"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

21 మార్చి, 2014

దినాలు ...365 రోజులు

భగ భగమని మంటలు
నా చుట్టూ
వసంతం వచ్చేస్తోంది కోయిలా
ఎక్కడికి పోయావు ? గొంతు సవరించుకో .

ఏ కొమ్మ పై వాలను ?
ఏ చిగుర్లు మేయను ?
యే కోయిల మరి కుహు కుహు
అంటూ తిరిగి జవాబు చెపుతుంది ?

వేప చెట్లు ,రావి చెట్లు ,మర్రి చెట్లు
ఊరు ఊరుకి అమ్మ లా వీవెనలు ఊపుతూ
మాయం అయి పోయి ,ఇనప చెట్లు ట
మొలిచాయి వాడ వాడ లా ,
యే చెట్టు పై వాలను ?

మండుటెండ కాల్చేస్తోంది ,
చుక్క నీరు లేవు ,ఏ పక్క
కుహు కుహు అని యే చిగురు తిని
సవరించుకోను గొంతు ?

మా అమ్మ కథలు చెప్పేది
ఊరి లో పిల్లలు చెట్లు కింద చేరి
అల్లరిగా కూ కూ అంటూ కూతలు
కూసేవారట , చదువుల బడి జైలు ట
ఇప్పుడు చెట్టు పుట్ట కొండా అన్ని
పుస్తకాల మీద బొమ్మలై పోయాయి ట .

ఇంకెక్కడ అల్లరి ? ఆటలు ?
ఇంకెక్కడ వసంతాగమన సంకేతాలకై
ఎదురు చూపులు ,
పట్టణాల లో అన్ని ఋతువులూ
ఒక్కటే ,మండే ఎండలు ..అంతే ..

నీ చేత్తో నీవు తవ్వుకున్నావు గొయ్యి
నీ వినాశనం నీవే కోరి తెచుకున్నావు
అంటే నమ్మరు ఈ జనం ..
ప్రకృతి ని రక్షించండి అంటూ కవితలు
అల్లుతారు , ఒక్క మొక్క నాటండి అంటే
అమ్మూ నా ఫేస్ బుక్ లో కొంపలు అంటుకుంటాయి
నే ఒక్క క్షణం మిస్ అవుతే అంటూ బడాయిలు పైగా

అడవి కి ఒక రోజు ,పిచుక కి ఒక రోజు
పులి కి మరో రోజు , ఆడ పిల్ల ల కి కూడా
ఒక రోజు ట ,ఇన్ని నోట్లు , నాణాలు కంచం లో
పోసుకుని తింటరా ఏమిటి ? అదీ చ్హూద్దాం ..

నల్లటి కోయిల కార్చిన కన్నీటి చుక్క
మరి నలుపులో కలిసి , కనిపించనే లేదు ..
రండి ,మరో రోజు జరుపుకుందాం ..పోనీ
కోయిల కి ఈ రోజు పెడదాం ...సరి పోతుంది ..

మనం చేయ గలిగింది అదే ..
దినాలు .. హుహ్ ..పెట్టు కోవడమే ..
రండి ,365 రోజులు ..దినాలు గా ప్రకటిద్దాం ..
ఈ ఫేస్ బుక్ లో నే జరుపుకుందాం ..శుభం ..

5 కామెంట్‌లు:

  1. వాస్తవాన్ని వేదనాపూరితంగా వివరించారు.

    రిప్లయితొలగించండి
  2. శ్రీదేవి గాజుల ,

    ధన్యవాదాలు మీకు, అవును వాస్తవం చాలా నిరాశజనకం గా ఉంది, మనం నిస్టేజం గా ఉండి ,ప్రయోజనం లేదు , ఏదో చేయాలి ..ఒక్క మొక్క అయినా నాటాలి ..
    వసంతం

    రిప్లయితొలగించండి
  3. మీరు రాసిన ప్రతి పదం నిజం. మన చేత్తో మనం తొవ్వుకున్న గొయ్యి. అనుభవించాల్సిందే... ఏదో చేయాలి ..ఒక్క మొక్క అయినా నాటాలి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. డేవిడ్
      నిజం కదా .. మనం ఇప్పటికైనా మేలుకోక పోతే ,మన గొయ్యి ని మనం తవ్వుకున్నట్టే .

      వసంత లక్ష్మి

      తొలగించండి