"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

30 సెప్టెం, 2012

ఒప్పుకున్నారు !!!

నేను మా అమ్మ పొట్టలో కాళ్ళు ముడుచుకుని, నా మానాన నేను ,కళ్ళు మూసుకుని ఎప్పుడెప్పుడు ఈ వెలుగు నీ ,ఈ లోకాన్ని,ఈ సుందర జీవితాన్నీ ,కళ్ళు తెరిచి చూస్తానా? అని తపస్సు చేస్తూంటే ..ఒప్పుకున్నారు.

నాకు ఊపిరి పీల్చుకోడానికి అనుమతి ఇచ్చి , ఈ వెలుగు లోకి,ఈ లోకం లోకి, ఈ సుందర మయ ప్రపంచం లోకి అడుగు పెట్టడానికి ఒప్పుకున్నారు..ట ..

అమ్మ కళ్ళల్లో  చీకటి ని, బయట ఆపరేషను బల్ల మీద వెలుగు ని కలిపిన మసక చీకట్లో కి, సంధ్య వేళ లో ,ఉషా కిరణం లా ప్రవేశించానని ,అమ్మ అప్పుడెప్పుడో ముద్దు చేస్తూ చెప్పింది, ఉష కిరణం అనే పేరు పెట్టడానికి అందరూ ఒప్పుకున్నారు అని.

అసలే కరువు రోజులు, అత్తెసరు జీతం, మాస్టారి ఉద్యోగం,దీనికి పాల డబ్బాల ఖర్చు ఒకటా? అని విసుక్కున్న ఇంట్లో వాళ్లకి అమ్మ ఏం చెప్పిందో? మరి వాళ్లకి అబ్బాయే కావాలి ట ..నాకు పాలు పట్టడానికి ,ప్రాణం నిలప దానికి ఒప్పుకున్నారు.

అమ్మ మాటలు,పాటలు, అమ్మతో చిరు ఆటలే , నా ప్రధమ చదువు.అవలీల గా అప్ప చెపుతున్న మాటలు, పాటలు చూసి, మురిసిన అమ్మ 'బడి'అంటే, ఆడపిల్ల కి చదువెందుకు ? అని అనేలోపల ,'ఉచితం' అన్న ఒక్క మాట వినిపించి ,నన్ను బడి లో వేయడానికి ఒప్పుకున్నారు.

ఎలాగో, అలాగే పెరిగాను.మా ఇంటి ముందున్న సన్నజాజి మొక్క కి నీరు పోస్తూ, అది అల్లుకుంటున్న పందిరి ని కడుతూ ,ఎంత ఎదిగి పోయిందో అని అమ్మ ఆశ్చర్య పోయింది ట ,అంతలో పూలు అందుకుంటున్న నన్ను చూసి.

మంచి మార్కులతో మెరిట్ లో పాస్ అయినందుకు ,పిలిచి కాలేజ్ లో సీట్ ఇస్తారు అంటే, అది మగ ,ఆడ కలిసి చదివే కాలేజ్ కదా ? అని ప్రశ్నించి, విచారించి, మళ్లీ ఉచితం..మీ అమ్మాయి కి చదువు అన్న మంత్రం పని చేసి ,నన్ను చదివించ దానికి ఒప్పుకున్నారు..

ఇంజనేరింగ్ లు అవి మనకెందుకు అనడం తో,ప్రతిభ ఉన్నా, బుద్ధి గా డిగ్రీ కాలేజ్ లో బి ఏ చదువుకుంటాను అంటే ఒప్పుకున్నారు.

కాలేజ్ చదువు తో పాటు ,కంపూటర్ చదువు , మంచి ఉద్యోగం వస్తుంది నాన్నా  అంటే ఒప్పుకున్నారు..

అన్నట్టే ఉద్యోగం వచ్చింది, నేను మిమ్మలిని పోషిస్తా నాన్నా, అమ్మా అంటే కాదు ,ఆడ పిల్లవి, పెళ్లి చేసుకో ..అన్నారు..నేను ఒప్పుకున్నాను.

చదువు, ఉద్యోగం ,అందం చూసి ఎవరో ఒకరు వచ్చారు పెళ్లి చేసుకోవడానికి ,ఉద్యోగం చేసే 'పిల్ల' అనే అర్హత ఉన్నందుకు ,కట్నం లో కన్సెషను దొరికింది.నీకు ఇష్టమేనా ? అని అడగ నైన అడగకుండా నాన్న ఒప్పుకున్నారు.

