"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

3 మార్చి, 2010

ఆడ పని, మగ పని, కాదు, ఇంటి పని




ఆడ పని, మగ పని కాదు, ఇంటి పని.. అని ఆలోచించే రోజులు వచ్చాయా అంటే వచ్చాయి అనే అనిపిస్తున్నది, ఇవాల్టి పరిస్తితి  చూస్తే.ఫ్యామిలీ కోర్టులు కిట కిట లాడుతూ న్నాయి అంటున్నారు. ఆడ పిల్లలు, మునపటి లాగ లేరు, అని వాపోతున్నారు. పెళ్లి, అయితే, ఇంకా జీవితాంతం, అతనే నాకు భర్త, అతనే నా తోడూ, అని పాడుకుంటూ, భరించే పిల్లలు కాదు ఇప్పుడు, వారు చదువు కుంటున్నారు, సమానం గా సంపాదిస్తున్నారు. ఇంటి పని ఇద్దరు సమానం గా చేయాలి అని కొత్త రూల్స్ పెడుతున్నారు. పిల్లలని ఎప్పుడూ కనాలో, వారే నిర్ణయిస్తున్నారు, వారి, స్నేహితుల్లో, ఆడ వారు, మగ వారు కూడా ఉండవచ్చు, ఆఫీసు లో లేట్ గా పని చేస్తారు,  ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ కోసం, ఆఫీసు పార్టీలు , ఆఫీసు కోల్లెగేస్ అంటూ  ఒక కొత్త ప్రపంచం వారిది, శనివారం , వీకెండ్ పార్టీలు కూడా ఉంటున్నాయి. ఆడ వారిదే ఇంటి పని అన్నఆలోచనతో, ఆ వాతావరణం లో  పెరిగిన మగ పిల్లలు, ఇవి , ఈ మార్పులు జీర్ణించు కోలేక, విడాకులు అంటున్నారు, లేదా, అమ్మాయిలే, మాకు వద్దు, ఈ భర్త అంటున్నారు. అందు కే ఫ్యామిలీ కోర్టులు అంత గా నిండి పోతున్నాయి. ఆడ పిల్లలు అలోచించి, తమ మెదడు లకి  పని పెడితే , ఇవాల్టి పరిస్తి ది ఉంటుంది మరి. ఇన్నాళ్ళు, ఆమె ని, ఇల్లు, స్వర్గం, భర్త దైవం , పిల్లలు , బాధ్యతలు అంటూ బంధించారు. పెళ్లి వద్దు, అని కాదు, పిల్లలుని  కనరు అని కాదు,  కాని, ఒక  స్వతంత్ర భావన  ఆమెను కుదిపి , తన జీవితం తనది అనే ఒక   నవ్య ,విశాల, ప్రపంచం లోకి  ఆమెని లాక్కుని వెళ్ళుతోంది. కాలం మారుతోంది , లేచింది మహిళా లోకం అని ఎప్పుడో  పాడినా, ఇప్పుడే ఆ కాలం  మొదలు అయింది.
అబ్బయలు, ఈ సత్యం గమనించాలి, ఇంట్లో వంట అంతా ఆడ వారి మీద వదిలేసి, భోజనం అయ్యిందా ?? నాకు ఆకలి వేస్తోంది, అంటే, వడ్డించే వారు,  ఇప్పుడు ఉన్నారా ?? ఆడ వారికి వంటిల్లు తన రాజ్యం అనుకునే రోజులు కావివి. భార్య  ఒక్క రోజూ, ఊరికి వెళితే ,భర్త  కాఫీ ,డబ్బా ఎక్కడుందో, పంచదార ఏ రంగు లో ఉంటుందో  అని సత మతం అయ్యే రోజులు కావివి.  ఉదయం ఎనిమిది కల్ల  ఇంటిల్లి పాది, బయట పడి, ఉద్యోగాలుకి   , బడులు కి వెళ్ళాలంటే, ఇంటి ఇల్లాలు  ఒక్కరి వల్ల అయే పని కాదు. భార్య భర్తలు ఇద్దరు, తలో చెయ్యి వేస్తే కాని పని తెమలదు . ఇంట్లో పెద్ద వారు, అందరికి సాయం ఉండరు కదా. 
