"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

11 మార్చి, 2010

పైన్ ఆపిల్ కేకు రెసిపి ....

లెక్క పత్రం లేకుండా ఖర్చు చేస్తున్నాము , అని, ఈ నెల నుంచి ప్రతి దీనర్ లెక్క రాద్దామని, నిశ్చయించు కున్నాం. సరే అని, పాత డైరీ తీసాను, పైన్ ఆపిల్ కేకు వండే విధానం,  చోకోలేట్ కేకు , ఇంకా ఏవో రెసిపీలు దొరికాయి. ఎప్పుడో ఎవరో, ఇంట్లో అప్ అండ్ డౌన్ పైన్ ఆపిల్ కేకు ట తిన్నాం. తిని ,బాగుంది ,అనుకుని, ఇంటికి వచ్చి, ఇంక ఎక్కడేక్కడో వెతికి , సంపాందించి రాసుకున్నాను. ఈ కేకు చేసే విధానం. ఎప్పుడైనా చేసానా? ఇంత వరకు లేదు. ఫ్రిడ్జ్ లో   ఎప్పుడూ ఉండే,  వనిల్ల ఎస్సెంస్ , మోజిరల్ల చీస్ , డార్క్ చాక్లోట్  బ్రిక్,  మష్ రూమ్స్ , ఇలాంటివి, అలంకార ప్రాయం గా ఉండి  ఎప్పుడూ సఖ్యం గా ఉండే మా మధ్య పేచీలు పెడతాయి. ఇవన్ని ఎందుకు కొంటావు? ఎప్పుడూ చేస్తావు? అంటే కళ్ళల్లో నీరు, తో, అంటే నేను ఏమి చెయ్యనా? ఎప్పుడూ ఏమి వండలేదా? అని పెద్ద సీన్ అయిపోతుంది. పాడయి పోయినవి పడేయి, అంటే సరే అని, మళ్లీ కొత్త గా కొని   పెట్టడం, ఏమో, యే క్షణం లో నాకు అనిపిస్తుందో, ఈ  కేకు వండాలని. ఇలాగ నాలుగు డైరీలు తీసి చూసాను, అన్నిట్లోనూ, ఇవే. పత్రికల్లో, టీవీ లలో,  నెట్ లో, అన్నీ రకాలు గా కల్లెక్ట్ చేసినవి.
ఇవి కాక, ఫ్రిడ్జ్  తలుపు కి మాగ్నెట్ తో అంటించి పెట్టుకున్న రోజు వారి రెసిపీలు, అంటే వంకాయ కూర, బెండ కాయ పులుసు, దోసెలు, పచ్చడ్లు, ఇలాంటివి. ఇవి అన్నీ చదివి, ఆవాలు లేవనో, జీలకర్ర లేదు అనో, నాకు చిన్నపట్నించి తెలిసిన పద్ధతి లోనే వండి పడేయడం. సేఫ్ గా తిన వచ్చు కదా అని. ఎందుకో మరి ఇలా అన్నీ  రాసి పెట్టుకోవడం? అది ఒక వ్యసనం లాగ  అయిపోయింది.  ఎప్పటి కప్పుడు నెట్ లో, అన్నీ దొరుకుతాయి కదా, మళ్లీ రాసుకోవడం ఎందుకు అంటే, ఏమో ఆ టైం లో కరెంట్  ఉండక పోతే, నెట్ డౌన్ అయి, కనెక్ట్       అవక పోతే,  ఎంత ముందు ఆలోచనో???  నా భుజం నేనే తట్టు కోవాలి.
ఇవి కాక, ఎప్పుడూ పుస్తకాల షాప్ కి వెళ్ళినా, రెండు నవలలు కొంటే ఒక రెసిపి  పుస్తకం కొనడం ఒక అలవాటు అయిపొయింది, మైక్రో వేవ్  లో వండించే పుస్తకం,  ౩౦ నిముషాలలో వండించే ఇంకో పుస్తకం,  పచ్చడ్లు, పులుసులు కి ఒక పుస్తకం,   బి పీ , షుగరు   ఇట్టే తగ్గించే ఇంకో రకం వంటలు, మన చిన్నపట్నించి అలవాటు అయిన మాలతీ చందూర్ గారి, వంటలు- పిండి వంటలు,  లేటెస్ట్ ఎడిషను,  అందు లోనించే కదా ,నేను అన్నం ఎలా వండాలో, ముద్ద పప్పు ఎలా వండాలో నేర్చు