"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

18 సెప్టెం, 2011

కార్పోరేట్ విష సంస్కృతి..

 ఇవాళే కూడలి లో ఈ విషయం విన్నాను. చిన్నారి గీత ప్రియ. ,ఎడబాటు తట్టుకోలేక, పాప తల్లి తండ్రులు, ఆదిలక్ష్మి-లెనిన్ గార్లు ఆత్మ హత్య ప్రయత్నం చేసారు అని,ఇది ,నిజం గా గుండెలు పిండేసే సత్యం.
లెనిన్ గారు పోయారని, ఆది లక్ష్మి గారు కోలుకుంటున్నారు అని.

ఒక స్కూల్ కూడా నడిపే వీరు,ఈ కార్పోరేట్ కాలేజ్ లో ఎందుకు జాయిన్ చేసారు మీ పాపని.? ఈ కాలేజ్ లు వల్ల జరిగే నష్టాలు ,మనం చూస్తూనే ఉన్నాం. వారికి చదువు కన్నా ముందు ఒక పోటి తత్త్వం మప్పుతారు. మొదటి నెల లోనే, పరీక్సలు పెట్టి, వందకి వంద మార్కులు వచ్చిన వారి నందరిని, ఒక సేక్షున్ లో వేస్తారు.ఇంక వారికే బాగా చెప్పే మాస్టర్లు,మిగిలిన వారిని పరీక్షలు పెట్టి, మార్కులు చూపించి, మీరు ఎందుకు పనికి రారు అని వారిలో ఆత్మ న్యూనత పెరిగేలా,ఆత్మ విశ్వాసం కోల్పోయేలా ,పదే పదే ,ఒకే విషయాన్ని చెపుతూ, ఎవరేజ్ గా చదివే పిల్లలిని బాగా చదివిస్తారనే కదా ,ఈ కాలేజ్ లలో ,వేలకి వేలు ఫీజు కట్టి జాయిన్ చేస్తారు.

వీల్లందిరిని విడిగా ఒక సేక్షున్ లో పడేసి, చదువు చెప్పడం మానేసి, పరీక్షలు తో చంపుతారు. అని తెలుసు,కాని, ఇలా నిజం  గా చంపేస్తారా ? నాకు కళ్ళ లలో నుంచి నీళ్ళు కారి పోతున్నాయి.
విద్య ని అందించ వలసిన ప్రభుత్వాలు ఇలా ,చదువు కొట్లు, అంగడి లు, ఖరీదు కు కొనే చదువు కొట్టాలు పెట్టడానికి అనుమతులు ఎందుకు ఇస్తారు? విద్య ప్రాధమిక హక్కు, అనేది కేవలం కాగితం మీద రాత లేన?

మధ్య తరగతి పిల్లలికి, చదువే ఆధారం..ఒక ఆధారం ఇచ్చే చదువు, ఒక ఇంజినీరింగ్ చదువే అన్నం పెడుతుందని, లక్షల్లో జీతాలు వస్తాయి అని, విదేశాల్లో ఉన్నత విద్య చదివి, ఇంకా బాగా పైకి రాగలం అని నమ్మి, ఎన్నో ఆశలతో ,ఈ కార్పోరేట్ కాలేజ్ లో జాయిన్ అవుతారు.

వారిని అనలేం,పిల్లలు బాగా  పైకి రావాలని ,వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు.
ఈ కార్పోరేట్ దగా నించి విముక్తి లేదా? ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లు ఎందుకు సరి పదా లేవు? ఎందుకు ,మంచి మాస్టర్లు ని వేసు కోరు? విద్య లోనే ఇంత అవినీతి.

చీడ పట్టేసింది, ఈ విద్య వృక్షం కి, ఈ విష ఫలాలు ఎలా ఉంటాయో మనం చూస్తున్నాం,

బలవంత మరణాలు, తల్లి తండ్రులకి పుత్ర శోకం మిగల్చడం, లేదా,  బుర్రలు వేడి ఎక్కే బలవంతపు చదువు ల నుండి విరామం కోసం, బైకుల మీద ,అతి వేగం తో నడిపి, ప్రాణాలు కోల్పోడం, లేదా కాళ్లు చేతులు విరగూట్టుకోవడం, లేదా పనికి మాలిన నెట్ విషాని ,తలకి ఎక్కించుకుని, అమ్మాయిలను ఏడిపించడం లాంటి రాక్షస ప్రవ్రుత్తి తో, ఒక పనికి మాలిన జాతి ని తయారు చేసే వికృత కోర్ప్రేట్ సంస్థలు కి ఎవరు చరమ గీతం..పాడుతారో?

ఎవరి బాధ్యతో?? ప్రభుత్వం.. ఒక నిద్ర పోతున్న ఎద్దు..దానిని ఎవరు అంకుశం తో పోడుస్తారో?

ఎవరికీ వారు, ఇలా చేతులు ముడుచు కుని, దేవుడా? అని ఇలా ప్రాణాలు పోతున్న గీత ప్రియ లను, వారి అమ్మ నాన్న లని చూస్తూ , చేతులు ముడుచుకుని, కళ్ళు మూసుకుని, మనం ఇలా సిగ్గు లేకుండా గడపాల్సిందే..

