనకట్టలు కడతాం, ఇంక వర్షాలు పడవు అంటే, ఏమి చేస్తాం, హెలికాప్టర్లు పిలిపించి, కృత్రిమ వర్షాలు కురి పించ డానికి కోట్లు ఖర్చు పెడతాం  ..
పచ్చని పర్యావరణం, పులకించి, కోయిల లు మామిడి చెట్లు మీద దాక్కుని కు కుహు కుహు అని, ఆమనీ సంకేతాలు పాటల్లో వినిపిస్తూ, నదులు గల గల మని నిత్య నృత్యాలు చేస్తూ, నిర్మలం గా సాగరం లో కలయిక కోసం పరుగులు తీస్తూ, ఆరు రుతువులు, ప్రకృతి అతిథులు గా మనలని పలకరిస్తూ, పాడి పంటలు తో ,సుభిక్షం గా  మన ప్రజలు, సుఖ సంతోషాలతో అలరారే రోజులు అన్నీ, మనమే మన వికృత చేష్తలతో ,చేతులారా నాశనం చేసుకున్నాం, చేసుకుంటున్నాం  .. . 
ఈ రోజూ మనకి గడిస్తే చాలు, ముందు ముందు ఎంత నష్టం కలుగు తుందో, మన చేష్తలతో అని ఆలోచించం. మన పిల్లలకి ఇంత డబ్బు మూటలు సంపాదించి  ఇస్తే చాలు, అనుకుంటాం. పచ్చని ఒక చెట్టు నాటమని చెపితే, ఆ నెలలో ఒక చిన్న మేడ లేపితే అద్దెలు కి ఇవ్వొచ్చు , నెలకి ఇంత ఆదాయం అని లెక్కలు వేస్తాం, ఇంత ఊపిరి పోస్తాయి చెట్లు, అని ఎలా ఒప్పించడం? ఊపిరి ఉంటేనే కదా మేడలు, మిద్దెలు అనుభవించడానికి. అన్నీ డబ్బు తో కొనుక్కుంటాం అని ఒక వెర్రి ఊహ, ప్రాణం కి అవసర మయ్యే గాలి కూడా సీసాల్లో అమ్ముతారేమో, ముందు ముందు. ఇప్పటికే, దాహం కి నీళ్ళు ప్లాస్టిక్ సీసాల్లో కొనుక్కుని, నీళ్ళు తాగి, ప్లాస్టిక్ ని, వ్యర్ధం గా, భూమి కి కానుక గా ఇస్తున్నాం.. ఎంత స్వార్ధ మానవులం మనం?
మనకి, ఆకలి ని తీర్చే భూమి అంటే ఎంత నిర్లక్షం.. ప్లాస్టిక్, భూమి కి గొంతు లో అడ్డం పడే ప్రానంతక వ్యర్ధం అని తెలిసి పదే పదే అదే పని చేస్తున్నాం. రసాయనాలు తో, పంటలు పండిస్తున్నాం, అట్టడుగు వరకు, గొట్టాలు వేసి, మనకి కావాల్సిన జలం అంత పిన్దేస్తున్నాం, వట్టి పోతున్న భూమి, వర్షాలు లేక, ప్రాణ జలం కరువై, కోపంతో మండి పడి, భూకంపాలు తో మనకి జవాబు ఇస్తోంది. ప్రకృతి ఇచ్చే సంకేతాలు అందు కునే ,సున్నితత్వం మనలో ఎక్కడా లేదు ఇప్పుడు.
పురుషుడే అధిపతి, పురుషుడే గొప్ప, పురుషుడే ముఖ్యం, అంటూ మిడిసి పడి, ప్రకృతి -పురుషుడు ద్వందత్వం లో నుంచి, బలవంతం గా విడి పడి, ఎంత కాలం మనగలం మనం? వికృతి నామ సంవత్సరం, మళ్లీ ప్రకృతి ని స్మరించు కోవాలి, ప్రకృతి కి తల ఒంచాలి, ప్రకృతి చేయి విడిస్తే, ప్రకృతి సాహచర్యం విడిచి, అడుగు వేస్తే, మనకి మిగిలే నరకం ,భూమి మీద ప్రాణ శక్తులు అంతరించే ఆ ఆత్మ హత్య సదృశం అయే రోజులు ని గుర్తు చేయడానికి, ఒక హెచ్చరిక గా వచ్చిందేమో ఈ వికృత నామ ఉగాది.
ఉదయం లేవగానే, మనం అడుగులు వేసే ,వేయ నిస్తున్న ఈ భూదేవి కి  శిరసు వంచి, నమస్కారం చేసి, ప్రాణ శక్తి నిచ్చే ఆ సూర్య శక్తి కి ,చేతులు ఎత్తి మరో నమస్కారం చేస్తూ, రోజూ ని ప్రారంభించాలి అని మన పెద్దలు చెప్పారు. మనకి దాహం తీర్చే జలా న్ని అంతే గఉరవం తో, మితం గా వాడుకుంటూ, అను క్షణం, మనలో భాగ మైన ప్రకృతి శక్తులకి అనురక్తి గా మసులు కుంటూ, ఒక బాధ్యత తో కూడిన జీవితం, ఒక అపురూప వరం గా మసలాలి, మనం.
మా మాస్టారు గారు చెప్పారు ఒకసారి, వినాయక చవితి వ్రతం నాడు, మనం చదివే పత్రం ల పేర్లు కల వృక్షాలు అన్నీ ,మన చుట్టూ  ఉంటే, మనం పర్య వరణ సమతుల్యం పాటిస్తూ, మన మనుగడ ని పరిరక్షించు కున్తున్నాం అని అర్ధం. ఇప్పుడు ఏవో గడ్డి, గన్నేరు, నాలుగు మామిడి   ఆకులతో పని కానిస్తున్నాం. మన పిల్లల కు, నాకూ కూడా, ఆ పత్రాల చెట్లు ఎలా ఉంటాయో  తెలియదు. ఇంటి చుట్టూ మట్టి, దాంట్లో మొక్కలు పెంచే రోజులు పోయి, శుబ్రం  కోసం సిమెంట్ గట్టు, చిన్న చిన్న గోలేల్లో, ఇంటి మొక్కలు పెంచే రోజులు వచ్చాయి. చుట్టూ  మట్టి ఉంటే, వర్షం నీరు భూమి లోకి ఇంకి, మనకి మేలు, మనకి తీసు కోవడమే కాని, ఇవ్వడం తెలీదు, మనకి ఒక అవకాసం ఇచ్చింది, ఈ వికృత నామ ఉగాది.
మేలుకున్టామో, మన గొయ్యి మనమే తవ్వుకుంటూ, వినాశనం వేపు అడుగులు వేస్తూ , ఇదే స్వర్గం అనే మిధ్య లో కలి యుగాంతం కి పునాదులు తవ్వుతామో, అంతా మన చేతిలోనే, అంత నీ మెలకువ లోనే, నీ ఆచరణ లోనే..
వికృత నామ ఉగాది, ఇదే నా స్వాగతం, పచ్చని భూమి కోసం ఇదే నేమో యుగాది.



















7 కామెంట్‌లు:

  1. మీకూ మీవాళ్ళకూ నాయొక్క తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలండోయ్!!

    రిప్లయితొలగించండి
  2. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ 'వికృత' నామ సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. మీకు,మీ కుటుంబానికి కూడా వికృతి నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. మీకు , మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  5. మీకు వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. నూతనసవత్సరంలో మంచిటపా రాశారు . మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  7. అందరికి నా ధన్యవాదాలు. మీ ఉగాది శుభాకాంక్షలు తో నా మనసు నింపారు.
    వసంతం.

    రిప్లయితొలగించండి