"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

4 ఆగ, 2013

పచ్చని చెట్టు చెప్పిన కథ

ఆకు ఆకు కి ఒక కథ ఒక కాలక్షేపం ట,
ఒక్క సూర్యుని కిరణమైనా తాకదా నన్ను అంటూ తొందరింత 
అటు జరుగు సుమ్మి ,నా వంతు కాదా ,ఈ వేళ? అంటూ 
అలకతో ముడుచుకుని, అంతలో తేరుకుని, విప్పారి ,
సతత హరిత పత్రాన్ని ఆ వెలుగు ప్రభువుకి అప్పగించి 
సూటైన కాంతి స్పర్శ కి పులకించి ,మరో మారు ప్రణమిల్లిన 
ఆ చిన్ని ఆకు ,జగమంత ఎంత సుందరం ,అంటూ తిలకించి 
కనుచూపు మేర లో ఒక్క నీటి మబ్బు కనిపించదే?
ఈ దుమ్ము ధూళి ని శుభ్ర పరిచే చిక్కటి నీటి ధార ఏది ?
తలారా స్నానించి పులకిత పత్రం గా వెలుగొందాలి కదా 
ఆకు ఆకు కి ఒక తపన ,ఒక తపస్సు. 

నీలి ఆకాశం నిప్పులు చిందుతూ 
పచ్చదనం ని నాకేస్తోంది ,తన మంటల కి ఆజ్యం గా 
నీడ కోసం నరుడి కి ఎండ కంతులే కానుక ,
ఒక్క చెట్టు అయినా మిగల్చరేం ? అంటూ 
రుస రుస లాడుతూ మనిషి , ఎవరో ఆ ఒక్కడు 
తను మటుకు కాదు కాబోలు ?? 
ఎంత మూర్ఖుడో అంటూ జల జల ఎండిన ఆకులు 
విదిల్చి ,మౌనమ్ గా తను పోయే లోగా రెండు 
మొక్కలు నాటే వారెవరు ? అంటూ దిక్కులు చూస్తూ 
పచ్చని చెట్టు చెప్పిన కథ ,వినే వారున్నారా ?? 

2 కామెంట్‌లు:

  1. మౌనమ్ గా తను పోయే లోగా రెండు
    మొక్కలు నాటే వారెవరు ? అంటూ దిక్కులు చూస్తూ
    పచ్చని చెట్టు చెప్పిన కథ ,వినే వారున్నారా ??......హ్మ్మ్....నిజమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హ్మ్మ్ ..
      కవితలు ,కథలు వ్రాయడమే కానీ ,నేను కూడా ఒక్క మొక్క నైనా పెంచటం లేదు అనే కఠిన వాస్తవం ముందు నేను తలవంచుకునే ఉంటాను ..
      వసంతం.

      తొలగించండి