యథా రాజా తదా ప్రజా..

లెనిన్, గీత ప్రియ ఆత్మ లకి శాంతి కలగాలని,

చదువు  ఒక నరకం కాదు, అని వెలుగు నిచ్చే చదువు ఒకటి ఉన్నదని ,ఆ లోకం లోనైనా తెలుస్తుందని, భార మైన మనసు తో, ఈ టపా ఆమె కి అంకితం.

13 కామెంట్‌లు:

  1. థాంక్స్ అంది, కరెక్ట్ చేసాను పేరు, పేరు ఏది అయినా, ఇలాంటివి జరుగు తున్నవేన్నో? చాల బాధ గా ఉంది ఈ వేళ.
    vasantham.

    రిప్లయితొలగించండి
  2. డాక్టరో, ఇంజినీరో అవ్వకపోతే ఇంకో ఉద్యోగం దొరకదా? నా స్నేహితుడే ఎలెక్ట్రానిక్ ఇంజినీరింగ్ చదివాడు కానీ ఇంజినీర్ ఉద్యోగం దొరకలేదు, SBHలో క్లర్క్ ఉద్యోగం దొరికింది. కెరీర్ పోయిందనుకుని ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు?

    రిప్లయితొలగించండి
  3. ప్రవీణ్ శర్మ గారు, ఉద్యోగం రాదు అని కాదు, ఆ లేత వయసు లో, నువ్వు పాస్, నువ్వు ఫెయిల్, నువ్వు ఎందుకు పనికి రావు అంటూ d సేక్షున్ అనే ఒక కింది సేక్షున్ లో వేస్తారు. ఇంత కష్ట పడి తల్లి తండ్రులు ,ఇంత ఫీజు కట్టి చదివించు తున్నారు, నేను ఎందుకూ కోర గాకుండా పోతానా? అని ఒక తీవ్ర నిరాశ, నిస్పృహ, ఆత్మ న్యూనత ,తో బెంగ పడి, ప్రాణం తీసుకుంటున్నారు. ఈ వయసు అలాంటిది, తీవ్ర మైన ఆవేశాలు, తొందర పాటు..
    ఉజ్వల భవిష్యత్తు కోసం ,ఈ కాలేజుల్లో జాయిన్ చేస్తే, ఇలాంటివి వింటున్నాం.. సున్నిత మనస్కులు తట్టుకోలేరు ..తిరస్కరణలు, అపహస్యాలు. నా ప్రాణం విల విల లాడుతున్నది.ఇది విన్నప్పటి నించి.

    వసంతం.

    రిప్లయితొలగించండి
  4. నేను చదివిన స్కూల్‌లో సెక్షన్‌లకీ, ర్యాంక్‌కీ సంబంధం ఉండేది కాదు. ఎవరికి ఏ సెక్షన్‌లో ఖాళీ దొరికితే ఆ సెక్షన్‌లో వేసేవాళ్ళు. మా స్కూల్‌లో టీచర్లు విద్యార్థులని కించపరిచే మాటలు మాత్రం ఆడేవాళ్ళు. మగవాళ్ళు చదవకపోతే హొటెళ్ళలో ప్లేట్లు కడుగుతారనీ, ఆడవాళ్ళు చదవకపోతే అంట్లు తోముతారనీ అనేవాళ్ళు. అలాంటి మాటలు విని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. ప్లేట్లు కడిగేవాళ్ళూ, అంట్లు తోమేవాళ్ళూ మనుషులు కారన్నట్టు వాళ్ళ పేరు చెప్పి కించపరచడం ఎందుకు?

    రిప్లయితొలగించండి
  5. ప్రవీణ్ శర్మ గారు, మీరు చదివింది ఒక ప్రభుత్వ బడి కాని కాలేజ్ గాని అయి ఉంటుంది. ఇప్పటి ప్రైవేట్ కాలేజ్ ల లో ఎలాంటి వత్తిడి పెడతారో మీకు తెలియదు అనుకుంటాను. చదవక పోతే అడుక్కు తింటావు, లేదా..పెళ్లి చేసేస్తారు, అని నవ్వుతూ అనే ఉపాధ్యాయులు కాదు అంది..ఆడ పిల్లలికి ..ఇప్పుడు లక్షలు ఇచ్చే ఉపాధ్యాయులు ,రిజల్ట్స్ చూపించాలి. పరీక్ష మీద పరీక్ష. పక్క వాళ్ళతో పోల్చడం. కింది సేక్షున్ కి దిమ్పేయడం, వారికీ చదువు కి చేయూత నివ్వటం లేదు. కించ పరిచి, చులకన గా మాట్లాడి, వాళ్ళని రెచ్చ గొట్టడం..ఇది అంది ఇప్పటి సంస్కృతి. లేక పోతే ఒక చిన్న వయసు అమ్మాయి కి ప్రాణాలు తీసు కోవాలని ఎందుకు అని పిస్తుంది, అందులో అంత గ ప్రేమించే తల్లి తండ్రి ఉండి..

    రిప్లయితొలగించండి
  6. ర్యాంక్‌లంటే నాకు వచ్చినవి కూడా మొదటి ర్యాంక్‌లు కాదు. నేను కార్పొరేట్ కాలేజ్‌లో చదవలేదు. అక్కడ విద్యార్థులపై ఇలాంటి ఒత్తిడి ఉంటుందని నాకు తెలియదు. చదివితే నాలుగు చక్రాల బండి (కార్) నడుపుతావు, చదవకపోతే మూడు చక్రాల బండి (ఆటో లేదా రిక్షా) నడుపుతావు అంటూ కించపరిచినవాళ్ళు మాత్రమే నాకు తెలుసు.

    రిప్లయితొలగించండి
  7. మీరు చెప్పింది నిజం. ఈ వార్త విన్నప్పటి నుండీ మనసు చేదుగా అయి పోయింది. ఇంకా ఎంత మంది చిన్నపిల్లల్ని ఈ కాలేజీ భూతం బలితీసుకొంటుందో. పది, పదకొండు, పన్నెండు తరగతలు ఆంద్రాలో పిల్లలకి గండమే. అంత ప్రెజర్ పెట్టద్దు అనటం సులువే, కానీ మద్య, దిగువ మద్య తరగతి వారికి పైకి రావటానికి చదువువే ఏకైక మార్గంగా కన్పిస్తున్నప్పుడు, తక్కువ కాలేజీలు ఉన్నప్పుడు తల్లి దండ్రులకు కూడా ఇంకో మార్గం లేక పోతోంది. ప్రొఫెషనల్ చదువు చవక అయ్యి స్టాండర్స్ పెరిగే రోజు ఈ ఎంట్రన్స్ లు అన్నీ ఇల్లీగల్ అయ్యేరోజు ఎప్పుడు వస్తుందో.

    రిప్లయితొలగించండి
  8. మెడిసినో, ఇంజినీరింగో తప్ప భవిష్యత్ లేదు అన్న ఆటిట్యూడ్ మారాలి. ఈ రోజుల్లో ఇంజినీరింగ్ చేసి చిప్ప పట్టుకొనే వాళ్ళు ఎంతమంది లెరు.

    రిప్లయితొలగించండి
  9. మైత్రేయి గారు,నిజం..ఈ కోచింగ్ సెంటర్స్ ఎప్పుడు మూతబడుతయా? అని నేను ఎదురు చూస్తున్నాను.ఎంజేనీరింగ్ సీట్లు లక్ష పైన ఉన్నాయి, పిలిచి ఇస్తున్నారు, మంచి దాని లో సీట్ వస్తే, భవిష్యత్తు బాగుంటుందని మధ్య తరగతి పేరెంట్స్ ఆశ. ఎంజేనీరింగో, మెడిసినో వద్దు ,అనుకుంటే, మంచి డిగ్రీ కాలేజ్ లు ఎక్కడ ఉన్నాయి? సిటి లలో ఉంటాయి. కాని, చిన్న టౌన్ ల లో, డిగ్రీ చదివితే ,ఏం ఉద్యోగాలు వస్తున్నాయి, మళ్లీ పై చదువు ఎం ఎస్ సీ..నో ఎం ఎ నో చేయాలి,ఉన్నంతలో ఎంజేనీరింగ్ అయితే ఉద్యోగాలు వస్తాయని ఆశ.
    ఈ వత్తిడి లేని, చదువు కోసం చదువు ..కునే రోజు, కొనే రోజు కాదు..ఏదో ఆశ.ఇంకా ఎంత మంది చిన్నారులను బలి తీసుకున్తాయో, ఈ కార్పోరేట్ చదువులు.
    కృష్ణ గారికి కూడా కృతజ్ఞతలు..ఇదే సమాధానం.
    vasantham.

    రిప్లయితొలగించండి
  10. ఒక కోచింగ్ సెంటరులో ఎంతమంది విద్యార్థులు ఉంటారు?
    వాళ్ళు వ్రాసే పరీక్షలో నెగ్గితే సంబంధిత కాలేజీలు అన్నీ కలుపుకుని ఎంతమందికి సీటు రావచ్చు?
    ఒక కోచింగ్ సెంటరు, ఎంత పేరున్నదైనా సరే అందులో అత్యధిక శాతం ఎంతమంది తగిన రీతిలో ఉత్తీర్ణులు కాగలరు? తప్పనిసరిగా మిగిలిపోయిన వారి సంఖ్యే ఎక్కువ (చాలా ఎక్కువ) ఉంటుంది కదా?
    ఈ మిగిలిన వారికి భవిష్యత్తులో ఏమేమి అవకాశాలు ఉంటాయి?
    ఆ అవకాశాలకీ ప్రొఫెషనల్ కాలేజీలో సీటు సాధించిన వాళ్ళకీ ఉన్న అవకాశాల మధ్య వ్యత్యాసం ