"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

17 మార్చి, 2014

హాపీ హోలీ అందరికీ

ఆకు రాలుస్తున్న చెట్టు కి తెలుసా
చిగురాకుల చికిలింత దాగుందని
నేల రాలిన పూవు కి తెలుసా
కొమ్మ కొమ్మ కీ మరి కొన్ని పూలు
పులకరిస్తూ పలకరిస్తాయి అని
తెలుసు అనుకుంటా
అందుకే యే బెంగా లేదు వాటికి
అయిపోయిన రోజు ,ఘడియ గురించి
మనకే ఎందుకో చింత ?
కాలం రెమ్మకి ప్రతి ఉదయం ఒక పువ్వు
పూస్తుంది ,అదే ఈ రోజు ..
ఆశల మారాకు వేయనీ
రంగు రంగుల పూల జల్లుల
హోలీ జరుపు కుంటున్న ప్రకృతి
ఎన్నెన్ని సందేశాలు ఇస్తుందో ,
మనసున రంగులు మాయనీకు అని
ఎన్ని రంగులు ఉన్నాయో ,ప్రకృతి లో
మనిషి లో అన్ని రకాలు అని ,
యే పువ్వు ,యే మనిషి ఒక్కలా ఉండరు
వైవిధ్యాన్ని ఇష్టపడి గౌరవిస్తే
మనసుకి ఎంత శాంతి ?
రంగుల పండగ చేసుకో ఈ రోజు
మనసులో రంగుల వైవిధ్యం నింపుకో ..
హాపీ హోలీ అందరికీ

1 కామెంట్‌:

  1. నిజమే కదా ప్రకృతి మనకు ఎన్ని విషయాలు చెపుతుంది. మనమే వాటిని గుర్తించడం లేదు. చాలా బాగుంది మేడం .

    రిప్లయితొలగించండి