"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

13 మార్చి, 2010

ఆ రోజూ పుట్టారుట వీళ్ళు.. మార్చ్ ఎనిమిది న

ఆ రోజూ పుట్టారుట వీళ్ళు.. మార్చ్ ఎనిమిది న ..
ఉత్తర భారత  దేశం లో, ఒక ఇంట్లో కేరే మంటూ ఏడిచింది, ఓ శిశువు. అందరి మొహం లో ఒక బాధ, ఒక సంతోషం. ఆడపిల్ల కి పెళ్లి చేయాలని ఒక బాధ, బిందెల తో మంచి నీళ్ళు మోయడానికి మరో రెండు చేతులు దొరికాయని, ఒక సంతోషం. ఇంకో రాష్ట్రం లో మరో పుట్టుక, ఇంకో నోరు భోజనం కి, ఆడ పిల్లే కదా, కొంచం ఆకలి తక్కువే, నాకూ చేయి సాయం అని, ఇంకో తల్లి, ఆలోచన, అడవి ఒడ్డున ఊరు లో ఒక కూతురు , పుట్టింది, పేడ,కట్టెలు ,తెచ్చే మరో రెండు చిట్టి చేతులు, పుట్టాయి.
ఒక మధ్య తరగతి , ఇంట్లో, అమ్మ కుళ్ళి, కుళ్ళి, ఏడుస్తోంది, లక్ష్మి పుట్టింది అనుకునే ఇంటి నించి వచ్చింది, కాని ఈ ఇంట్లో అత్తగారు, కొడుకే కావాలని, ముందే బెదిరించింది, ఇంక ఈ కూతురు బతుకు ఎలా ఉంటుందో? ఈ ఇంట్లో, అని బెంగ గా దిక్కులు చూస్తోంది. స్వాతంత్రం వచ్చింది దేశానికీ గాని, ఆడదాని  కి కాదు కదా? అనుకుంటూ ..
కూరలు అమ్మే నూకాలమ్మ కి, ఒక కూతురు, బుట్ట మోసే మరో చిన్న తల,పుట్టింది ఈ రోజే. రోడ్డులు ఊడ్చే  చిన్నదాని కి  చీపురు పట్టే మరో చిన్న సాయం, పుట్టింది ట.. ఈ రోజే. అంట్లు తోమే పనిమనిషి కీ పుట్టింది ఒక చిన్న పాప. పదేళ్ళకే నాకు అంది వస్తుంది, ఇంకో అమ్మగారి ఇంట్లో పెడతాను, అని మురిసి పోయింది. 
ఆ అమ్మగారికి ఒక ముద్దులు మూట గట్టే బుజ్జి పాప పుట్టింది. మూడో నెల కే, ఈ పాప ని ఎక్కడో ,ఎవరో చేతుల్లో వదిలి పెట్టి వెళ్ళాలి, ఈ పాప ని చక్కని చదువులు చదివించాలంటే, నేను కూడా ఉద్యోగం చేయక తప్పదు, పాప ని మూడో నెల నుంచి, క్రేచే లో వేయక తప్పదు, నా పాప పెరిగి పెద్ద అయి, తను అయినా మాతృత్వం పూర్తిగా అనుభవించే రోజూ వస్తుందా?? అని పొంగే గుండెలు తో అలమటించింది. పక్కనే ఇంకో ఇంట్లో రెండో సారి పాప పుట్టింది, ఇంక మన వంశం ఎలా నిలుస్తుంది? అని వాపోతున్నాడు ఒక తండ్రి. లక్ష్మి, సరస్వతి అని ముద్దులు పెడుతోంది, తల్లి, రహస్యంగా.. 
ఒక చక్కని , పెద్ద వారి ఇంట్లో, అపురూపం గా ,ఒక పాప పుట్టింది, చక్కని నా పాప ని డాక్టర్ ని చేస్తాను అని మురిసి పోతున్నారు, ఇద్దరు, చదువుకుని, చక్కగా , ఆస్థి, అంతస్తు ఉన్న కుటుంబం అది మరి.
ఒక రాజకీయ ప్రముఖుని ఇంట్లో ఒక పాప పుట్టింది ఈ రోజే.. హమ్మయ్య, మన రాజకీయ వారసత్వం కి ధోకా లేదు అని మురిసి పోయాడు, పెద్ద ఎత్తున సంబరాలు మారు మోగాయి.. ఆ ఇంట్లో. .
అవును మరి, ఈ రోజే మహిళా రేసేర్వషన్ బిల్లు పాస్ అయింది, రాజ్య సభ లో. ఏ రాయి అయితేనేమీ తల కొట్టడానికి, ఇప్పుడు, పేరున్న రాజకీయ మహిళా ఎంపీలు, ఎమేల్లెలు లు ఉంటారు మరి. వందల కోట్లు డబ్బు, పరపతి ఉంటేనే మరి ఎలెక్షన్లు గెలిచేది, అని మనం చూస్తున్నాం కదా? అట్టడుగున , పేద వర్గాలు, తిండి, నీడ చదువు లాంటి కనీస అవసరాలు కోసం చేసే ప్రయత్నం లో మునిగి ఉన్నారు, వారిని జేజేలు కొట్టండి, మహిళా బిల్లు జారి  అయింది అంటే, ఉండండి, ఉండండి, మా చేతులు ఖాళీ అవనీయండి.. అంటున్నారు.


ఇది మన దేశం లో పరిస్థితి, అయితే, ఇది ఒక అడుగు, ముందుకు, రాజకీయ అధికారం మహిళలని ముందుకి నడిపిస్తుందా ? అలా నడిపించడానికి, ఏ శక్తులు ఏకం అవ్వాలి.. అని ఆలోచించడం మొదలు పెడితే, తెరిచిన తలుపులు ని ఇక ఆపడం ఎవరి వల్ల కాదు, స్త్రీ శక్తీ ని తక్కువగా అంచనా   వేయకండి.. ఈ బిల్లు కి ముందు పాస్ అయిన అందరికి కంపుల్సరి చదువు ఆక్ట్ , పన్నెండు లోపల పిల్లలకి చదువు అనేది, సఫలం అవుతే, ఈ మహిళా రాజకీయ  సాధికారత  బిల్లు మరింత అర్ధవంతం అవుతుంది. 
దేశమే నా ఇల్లు అనుకుని చక్క బెట్టేందుకు, ఇల్లాళ్ళు నడుం బిగిస్తే.. ఉందేలే మంచి కాలం ముందు ముందునా..అందరు సుఖ  పడాలి నంద నందనా...అని పాడుకుందాం, ఇప్పటికీ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి