"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

21 మే, 2013

ఓరగా వేసి ఉన్న తలుపులు

ఓరగా వేసి ఉన్న తలుపులు 
నాకు ఎప్పుడూ ఇష్టమే ,
ఓరగా తెరిచిన పుస్తకం 
పక్క వాడి పుస్తకం లో కథ 
ఊహించడం ఎంత బాగుంటుందో ?

నా మానాన నేను ఎత్తుగా ,
కిటికీ దగ్గర దొరికిన సీటు లో కూర్చుని, 
సుదూరం గా ఎగురుతున్న పక్షుల ఇళ్ళు 
ఎక్కడో ? ఎలా చేరుకుంటాయో ? ఏ వేళ కో 
అనే ఆలోచనల చిక్కు లో చిక్కుకుని ఉంటే 

ఓరగా తలుపులు మూసి, పల్చని తెరలు 
ఎగురుతూ, పచ్చని గోడల మీద ఏదో ఒక 
జంట ఫ్రేం లో గోడ మీద ఒక క్షణం లో ఎంత 
చూడగలనో అంతా చూసేను . 

ఇంక రాత్రి అంత కలలు ,ఆ ఇంట్లో ఎవరుంటారో?
సంతోషం గా ఉంటారా? గోడ మీద జంట ఎవరో?
పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరిపోయారా ?
ఎక్కడో కొట్టుకుంటూ ,చూడమ్మా తమ్ముడు అనే అక్క ఉందా?

ఓర గా వేసిన తలుపులు వెనక ఎన్ని కథలో 
నాకెంత ఇష్టమో ? నేను రాయని కథలు అన్ని ఇక్కడే 
నాకు చెప్పని కథలు ,ఈ తలుపులు పోనీ చెప్పకూడదూ 
నిర్దాక్షిణ్యం గా రాత్రి అయేసరికి మూసుకుంటాయి తలుపులు 
దానితో బాటు నా కథలు ,నిద్రపోతాయి .. 
ఓరగా తెరిచినా తలుపులు ,కథలు చెపితే ? ! ?


5 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. ఓరగా వేసి ఉన్న మనసు తలుపుల వెనిక ఎన్ని భావాలున్నాయో ఒక్కొక్కటే బయటపడుతున్నాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju garu,
      అవునండీ, ఒక్కొక్కరి మూసి ఉన్న తలుపుల వెనక ఎన్ని కథలో మనం ఊహించుకోవడమే, నిజా నిజాలు మనకి తెలియవు, ఎవరి కథలు వారే రాసుకుంటారు, లేదా దాచుకుంటారు.
      నా కవిత లు చదివి మీ అభిప్రాయాలు ఓపికగా రాస్తున్నందుకు నా మనస్ఫూర్తి ధన్యవాదాలు మీకు.
      వసంతం.

      తొలగించండి
  3. ఓరగా వేసి ఉన్న మనసు తలుపుల వెనిక ఎన్ని భావాలున్నాయో ....:)

    రిప్లయితొలగించండి