"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

25 ఫిబ్ర, 2010

టమాటాలు అర్ధ రూపాయి,కేజీ ?

టమాటాలు అర్ధ రూపాయి కేజీ ట, టీవీ లో చూసాను, ఎగిరి కోనేయాలని, సంవత్స రానికి సరి పడ పచ్చడి పెట్టు కోవాలని అనిపించ లేదు, చాల దుఖం, బాధ కలిగి, ఆలోచన లో పడ్డాను. నిన్నటి కి నిన్న కష్టపడి, వంకాయ కూర ఉల్లికారం, మసాల అంతా దట్టించి చేస్తే, విషం లాగ, చేదు గా, వగరు గా ఉంది ఆ కూర, ముందు గా నేను రుచి చూసి, డస్ట్ బిన్ కి ఆహరం చేశాను, ఉసూరు మంటూ, మళ్లీ ఇంకో కూర వండాను. వండితే కాని, రుచి  తెలియదు, వెధవ వంకాయ అని మనసు లో తిట్టుకున్నాను. మొన్న కష్ట పడి , తెలుగు లో ఏదో ఒక బ్లాగ్ అంతా రాసాక ఏమి నొక్కానో, మొత్తం అంతా మాయం అయిపొయింది, కన్నీళ్లు ఒక్కటే తక్కువ.ఇవాళ టీవీ లో అర్ధ రూపాయి కి పడి పోయిన టమాటాల  ధర ను చూసి, కడుపు మండి పోయి, నేల మీద ఒంపుకున్న రైతు లని చూసి, నా కన్నీళ్లు ఎంత వృధా నో అనిపించింది. 
నేల దున్ని, సాగు చేసి, విత్తనాలు  వేసి, చీడలు కి మందు పెట్టి, నీరు పెట్టి, పంట అందు కునే సమయాని కి ఆ విత్తనాలు నకిలీ వి, పంట బూటకం, చేతిలో అప్పులే నిజం అని తెలిసిన రైతు కన్నీళ్లు ఎంత నిజం. పంట చేతికి వచ్చేంత వరకు, ఆ విత్తనాలు మంచివో , కావో , ఎవరికీ తెలుసు. వ్యవ సాయ శాఖ అధికారులు ,చెప్పినవే కొన్నారు. ప్రైవేటు వ్యాపారస్తులు మోసం చేస్తారు అని, ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలే ,పోసారు, అయినా నష్టం  తప్పలేదు. అంతా మాయ లాగ ఉంటుంది. ఇప్పుడు యూరియా ధర పెంచారు, కరెంటు, ఎప్పుడూ వస్తుందో, నీరు ఎప్పుడూ పెట్టు కోవాలో, ఏ క్షణం లో తుఫాను వస్తుందో, ఏ క్షణం లో ధరలు పడి పోతాయో, ఏ క్షణం లో ప్రభుత్వం ఈ భూములు మాకు అమ్మండి, ఇక్కడ ఒక పెద్ద సెజ్ వస్తుంది, మీకు ఒక ఉద్యోగం వస్తుంది అని మాయ మాటలు చెప్పి మోసం చేస్తారో, ఏ క్షణం లో నాన్నా నాకు పరీక్ష ఫీజు కట్టాలి, డబ్బు పంపు అని కొడుకు ఉత్తరం రాస్తాడో, ఏ క్షణం లో, భార్య నగలు తాకట్టు కి నడుస్తాయో, ఏ క్షణం లో ఏ కబురు వస్తుందో,  ఏమవుతుందో ఆ రైతు, మనకి అన్నం పెట్టే ఆ రైతు కి తెలియదు. 
ఉల్లిపాయలు  ధర పెరిగితే, ఆందోళన లు చేస్తాం, పెట్రోల్ ఏభై రూపాయలు అయితే, అంతర్జాతీయ మార్కెట్ అని నిట్టూర్చి ,  స్కూటర్లు లో ,కార్ల లో పోయించు కుని ప్రయాణం చేస్తాం రోజూ తప్పదు కదా మరి. బియ్యం ధర పెరిగి పోయింది, అని వాపోతం కంచం లో అన్నం లాగిస్తూ, రైతు కి ఏమైనా ఇస్తున్నారా ఈ పెరిగిన ధర లో, అతనికి ఎంత, మధ్య వర్తులు కి ఎంత, ప్రభుత్వం ఎంత?? ఈ ధరల పెరుగుదల బాధ్యత? రైతు ఎందుకు అంత బీద పరిస్థితి లో ఉన్నాడు? నష్టం  వస్తున్నా  ఎందుకు ఇంకా పండిస్తున్నాడు?? మనకి మన ఉద్యోగం లో జీతం నచ్చక పోతే, ఇంకో ఉద్యోగం వెతుక్కుంటాం, రైతు ఇంకో పంట వేస్తాడు, ఎలాగో ఒక లాగ , భూమి ని నమ్ముకుని బతుకుతాడు . 
మనం రోజూ, ప్రొద్దున్నే లేచి, దణ్ణం పెట్టు కోవాలి, రైతు కి, మనకి కంచం లో కి అన్నీ రుచులు అమర్చి పెట్టేది, ఆ మహానుభావుడే. రైతు లని నానా  కష్టా లు  పెడితే, అతను విసిగి, పంటలు పండిం చడం మానేసి, భూములు అమ్ముకుని, కారులు కొను క్కుని, పట్టణం లో వ్యాపారాలు చేసుకుని, బ్రతికితే మనం ఇంక రోజు ఇంత అన్నం తినడం మానేసి, బర్గర్లు, పిజ్జాలు, అమెరికా వాళ్ళు మనకి వడ్డించేవి, గుప్పెడు డబ్బులు పుచ్చుకుని,తిని, నోరు కట్టుకుని బతకాల్సిందే . 
మనం ఒక వస్తువు ఉత్పత్తి   చేస్తే, మనమే ఆ ధర నిర్ణయిస్తాం, ఒక సాఫ్ట్ వారే ప్రోగ్రమ్మే రాస్తే,మనమే అమ్ముతాం మనకి లాభం వచ్చే ధరకి.కాని, ఒక రైతు మటుకు తన పంట ని ఎవరో చెప్పిన ధర కు అమ్మలి, ప్రభుత్వం కూడా ఈ మోసం లో భాగం. అమ్మక పోతే, ఎక్కడా దాచు కొంటాడు ,ఆ పంటని? మళ్లీ, పొలం పనులు మొదలు పెట్టాలి, ఇంకో పంట కి భూమి ని సిద్ధం  చేసుకోవాలి, సంవత్సరం పొడుగునా ఏదో ఒక పని, ఆదివారాలు లేవు, సిక్ లీవులు  లేవు, అప్పులు ఇచ్చే బ్యాంకులు చుట్టూ తిరగాలి, మోటార్లు కాలిపోతే లో వోల్టేజ్  కి, బాగు చేయించు కోవాలి, పిల్లలని చదువు కోసం పట్నం లో పెట్టాలి, ఒళ్ళు బాగో లేక పోతే, పట్నం కి పోయి హాస్పిటల్ లో చూపించు కోవాలి, ఇన్ని ఈతి బాధ లతో, ఇంకా భూమి ని నమ్ముకుని, మనకి బియ్యాలు, పప్పులు, కాయ గూరలు ఇంక ఎన్నో పండించి, మనకి ఒక జీవం ఇస్తున్నాడంటే , రైతు కాళ్ళ కి మొక్క ల్సిందే, దేముడా అని.
రైతు ని పట్టించు కోండి అని ప్రదర్శన లు చేద్దాం, ప్రభుత్వం మేలుకునేలా, ప్రజలు మేలు కోవాలి, టమాటాలు అర్ధ రూపాయి కి అమ్ముతున్నారు అంటే, పచ్చళ్ళు పెట్టు కోవడం కాదు, ఏమిటి ఈ దురాగతం అని మధ్య వర్తి, వ్యాపార స్తులని ప్రశ్నించుదాం . రైతు ల కన్నీళ్లు మన కి శాపం అని ఎరిగి, బడా వ్యాపారస్తు లు   చిన్న చిన్న రైతు లని కొనేయడం మనకి ఎంత నష్ట మో ముందు ముందు మన దేశం తిండి కోసం ఎలా పెద్ద దేశం ముందు అడుక్కు తినాల్సి వస్తుందో, ఆ ఖర్మ ఏమిటో, ఆ దుస్థితి ఏమిటో, అన్నీ కాస్త తెలివి గా అలోచించి  , మెలకువ తో మెలగ వలసిన రోజులు ఇవి.
రైతులని , మట్టి తో అనుబంధం పెంచు కున్న రైతుల ని కాపాడడం మన దేశం లో అందరి బాధ్యత, అంటే, నీది, నాది. ఎవరో కాదు...ఇంక నేను ఇంకో కూర తో అన్నం తిన వచ్చు.. ను ఇవాల్టికి. నాకు అన్నం పెట్టే రైతు మహా రాజు ని తలచు కుంటూ.. తల వొంచి నమస్కరిస్తూ.. నా చిన్న పొట్ట, శ్రీరామా  రక్షా... 

3 కామెంట్‌లు:

  1. ఇవాళ రైతులు పడుతున్న ఆవేదనను చక్కగా వెల్లడించారు. మీరు చెప్పినవన్నీ అక్షరాలా నిజాలు.

    రిప్లయితొలగించండి
  2. వసంతం గారూ,
    రైతు బాధల్ని చాలా చక్కగా వివరించారు....ఎప్పుడో చిన్నప్పుడు ఓ కథ చదివా.."వెన్నెముక వింటిబాణమై"...నా మనసులో ప్రతి లైనూ అలా గుర్తుండిపోయింది...అందులో దేశంలో మొత్తం రైతులూ,ఒక్కసారిగా వ్యవసాయం మానేసి పట్నాలకెళ్ళిపోతారు....అప్పుడు దేశానికంతటికీ రైతు గుర్తొస్తాడు...అలాంటి ఉద్యమాలు రావాలి.వస్తేగానీ,మన వాళ్ళకి బుద్ధిరాదు.రైతు పండించిన పంటకి ఎవడో ధర నిర్ణయించటం కాకుండా, రైతే నిర్ణయించాలి....

    రిప్లయితొలగించండి
  3. రవి చంద్ర గారికి, కౌటిల్య గారికి,
    నా నమస్కారం. నా బ్లాగ్ చదివి, మీ విలువైన అభిప్రాయం తెలిపినందుకు, నాకు చాల సంతోషం గా ఉంది. ఆలోచనా అనే జ్యోతి ని వెలిగిస్తే, వెలుగు అనే ఆచరణ ,అంధ కారం ని తొలగిస్తుంది , అనే ఒక గుప్పెడు ఆశ తో, ఈ బ్లాగ్ రాస్తున్నాను, నా లాగే ఇంక ఎందఱో ఉన్నారు, చేతిలో దీపం తో, అంటే, నాకు చిరు వెలుగుల దారి కనిపిస్తున్నది. నా స్నేహితురాలు అడిగింది, అయితే, మేము ఏమి చెయ్యాలి ఇప్పుడు?? అని. ముందు గా చైతన్యం, సమస్య పట్ల అవగాహన. సమస్య ని పరిష్క రించు కోవడానికి, రైతులు చేసే పోరాటం కి మన వంతు సహాయం, చేతల్లో కాక పోతే, మాటల్లో, ప్రజల మాట చాల బల మైనది, అని చూపించాలి, మునం కన్నా మాట మేలు, మాట కన్నా చేతలు మేలు. నేను రాసిన బ్లాగ్ లోనే, చెప్పాను గాని, మళ్లీ చెపుతున్నాను, సమస్యలు ఉన్నాయి అని గుర్తించడమే, ముందు అడుగు. అడుగులు కలిస్తే దారి ఏర్పడుతుంది అని నా నమ్మకం. మీరు నా బ్లాగ్స్ అన్నీ చదివి, మీ అభిప్రాయం ఇలాగే చెపుతూ ఉంటారని ఆశిశ్తున్నాను. ఆహ్వానిస్తున్నాను.

    రిప్లయితొలగించండి