"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

9 మార్చి, 2010

ఈ దేశం లో ప్రాణాలు ఎంత లోకువ ??

మన దేశం లో ప్రాణం ఖరీదు ఇంత లోకువా??
మొన్న ,మొన్న బెంగుళూరు లో అపాయం లో తెరుచు కునేందుకు వీలుగా పెట్టే ఎగ్జిట్ తలుపులు తాళం వేసి ఉండడం తో,  కొంత మంది  విలువైన తమ  ప్రాణాలు కోల్పోయారు. ఆ భవనం అందం గా కనపడాలని  అంతా గాజు పలకలతో, కట్టేరు, safety ని గాలికి వదిలి. ఎప్పటి   కప్పుడు  చెకింగ్ చేయ వలసిన  అధికారులు, ఏదైనా ప్రమాదం అఏంత వరకు కళ్ళు మూసుకుని ఉంటారు. ఎగ్జిట్ తలుపులు తాళం వేసి , ఒక పక్క విష వాయువులు కమ్ము తూంటే, బయటకు వచ్చే మార్గం లేక, పై నించి కిందకి దూకిన మనుషులు, పని చేయని  లిఫ్టులు , అయినా, అగ్ని ప్రమాదం అవగానే లిఫ్టులో ప్రయాణించడం ,  ఎంత ప్రమాదం.  వెంటనే, మెట్లు ఉపయోగించాలి , ఆ మెట్లు కి ఒక తలుపు, fire  ప్రూఫ్  తలుపు ఉండాలి. మంటలు ఆర్పడానికి ఒక ఫైర్ హోసే  ఉండాలి. ఇవేమీ లేకుండా  ఆ భవనం కి ఎవరు ఇచ్చారు పెర్మిత్??  ఇలాంటి ఇంకా ఎన్ని భవనాలు ఇలాగ ప్రాణాలు తీసేందు కి ఎదురు చూస్తున్నాయి?   కుటుంబం లో అమ్మో, నాన్నో , చెల్లో,   అన్నయ్యో , ప్రాణాలు కోల్పేయి , అందరు ఏడుస్తూంటే, ఒక లక్ష రూపాయలు,లేదా రెండు లక్షలు నస్త  పరిహారం  టీవీ లలో ప్రక టించి, ఇంకా  అవమానం , ఇంకా పుండు మీద కారం చల్లడం అంటే ఇదే నేమో. ఒక ప్రాణం ఖరీదు ఇంత లోకువా?? మన దేశం లో. 
రోడ్డులు తవ్వి, గోతులు తీసి, ఒక బోర్డు కూడా పెట్టరు, చీకట్లో వీధి దీపాలు కూడా ఉండవు. నిండు ప్రాణాలు బలి అయిపోతాయి ఈ నిర్లక్షానికి. మళ్లీ మామూలు, ఏదో నష్ట పరి హారం ప్రకటన.  ఇన్ని కోట్ల మంది లో ఒక ప్రాణం పోతే నష్టం ఏమిటి అన్నా నిర్లిప్తత? ఏమిటో ఈ నిరాసక్త ,నిర్లిప్త ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ నిర్వహణ? మన మానాన మనం రోడ్డు మీద వెళుతూంటే , హోర్డింగులు పడి, గాయ పడతం, లేదా ఒక్కసారి ప్రాణాలు పోతాయి. ఒక ప్రాణం కి విలువ ఇచ్చి, ఎవరి పని వారు నిక్కచ్చి గా చేస్తే ఎంత బాగుంటుంది ఈ దేశం. 
నిన్నటికి నిన్న, ఆశ్రమం లో  ఉచిత బట్టలు, గిన్నెలు ఇస్తారంటే, వేల మంది స్త్రీలు, పిల్లలు ఒక్క సారి గా గేటులు తోసి, తొక్కిడి లో ఊపిరి ఆడక అరవై మంది స్త్రీలు, పిల్లలు ప్రాణాలు కోల్పెయారు అంటే ఎంత బాధ గా ఉందో.  ఎంత పేద దేశం మనది, ఒక చీర, ఒక పాత్ర కోసం ప్రాణాలు కూడా కోల్పోతారు. ఆ దానం చేసే వారికి ఏమి బాధ్యత లేదా?  ఒక పూట తిండి పెడతాము, ఉచితంగా , అంటే ఎంత మంది వస్తారు ఈ దేశం లో?  దాత్రు గుణం గొప్పదే కాని, ఒక బాధ్యత లేని , ఒక పేరు కోసం చేసే ,ఆలోచన లేని పనులు , ఎంత అనర్ధ దాయకం. పేద ప్రజలు ఎంత లోకువ?? 
9/11 లో ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకు ఎంత విలువ నిచ్చారు  ఆ దేశం? పరిహారం, ప్రకటనలు ఎక్కడా కనపడవు. ఏది చేసినా వ్యక్తిగతం గా చేసారు, కాని, ఇలాగ టీవీ లో ప్రకటనలు ఇచ్చి కాదు. మన దేశం ఎంత పేద దేశం, ఎంత థర్డ్ వరల్డ్ దేశం అని అందరు అన్నా, మనమే  మన దేశం లో ప్రజలని ,వారి ప్రాణం విలువని ఇంత  చీప్ గా చూస్తే, ఇంక వేరే వాళ్ళు, వేరే దేశాలు, మనలని ఎందుకు గురవిస్తాయి. 
తెర్రోరిస్ట్ తో పోరాడి, చనిపోయిన ఇన్స్పెక్టర్ వేసుకున్న జాకెట్ ని కూడా మాయం చేసి, అమ్ముకునే హాస్పిటల్ ఉద్యోగులు, అప్పుడే పుట్టిన పసి శిశువు ని కుక్కలు లాక్కుని వెలు తూంటే, అయిదు వందలు కోసం బేరం అదే ఆయాలు, వార్డ్ బోయలు, మున్సిపాలిటీ కులాయిల్లో వచ్చే నీరు తాగి , ఆసుపత్రి పాలయి, ప్రాణాలు పోయిన వారు,  కడుతున్న  బ్రిద్జేలు   కూలిపోయి, నలిగి పోయేవారు, అన్నీ, టీవీ లలో చూస్తూ  ఉంటాం, మనము మర్చి పోతాం.
ఈ దేశం లో ప్రాణాలు ఎంత లోకువ? ఎవరు కాపాడుతారు ఈ దేశాన్ని??
రైతుల ,చేనేత కార్మికుల చావులు అయితే, హెడ్ లైన్స్ న్యూస్ దాటి, ఆఖరి పేజి లలో దాగున్నాయి, ఇప్పుడు. మనకి పొద్దున్నే పేపర్ లో ఇంక ముఖ్య మైన విషయాలు ఉన్నాయి. 
యధా రాజా, తథ ప్రజా...
దేవుడా నా దేశం లో ప్రాణం కి విలువ నిచ్చే ప్రభుత్వం కోసం మేము ఏమి చెయ్యాలో???


1 కామెంట్‌:

  1. What to do?
    Taxes regular gaa kaTTaali
    bilDingullO doorE mundu helmet vundaa lEdaa choosukOvaali
    Insurance gaTraa chEyinchukOvaali
    missed-calls chEyakunDaa call chEyaali :P

    రిప్లయితొలగించండి