"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

13 మార్చి, 2014

హైవే .

హై వే ,,ఏడు గంటల షో చూసి వచ్చి ,అన్నం తిని కూర్చున్నాను ,
నా మనసు మటుకు , పెద్ద పెద్ద కళ్ళ ల్లో ,తన లోని బాధని ,భావాలని చూపించిన ఆలియా భట్ చుట్టు తిరుగు తోంది ఇంకా ..
గొప్పింటి అమ్మాయి , దుండగులు ఎత్తుకు పోతారు ,అయినా బెంగ ,భయం లేదే ? ఈ అమ్మాయికి ? ఎందుకని ? అనుకునే లోపల ,తన లో గూడు కట్టుకున్న గుబులు,చీదర ,నాలుగు గోడల మధ్య ఊపిరి ఆడని తనం ..అంతా చెపుతుంది ..
మనసు బరువెక్కుతుంది , ఇల్లు అంటే ,సుఖం గా సురక్షితం గా ఉండే నాలుగు గోడల ప్రదేశం ,కానీ ఆమెకి తన ఇంట్లో ఊపిరి ఆడదు , ఇంకా ఆ ఊపిరి ఆడని తనం లో ఉక్కిరి బిక్కిరి అవుతూ ,తన ని తాను బయట పడేసుకోవాలని కోరిక ,ఇంకా వీడని పసితనం ...
రేపటికి పెళ్ళి అంటూ చేసి ,మరొక మగవాడి తో పంపిచేస్తున్నారు ,మగవాడు అంటే ఇంకా భయం ,చీదర,హుష్ హుష్ అంటూ ఆమె లోని సర్వ శక్తులని అణిచేస్తున్న నాలుగు గోడల ల ఇరుకు నించి బయట పడాలని ,ఊపిరి పీల్చుకోవాలని , స్వచ్చమైన ఆరు బయల గాలి పీల్చాలని ఒక్క కోరిక కోరింది ..ఆ కాబోయే భర్త ని ..
మనకి ఇది సేఫ్ కాదు , ఇలా మనం రాకూడదు ,మనం వెనక్కి వెళిపోదాం అనే మగడు ..మగవాడు ..ఆమె కి ఇంక ముందు ముందు రక్షణ ఇచ్చే మగవాడు ..
ఒక్కసారి ,ఇంకొంచం దూరం అంటూ గుండెల నిండా స్వేచా వాయువలు పీల్చుకోవాలని , నవ వధువు గా ,మరు రోజు మారిపోయే ఆమె ..గుండె ల చప్పుడు ఎంత మంది మగ వారు విన గలిగారు ? మనసుతో ??
పిచ్చ్హా ? పొగరా ? తిరుగు బాట ? అంటూ కంగారు పడని మగ వారు ఎంత మంది ?
తను పుట్టి ,పెరిగిన ఇల్లు, తన వారు ,తన స్నేహితులు ,తన పుస్తకాలు ,తన ఇంటి పేరు ,తన గతం అన్నీ వదులు కుని ,నీ చిటికెన వేలు పట్టుకుని ఏ ధైర్యం తో ఆమె వస్తోంది ,నీ వెంట ?
ఆలోచించారా మగ వారూ ?? నవ వరులూ ??
మొరటు భాష ,వేషం , అను క్షణం ఎవరో వెనక వచ్చి పట్టుకుంటారు అని భయం ,తొట్రు పాటు , వేట లో వేటాడ బడుతున్న అనాగరిక వాంచలు , ప్రాణాలు అర చేతిలో పట్టుకుని ,పరుగులు ,ఆ ప్రాణాలు కి విలువెంత ? ఆ ప్రాణి అసలు ఈ భూమి మీద ఏ మూల బ్రతుకుతున్నాడు ? ఇన్నాళ్ళూ ? ఈ దేశం లో ఒక మనిషేనా ?
ఐతే అంత క్రోధం ఎందుకు ? అంత తెగింపు ఎందుకు ? ఎక్కడకీ ఆ రోడ్డు ప్రయాణం ?
ఏ అంచు లకి ? దేశ సరిహద్దులు లేని ..కొత్త ప్రపంచాని కా ?
దేశం ,అధికారం తొంగి చూడని సరిహద్దు ఉంటుందా ?