అందరూ ఒప్పుకున్నారు..పెళ్లి జరిగింది.
ఉన్న ఊరు లోనే ఉద్యోగం. కాపరం పెట్టాం.పెళ్లి అయిన ఉద్యోగం చేయ దానికి ఒప్పుకున్నారు. 

జీతం వాళ్ళ చేతిలో పెట్టి ,బస్సు పాస్ నా చేతిలో పెట్టి, ఇంట్లో పని కి ఆటంకం లేదు అన్న షరతు తో ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నారు.

ఇంటికి ,ఆరు గంటల కి రావాలి, ఉద్యోగ స్థలం లో మగ వారి తో అనవసర మాటలు కూడదు, కాంటీన్ ల లో తినడాలు, అనవసర ఖర్చులు అనేవి పై షరతులు...పెట్టి నేను ఉద్యోగం చేసి, జీతం తెచ్చి వారి చేతికి ఇచ్చేటట్టు ఒప్పుకున్నారు.

నాలో చురుకు,నిజాయితీ ,ప్రతిభ చూసి, కంపనీ నన్ను ప్రమోట్ చేసింది, జీతం పెరిగింది. దానికి ఒప్పుకున్నారు..

కాని, ఒక షరతు, పని ఎక్కువయింది. రాత్రి ఎనిమిది దాటుతోంది, నేను ఇంటికి వచ్చే సరికి. పని లో కష్టం పెరిగింది, ఇది దాటితే ఇంకా పెద్ద మానేజర్ పోస్ట్ ఇస్తారుట ..దీనికి ఒప్పుకోలేదు.

నీ సేవలు మీ కంపనీ కేనా ? ఇంటి పని ఎవరు చేస్తారు? అని నిల దీసారు?

పుట్టుక ముందు నించి, అణిగి, అణిగి, తొక్కి పెట్టి ఉన్న నా నిస్సహాయత ..న ఆక్రోశం ,నా క్రోధం ఆ రోజు లావా ల ఉప్పొంగింది.

ఆ రోజు నేను ఒప్పుకోలేదు.

నాకు నా ఉద్యోగం కావాలి, నా స్వాతంత్ర్యం కావలి, నా బ్రతుకు కావలి, నా ఆశలు నెర వేరాలి, నా కలలు ,నిజం కావాలి..

నేను ఒప్పుకును, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను..

మీరు ఒప్పుకున్నా ,లేకున్నా, ఇది నా జీవితం..అని ఒక అడుగు ముందుకు వేసాను..

గుండెల నిండా ధైర్యం ,స్థైర్యం ఈ ఉషా  కిరణం ..దారి వెలుగు వేపే..ఇంక.




4 కామెంట్‌లు:

  1. ఆడపిల్లలు తన కాళ్ళమీద నిలబడిన తర్వాతనే పెళ్ళికి అంగీకరించాలి. పెళ్ళయిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తానని షరతు పెట్టాలి... స్త్రీ నిత్యం అనుభవిస్తున్న బాధలను చాలా బాగా వ్రాశారండీ!

    రిప్లయితొలగించండి
  2. కాయల నాగేంద్ర గారు,
    ధన్యవాదాలు, మీ అభిప్రాయం ఇక్కడ రాసి నందుకు.
    అవును ,తన కాళ్ళ మీద తను నిలబడిన తరువాతే పెళ్లి,సంసారం.
    చదవు ముఖ్యం..ప్రతి ఒక్కర్కి ,ఆడ అయిన మగ వారయినా,
    చదువు, ఆర్ధిక స్వాతంత్ర్యం..ఇవి ముఖ్యం..నా చిన్న కథ
    నచ్చినందుకు సంతోషం.
    వసంతం.

    రిప్లయితొలగించండి
  3. అంత ధైర్యంగానూ వుండాలండీ అమ్మాయిలు.. బాగా రాసారు..

    రిప్లయితొలగించండి
  4. శ్రీ లలిత,
    ధన్యవాదాలు, అవును ...ఇలా ఉండాలి..అనే నా ఆశ.
    వసంతం.

    రిప్లయితొలగించండి