చంటి పిల్లలు ఉన్న వారు అయితే ,మరి కష్తం. సాయం కని వచ్చిన అత్తగారు, మా పిల్లడు, ఈ పని చేస్తున్నాడు, ఆ పని చేస్తున్నాడు అని ఎంచుతూ  కూర్చునే రోజులు కావివి. ఏ పని అయినా చెయ్యాలి, దపెర్స్ మార్చడం ఆడ వారి పని ఎక్కడా రాసి లేదు, మధ్య రాత్రి లేచి పాలు పట్టడం, నాన్న కూడా చేయ వచ్చు. తప్పేమీ లేదు. ఒక తరం వారికి , ఇవి కష్తం గా అనిపించ వచ్చు.  కాని, వచ్చింది, మహిళా లోకం నిజం గా నిద్ర లేచిన కాలం వచ్చింది. 
ఏమిటి ఫేషన్లు? ఏమిటి వస్త్రాలు? ఉన్నట్టా? లేనట్టా?? ఇంత పొట్టి గా అసలు ఎలా కుడతారు? ఎలా వేసుకుంటారు? మన పిల్లలేనా ఇలాంటివి ధరించేవి?  ఫ్రెండ్స్ అంటే మగ స్నేహితులు కూడా నా ?? ఇలాగ తిరుగుతుంటే  పెళ్లి ఎలా అవుతుంది? పెళ్లి  చేసుకుంది, తన ఇష్థం తోనే, మళ్లీ విడాకులు అంటుంది, వంట వండడం బోర్ అంటుంది,   పిల్లలు  అప్పుడే వద్దు అంటుంది, ఇంకా చదువు అంటుంది, మంచి ఉద్యోగం, మంచి జీతం. ఇవే తన ధ్యేయం  అంటుంది. ఇవి ఇప్పటి ఆడ పిల్లల తల్లి తండ్రుల ఆలోచన. ఈ మార్పు ఒక పెను మార్పు, అందరిని కుదిపి వేస్తున్నది. 
ఇంకా అమ్మలూ   , ఇంట్లో అబ్బాయలకు కూడా  వంట పని నేర్పించే సమయం వచ్చింది.  బాబూ, నీకు ఆకలి వేయ గానే , ఎవరో ఒక ఆడ వాళ్ళు ,నీకు వండి, వడ్డించ డానికి రెడీ గా ఉండరని, నీ ఆకలి కి నువ్వు బాధ్యుడవని తెలుసుకుని మెలగాలి ఇంకా.. ఇప్పటికే, పై చదువులకి వెళ్ళే మగ పిల్లలు ఇంట్లో అన్నీ నేర్చు కుని వెళుతున్నారు. నీ మాసిన బట్టలు, నీ సర్దని గది, నీ అస్త వ్యస్త ఇల్లు ఇవి, అదృశ్య హస్తాలు సర్దు తు ఉండవు ఇంక  ... చదువుతూ ఉంటే, నిజమా ?? అని పిస్తుంది. 
కాని, ఇది ఒక సంధి కాలం. విలువలు అతి వేగంగా మారి పోతున్న కాలం. ఇది మంచి, ఇది చెడు అని  విశ్లేషించు కునే సమయం లేదు. మీడియా, ఇంటర్నెట్, ప్రపంచం ని తెచ్చి మన  ఇంట్లో కట్టి పడేస్తూ న్నాయి. మన పిల్లలు పెరుగుతున్న ప్రపంచం ఇది. ఇది నువ్వు, నేను ,చేయి పెట్టి ఆపలేము, చేయి కలిపి, ఈ తరాన్ని , అర్ధం చేసుకుంటూ, ముందుకు సాగాలి, అందు కే అంటున్నా 
ఆడ పని, మగ పని, కాదు, ఇంటి పని..అని మనం మన పిల్లలకి నేర్పే కాలం ఇది.    

















