"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

24 మార్చి, 2014

వెలుతురు కావాలి నాకు ,మాకు ,మనకి


ఉదయం వార్త పత్రిక చూడాలంటే భయం వేస్తోంది ..

పరువు హత్య ముందు పేజీ లో ,ప్రేమ పెళ్ళా ? 

కన్నందుకు నువ్వు మా ఆస్తివి, మా బొమ్మవి ..

మేం చెప్పినట్టు వినాలి, మన కులం లోనే పెళ్ళి ..

లేదా మృత్యువు .ఇదే మా శాసనం అంటూ గొంతు కి
ఎద మీద ఆట్లాడే చున్ని తో ఉరి వేసిన రాక్షస తల్లి తనండ్రులు 
యే సంఘ సూత్రాలు వారిని ఆ పనికి ప్రేరేపించాయి ?
నీ బ్రతుకు అంతా ,నీ కులం నిర్ణయిస్తుంది , అదే మా న్యాయం ,మా చట్టం ..
మరే చట్టం మాకు వర్తించదు ,,అనే ఈ అమనుష మనుషులు ,
మన మధ్యే ,ంసులుతున్నారు, జీవిస్తున్నారు ..
మరో వార్త ..
తన శరీరాన్ని ,వ్యాపార మదుపు గా అంగీకరించనందుకు
ఆమె అంగంగాలు కోసారు ట ..
ఎంత దారుణం ?
ఏమయ్యాయి ? చట్టాలు ? స్త్రీలని రక్షించే పోలీసు వ్యవస్థలు ?
పోలీసులే దగ్గరుండి నడిపిస్తారు అని విని మరీ అంత దిగ్భ్రాంతి పొందకండి
ఒక మహిళ దగ్గరుండి ,ఈ అఘాయిత్యం చేయించింది ట ..
ఇది మన సమాజం మన చుట్టు ,మంకేమీ పట్టనట్టు మసిలే సమాజం ..
ఇలాంటి వార్త లు చదవ లేక ఉదయమే ,వార్త పత్రిక చదవడం మానేద్దామా ?
శుభం ..తప్పించుకుని తిరుగువారు ధన్యులు ..అనేసారు కదా
మనం చెవులు మూసుకుని, కళ్ళు మూసుకుని ,నోరు మూసుకుని ..
ఈ దుర్మార్గాలు భరిస్తూ ... మనకి సంబంధం లేని విష్యాలు అంటూ
బ్రతికేద్దాం ..మన బబెల్ లో ,మన నాలుగు గోడల .నేను కూడా ఆ మనం లో ఒకటే ..
చాలా కోపం ...పిచ్చి కోపం గా ఉంది ..
ఇంకా బంధించండి ఆమాయిలని, అసలు వెలుగు తాకనీయకండి ..
ఆమె ఒక క్షేత్రం అంతే ..కంచెలూ వేసి కాపాడండి ..కంచే చేను మేసినా
అదంతే ,మగ తనం అని మీసాలు మెలి తిప్పండి ..
ఆమె కి జరిగిన అన్యాయాలు ,హింస లు , అవహేళనలు
పైకి మటుకు నోరు విప్పి చెప్పకూడదు , పరువు -ప్రతిష్ట ,,అమ్మో .
ఉద్యోగాలు చేయాలి ,వేణ్ణిల్లు కి చణ్ణీళ్ళు ..తప్పదు ..ధరలు ఎలా పైకి పోతున్నాయి ?
అక్కడ జరిగే , హేళనలు, చేతులు తాకించడం , రెండర్ధ్హాల మాటలు అవి మటుకు
ఇంటికి మోసుకు రాకూడదు ..సహించాలి , భూదేవి అంత సహనం నీకు
నీ సహనమే నీకు రక్ష ..ఎలా ? సహిస్తూ ఉంటే లోకువ గా ఇంకా హరాస్మెంట్ ఎక్కువయిందే ?
నోరు మూసుకు ఉంటావా ? నీ పేరు పాడు చేయనా ? అంటూ బెదిరించే తోటి ఉద్యోగులు
అయ్యో ఈ వ్యవస్థ లో మహిళ లూ మీరు కీలు బొమ్మలు ఎందుకు ఎలా అయారు ?
కుమిలి పోతున్న ఆమె మీద నువ్వు కూడా ఒక చెడు మాట ..విసిరుతావా ?
మొత్తం అంతా కుళ్ళి పోయింది , లుక లుక లాడుతూ పురుగులు పెట్టి ఉంది
చా .. ఎంత గొప్ప సూర్యోదయం అవుతుంది ? ప్రతి రోజూ ??
దానికింద , చీకటి నీడలు ఎందుకు ? నా కళ్ళ్ కి కనిపిస్తాయి ..
నాకు సూర్యోదయం కావాలి ,ఎర్రగా కాల్చేసే కిరణాల తో ,ఈ మురికి ని ఎండ గొట్టే కిరణాలు కావాలి ,ఎండ మండి పోయినా సరే ,ఈ చీకటి, చీదర చెదర గొట్టే మిరుమట్లు గొలిపే వెలుతురు కావాలి నాకు ,మాకు ,మనకి ..

4 కామెంట్‌లు:

  1. మసులుతున్న మనోభావాల మనోజ్ఞమైన ప్రతిఫలనం. అగ్నిసాక్షిగా ఈ సమాజం బాగుపడలేనంతగా కుళ్లి పోయింది. కూలిపోయిన శిథిలాల మీదనుంచి నవ సమాజ సౌధ నిర్మాణం జరగాలి. .
    --- మంగు శివరామ ప్రసాద్, విశాఖపట్నం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంగు శివరాం ప్రసాద్ ,విశాఖపట్నం ..గారికి నమస్కారం .
      అవును మీరు అన్న మాట నిజం ..కూలిపోయిన శిథిలాల మీద నుంచి నవ సమాజ సౌధ నిర్మాణం జరగాలి .. అది ఎప్పుడు ? ఎలా ? అన్న ప్రశ్నల కి కాలమే సమాధానం చెపుతుందా ? ఎదురు చూడ్డమే మనకి తోచిన దారి ..
      వసంతం

      తొలగించండి
  2. ఎంత చక్కగా చెప్పేవు అమ్మా... బాగుంది.....మేము 1957 నుండి చూస్తున్నాం....చాయి కూడా తెలియని అమ్యకులు... నీ బానిచాను నీ కాళ్ళకు ముక్కుతా అంటో వెట్టి చాకిరీ చేస్తారు....మనం వారికీ అన్యం చేసాం అని నాభావన కూడా... నేను కూడా ,అందరి తరపున. శిరసు వంచి క్షమించమని కోరుకుంటున్నాను..

    రిప్లయితొలగించండి
  3. అవును ...సూర్యోదయం కావాలి ,ఎర్రగా కాల్చేసే కిరణాల తో ,ఈ మురికి ని ఎండ గొట్టే కిరణాలు కావాలి ,ఎండ మండి పోయినా సరే ,ఈ చీకటి, చీదర చెదర గొట్టే మిరుమట్లు గొలిపే వెలుతురు కావాలి నాకు ,మాకు ,మనకి .

    రిప్లయితొలగించండి