కున్నాను, పెళ్లి అయినా కొత్త లో, ఇంకా రాజు గారి, ఉప్పు, రుచి లేని  వంటల పుస్తకం,  నేను ఎప్పుడూ అది , దాచే స్తూ ఉంటాను,  కాని ,అదే ముందు కని పిస్తుంది,  ఏ  పుస్తకం కోసం వెతికినా. ఉప్పు, కారం వేస్తేనే , ఒక మాదిరి మన వంటలు,  ఉప్పు లేక పోతే  , మన వంటలు పేరు పోదూ? నేను అసలు ఉప్పు లేని కూర నోట్లో పెట్టుకోలేను. అందుకే ఆ పుస్తకం దాచేయడం.
ఉప్పు లేని కూరలు తింటే ఒక  గుప్పెడు అన్నం తక్కువ తింటామని ,ఇంట్లో వాళ్ళ ఆశ. కాని, మనం అలా  పడిపోం. ఇప్పుడి ప్పుడే  ఏభై ఏళ్ళకి, వంట కొంచం రుచి గా చేయడానికి, చేయి తిరిగింది, ఇప్పుడు, నోరు కట్టేసు కోమంటే ఎలాగా?  అన్నది నా వాదన. ఆంధ్ర వంటలు , బాగా వచ్చేసాయి, ఇంక పంజాబీ వంటలు, గుజరాతి వంటలు అని మొదలు పెట్టాను, కాని వాళ్ళని పిలిచి వడ్డిస్తే,  కారం, కారం గా ,ఈ వంట ఏదో చాల బాగుంది, ఏమిటి దీని పేరు అని పరువు తీసారు. అన్నీ  మన  పద్ధతి లో ఒక పోపు పడేసి వండేస్తాం  కదా.. ఇప్పటికీ ఒక డజను పుస్తకాలు   నిండాయి  , నా రెసిపి  కలెక్షను లతో,  కాని నేను ఎప్పుడూ చేసేవి, పండగ కి సేఫ్  గా ఒక పసుపు రంగు, ఒక తెలుపు రంగు వి అంటే, పులిహోర, సేమ్యా పాయసం, ఇవి కాక ఏవి వండినా, అమ్మా ఎందుకు అంత కష్ట  పడతావు, పద అందరం డాల్ఫిన్ లో డిన్నరు కి వెళదాం అంటూ, చాల ప్రేమ కురిపిస్తారు. ఎంతటి అమ్మ లైనా  పిల్లల ప్రేమ కి లొంగి పోతాం కదా.. అయినా పాపం ఈ బెజవాడ  స్వీట్స్ వాళ్ళు, శివరాం స్వీట్స్ లాంటి వాళ్ళు, మన లాంటి వాళ్ళ కోసమే కదా ఇంతింత పెద్ద  ,పెద్ద దుకాణాలు పెట్టుకున్నారు, వాళ్ళు ఏమి అయిపోతారు?  పావు కేజీ తెచ్చుకుంటే సరి పోతుంది, ఇంట్లో వండితే ఒక కేజీ అయినా చేస్తాం, ఎవరు తింటారు?
నా రెసిపీలు అన్నీ ఎప్పుడో, పబ్లిష్ చెయ్యాలని ఒక చిన్న, పెద్ద, రహస్యమైన కోరిక ఒకటి నా మనసు లో ఉంది, నా లాంటి వారు ఎవరో కొంటారు అని నా ధైర్యం.
అప్పటిదాకా, ఈ రోజూ వారి పద్దు రాసుకోవ డానికి, ఇంకో పుస్తకం కొనాల్సిందే.
ఎప్పుడో, ఒక రోజూ పైనే ఆపిల్ కేకు చేస్తాను, చూస్తూ ఉండండి. అదిగో, మా ఊరు వంట వచ్చే టైం అయింది.. రాసుకోవాలి మరి,ఉంటాను.

2 కామెంట్‌లు:

  1. పైనేపిల్ ని తెలుగులో అనాసపండు అంటారు

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు , అనాస అనే పదం తెలుసు కాని, కొన్ని, ఆంగ్ల పదాలు సరి పోతాయి, అనిపిస్తుంది. రెసిపి అనేది కూడా ఆంగ్లమే. నా బ్లాగ్, చదివి, మీ అభిప్రాయం తెలిపినందుకు చాల కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి