"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

28 మే, 2013

టచ్ మీ నాట్ ...

ముట్టుకుంటే ముడుచుకు పోతుంది 
ఆత్తి పత్తి , టచ్ మీ నాట్ అంటారు,  
ముచ్చట పడి ముట్టుకంటే ,సిగ్గుతో 
బిడియం తో ఎర్రగా కంది పోతుంది 

మనకి కూడా అలా ముడుచుకు పోయే 
గుణం ఉంది కాని, మొరటు చేతులు 
ఎక్కడెక్కడో పాకి, అసహ్యం ని చిందిస్తాయి . 
నా ఒళ్లంతా ముళ్ళై పోతే బాగుండును 
వాడిని రక్కి, రక్తాలు కారించి, హింస కి 
అర్ధం  చూపిస్తాను , నేను గులాబి బాల నే 
కాదు, ముళ్ళ కవచం ధరించిన బాలను ,
నా ఒంటి మీద చూపు పడినా ఖబదదార్ 
అంటూ ఒక్క పిడికిలితో మట్టి ని కరిపిస్తా . 

నేను ఆకాశం లో సగాన్ని కాదు ,ఆకాశం ని 
నన్ను తాకితే తగిలేది విద్యుత్ ప్రవాహం 
నీ ఒళ్లంతా కాల్చి, మసి చేసే వేయి వోల్టుల షాక్ 
మాడి మసి అయితే నీ బూడిద కూడా నల్లటి మసి . 

ఎందుకింత చులకన ? ఎందుకింత పలచన ?
నువ్వు ఎక్కడినించి పుట్టావో, అదే నీ జన్మ స్థలం 
అదే నీ అమ్మ ,నీకెందుకు జన్మ నిచ్చనా ?అని 
పరితపించే క్షణం . . మృగం కూడా సిగ్గు పడి ఛి 
అని చీత్కారించే అధముడివి నీవు. మదమెక్కిన మగవాడా ! 

వావి లేదు, వరస లేదు, పచ్చి మొగ్గ, పసి కందు 
పాలు కారే బుగ్గలు, ఎలా చేయి వేస్తావు అసలు ?
నీ గుండెలో ప్రవహించేది రక్తం కాదురా ,
నీ సిరల లో ప్రవహించేది కుళ్ళుకాలువ కచడా 
ఎత్తి పోసి, తొక్కి పెట్టి, నిలువునా చంపినా 
మా కసి తీరదు, మా ఆవేశం రంగు చూసి ,
నీ కలలో కూడా భయపడాలి నువ్వు...

అత్తిపత్తి లా ఇంకేమాత్రం ముడుచుకోం మేం 
ముళ్ళ కవచం మా ఒళ్లంతా కాచుకో మరి 
నీ ఒంటి మీద పడే ప్రతి ముళ్ళ గుర్తు ఇంకా 
నీ జీవితాంతం ,నీ అమానుష సాక్షులు ... 






1 కామెంట్‌:

  1. అత్తిపత్తి లా ఇంకేమాత్రం ముడుచుకోం మేం
    ముళ్ళ కవచం మా ఒళ్లంతా కాచుకో మరి.......చాలా బాగా రాశారు వసంత గారు ...ఆ రోజుకోసం ఎదురుచూస్తుంటాను....ఎప్పుడో చదివి కవిత ఈ సంధర్బంగా.
    రెండు కళ్ల్లలొంచి చూపులు
    సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతుంటాయి.
    ఆ కళ్లల్లో ఎప్పుడు ఒకే సంకేతం,చొంగ కార్చే కుక్కలాంటి ఆకలుంటుంది.
    ఆ కళ్లను వేటాడటానికి ఇక నుంచి కళ్లతోనే యుద్దం చేస్తాను.
    ఆడదానికి ఒల్లంతా ముళ్లుండే రోజుకోసం ఎదురుచూసాను.

    రిప్లయితొలగించండి