"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

14 ఆగ, 2013

చదువు కొందాం రండి ,చదువు కొందాం రండి

చదువు కొందాం రండి ,చదువు కొందాం రండి 
పలకల పై అ ,ఆ ,లు ఎగరేసి పాట పాడుతారు 
ఎవరు ఎక్కువ పాట పాడితే వారిదే చదువు శాల 
చిన్న చిన్న పిల్లలు ఆకలి కడుపులు చేతితో పట్టుకుని 
చదువు కొంటారు, చదువుకోడానికి మరి వీలు లేక . 

అమ్మ అంట్లు తోముతుంది నాన్న వాచ్ మాన్ ,
అమ్మా ఆకలి అంటే బడి కి వెళ్ళు ,బువ్వ పెడతారు 
అంటూ తోలింది, పళ్ళెం లో ఉడికి ఉడకని అన్నం ,
మారు అడిగితే నెత్తి మీద మొట్టికాయలు, మీ అబ్బ సొత్తా ? 
అని తిట్లు దండకాలు, చదువుకొంటాం మేం చదువు కొంటాం . 

పుస్తకాలు ముట్టినట్టు , తలాడించేం ,నాలుగో తరగతి కి ఇంకా 
అ ఆ లు రాలేదాని వీపు మోత మోగించే మాస్టర్లు ,
ఎప్పుడైనా మరి చదువు చెప్పారా ? ఉచితం అంటే ఇంతే
అన్నారు, మరి చదువు కొంటున్నాం కదా అంటే ,అది మా జీతాలు 
మీ చదువుకి ఏవి జీతాలు ? 

పై మాస్టారు తనిఖి కి వచ్చి ,పెద్ద అయి ఏమవుతారు ?
అని అడిగితే అందరం మాస్టర్లు అని చెప్పెమ్.. సంతోషించి 
ఎందుకురా అంటే రెండు పూటలా మరి పిల్లల అన్నం తినొచ్చు కదా 
అని గట్టిగా అరిచేం , ఏమో మరి అందరూ మమ్మల్ని మెచ్చుకోలేదు సరికదా 

ఈ ఉచిత బడి పిల్లలకి ఎంత ఆకలో ఎంత బలుపో అన్చెప్పి 
మా వీపులు వాయించి, మాస్టర్లు చింత బరికలు తో తోళ్ళుఊడకొట్టారు 
అమ్మ బడి వద్దే ,నేను ఇళ్ళల్లో పని చేసి, అన్నం తింటానే అని ఏడిస్తే 
అమ్మ ఏమంది , చదువు కుంటే నీ బువ్వ నువ్వే సంపాదిస్తావు ,ఎంగిలి కూడు వద్దురా అంది . 

అందుకే చదువు కొనే బడి లో చదువుకుంటాను ,నేను చదువుకుంటాను . 

2 కామెంట్‌లు:

  1. చాలా చాలా బాగుంది లక్ష్మి గారు

    రిప్లయితొలగించండి
  2. ధన్య వాదాలు అండీ రూప గారూ ..
    మన చుట్టు జరుగుతున్న చదువు బడి కాదు దుకాణాల సంత చూసి ..
    ఇలా ఎదో రాసుకోవడం తప్ప మరేం చేస్తున్నాను ? అని ఒక సతమతం చేసే ఆలోచన ని తప్పించుకుంటూ ..
    వసంతం

    రిప్లయితొలగించండి