ఎన్ని హిమ మయ కొండలు ,ఎన్ని నదులు , ఎన్ని లోయలు దాటినా ,గొప్ప వారి చేతిలొ రక్షక బంటులు లేని దేశం ఉంటుందా ?
ఏదీ ఆ కలల ప్రపంచం ?? ఆ కొండ పై ,నాకొక ఇల్లు ,నా భర్త కి వండి పెట్టుకుని ,ఇంటి పనులు చేసుకుంటూ , ఇలాంటి కలలు ఒక గొప్పింటి అమ్మాయి ఎందుకు ? కంటొంది ?
మరీ మన చెవిలో పువ్వులు పెట్టి శుద్ధ్ రొమాంటిక్ , మాది వేరు అనే ప్రేమ కథ ఏనా ? ఏమిటి ? అని మధ్యలో ..కాస్త తొందరింత ..
కాదు ,సుమా కాదు ..
ఒక అమ్మాయి మది లో వెలిగే కలలు కి ఎన్నెన్ని రంగులు ,రూపాలో ?
ఎవరో ఒకరితో ముడి వేసి ,ఇంక అతని తో బ్రతుకు అంటె ..ఆ కలలు ఎలా చిద్రం అయిపోతాయో ? మీకు తెలుసా అసలు పెద్దలు ??
సాఫ్ట్ వేర్ , హార్డ్ వేర్ , బాంక్ అకౌంట్ , ఫ్లాట్ ,కారు ...ఇవి కాకుండా ఇంకా ఏం కావాలి ? మిగిలినవన్నీ ఉత్త సిల్లి కలల ప్రపంచం ..అమ్మాయి కలలన్ని పెల్ళి అవగానే మూట కట్టి అటక మీదకో ,సముద్రం లోకో విసిరేయాలి ,పలక మీద కొత్త అక్షరాలు రాయాలి ,పాత వన్నీ ఉమ్ము వేసి తుడిచేయ్ అమ్మాయ్ ..తుడిచేయ్ ..
అలియా భట్ నీకు నా అభినందన్లు ..
ఎందరి వో కలలు మూట కట్టి ,నీ తో ఆ చల్లని కొండల మీద ఎగరేసావు ..గాలిలో పూల రె్క్క లా ఎగిరాయి ,ఆ కల లు ..వచ్చి సీతాకోక చిలక ల్లాగా ,వచ్చి కూర్చుంటాయి ..అమ్మాయిల భుజాల పై ..
ఆ హైవే మలుపులు ,తిరుగుతూ ,గుప్పెళ్ళ ల్లో ఆకు పచ్చదనంం , నదుల ఉధృతి , మేక ల మెల్ల ని నడక లు , ఎత్తు గా మరింత ఎత్తుగా పెరిగిన ఆ తెల్లని ని హిమాలయాల అంచున ఒదిగి పోయిన దారులు , దారి పక్కన కబుర్లు చెప్పే చెట్టు మోడు , తెల్లని పూలాల తో సంభాషించే మొక్క లు ,దారి ప్ర క్క , చాయ్ దుకాణాలు వారి పాటలు అవి కూడా సిన్మా లో పాత్రలే ..
ఆ ముఖం లేని , దుండగులు గురించి మనం ఎందుకు ఒక కన్నీటి బొట్టు రాలుస్తాం ?
అదీ హైవే ..తప్పక చూడండి ..అది ఒక అనుభవం ..

4 కామెంట్‌లు:

  1. థాంక్ యూ శ్రీదేవి గాజుల ,

    సినిమా చూడండి ,బాగా తీసారు ,బాగా చేసారు అందరూ ..

    వసంతం .

    రిప్లయితొలగించండి
  2. తప్పకుండా చూడాల్సిందే అయితే....ఆడదాని మనసుని అర్థం చేసుకోవడానికి ఇలాంటి సినిమాలను ఎన్నింటిని చూడాలో మేము.....అయినా అర్థం చేసుకునే హృదయం ఉందంటారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డేవిడ్ ..
      ఎన్ని యుగాలు ,ఎంత కాలం అయినా ,హృదయం ని తెరచి పెడితే కానీ ,ఒక ఆడ దాని మనసు అర్ధం కాదు ,ఈ మగవారికి ,,ఎన్ని సిన్మాలు? ఎన్ని కథలు ? ఎన్ని కవితలు ? ఇంకా ఎంత దూరం ??
      వసంతం

      తొలగించండి