2 కామెంట్‌లు:

  1. మార్పు ఎప్పుడూ మంచిదే... ముంచేది కానంత వరకూ.. ఎవరైనా ఏ పనైనా చెయ్యొచ్చు! అందులో తప్పేమీ లేదు. కానీ, చాలా చోట్ల చదూతున్నాను. ఆడవారికి కూడా కొత్త ప్రపంచం ఏర్పడుతోందీ.. వాళ్ళ జీవితం వాళ్ళది అనే నవ్య వినూత్న భావాలు విస్తరిస్తున్నాయి అని!

    కానీ ఒక విషయం గమనించండి. నేను, నా ప్రపంచం అనుకొనే సంకుచితత్వం లో , మనం మన ప్రపంచం అనే వైశాల్యం లేదు. ఎవరి స్వతంత్రం వాళ్ళు చూసుకొనేప్పుడు, ఇక పెళ్ళి, ఇల్లూ ఎందుకు? పెళ్ళి అనేది ఒక బాధ్యత అనే విషయం సంపూర్ణం గా విస్మరించి, నా ఇష్టం అనే నరక కూపం వైపు సాగుతున్న ఈ మార్పు మంచిదేనా?

    ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళా, వాళ్ళకు వ్యక్తిత్వం ఉండదా అనే ప్రశ్నలకు సమాధానం ఒకటే. వంట చెయ్యడం అంటే అదేదో చెయ్యకూడని పని చెయ్యడం అనే భావన కు పునాది ఏంటో నాకు తెలీదు. అంత ఘోరమైన విషయమా వంట చెయ్యడం, ఇల్లు చక్క దిద్దుకోవడం, పిల్లల్ని చూసుకోవడం.. ? ఆయా చర్యల వల్ల కుటుంబం బాగుంటుంది కదా..

    మార్పులు లేని గత కాలం లో, చాందస వాదం ఎక్కువగా ఉన్నా ఆకాలం లో ఒక సరోజిని నాయుడు వచ్చింది, ఒక ఇందిరమ్మ వచ్చింది.. ఇంకా చెప్పాలంటే, చాలా మంది రచయిత్రులు వచ్చారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్నారు.. మరి వారు అప్పట్లో సాంప్రదాయాలు పాటించలేదా..? ఇల్లు చక్క దిద్దుకోలేదా?

    మీరు చెప్పిన కోనం ఒక వైపు మాత్రమే. ఇద్దరూ పని చేసే వారికి ఈ వ్యాసం వర్తిస్తుంది. కానీ ఇప్పటికీ, ఉద్యోగం చేసే ఆడవారి కంటే, ఉద్యోగం చెయ్యని వాళ్ళే ఎక్కువ. ఆ ఇళ్ళల్లో కూడా, వంతులు పెడుతుంటారు... భర్త చెయ్యాలి, భర్తే వండాలి అని.. ఏమంటే, మార్పు అంటారు..

    ఆడవారి ఆలోచనల్లో వచ్చిన ఈ మార్పు వల్ల, రాబోయే కాలం లో కుటుంబ అర్థమే మారి పోతుంది. ఇప్పటికీ చాలా మంది ఆడాళ్ళలో, "ఆడాళ్ళు" అనే ప్రత్యేకత తప్ప, వేరే ఏదీ ఉండదు. కనీసం సాధించే ప్రయత్నం కూడా చెయ్యరు. ఇదీ స్త్రీల అభివృద్దా? తిరోగమనమా?

    నేను, నాది అనేది మార్పు కాదండీ, అదీ తిరోగమన సూచిక! ఈ ప్రవాహం లో బడి ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం .. ఇక రాబోయే మార్పు ఒకటే. మరింత పతనం..

    స్త్రీ ఇప్పుడు పతనమైనంత ఏ కాలం లోనూ కాలేదు. చిన్న బట్టలు కట్టుకోవడం, అలా కట్టుకోవడాన్ని అక్షేపిస్తే, "స్త్రీ స్వతంత్ర్యం" గురించి ఉపన్యాసాలు దంచడం.. ఇది ఏ విధమైన మార్పుకు సూచిక.. ?

    రిప్లయితొలగించండి
  2. వరుణుడు గారికి, నమస్కారం. నా బ్లాగ్ చదివి, మీ అభిప్రాయం తెలిపినందుకు. నేను కూడా, మీతో ఏకీభవిస్తాను, కాని, ఈ రోజుల్లో ధోరణి , ఇలాగ ఉంది అనే నేను రాసాను. నాకు తెలిసిన ఎందఱో,ఈ తరం ఆడపిల్లలని ఎలా అర్ధం చేసు కోవలో అని సత మతం అవుతున్నారు. విడాకుల వరకు వెళ్ళిపోతున్నాయి, చిన్న, చిన్న విషయాలకి సర్దు కు పోవడం అనేది ఉండడం లేదు. వివాహ సంబంధాలు చూపే సంస్థలు వచ్చాయి, వాటిల్లో, divorced వారు, ఎక్కువ ఉంటున్నారు. ఎక్కువ గా అమెరికా లో ఉన్న వారిని కూడా చూస్తాం. అమ్మాయిల ఆలోచనలు, కి అబ్బాయిల ఇష్తలు కి mismatching వల్ల అని నా కు అర్ధం అయింది. బాధ్యత లు సమానం గా పంచు కోవాలని, ప్రస్తతం అమ్మాయలు ఆశిస్తున్నారు. వారి, వ్యక్తిత్వం కి వారు గురవించు కుంటున్నారు. నిజమే, ఈ గొడవల వల్ల, పిల్లలు ఉంటే, వారు నలిగి పోతున్నారు. కోర్టుల వద్ద, అన్నిటి కన్నా, క్రిమినల్ కోర్టు ల కన్నా, కూడా, ఫ్యామిలీ కోర్టులు వద్ద ఇసక వేస్తే రాలనంత జనం ని నేను చూసాను. ఎక్కువ మండి చెప్పే సమాధానం.. judge గారు అడిగే ప్రశ్న కి.. మాకు సరిపడటం లేదు.(incompatibility) అని జవాబు ఇస్తున్నారు. ఏడాది లోపే పెళ్లి, విడాకులు అధ్యాయం , ముగుస్తోంది. మీడియా, ఇంటర్నెట్, అపరిపక్వత , ఆలోచన, వివేకం ఇవ్వని చదువులు, కుటుంబం పట్ల బాధ్యత కన్నా, తమ స్వంత ఆలోచనల కు, ఇస్తాలకు , తన మార్గం కోసం , పట్టుదలలు, పోవడం, ఇప్పుడు , ఎన్నో ఏళ్ళు గా పెళ్లి, అయి, సంసారం, చేస్తున్న వాళ్ళు, కూడా, కోర్టు మెట్లు ఎక్కుతున్నారు, విడాకులు కోసం. ఎవరి మీద ఆధార పడకుండా జీవించ గలం అనే ధైర్యం ఉంటే, ఒంటరి జీవితాన్ని కూడా ఆహ్వానిస్తున్నారు.
    ఈనాటి పరిస్థితి ని ఎరిగి మసలాలని, ఒక మేలుకొలుపు, ఒక పిలుపు, ఒక హెచ్చరిక , అనుకోండి, నా బ్లాగ్.
    మరి ఒకసారి ధన్య వాదాలు.

    రిప్లయితొలగించండి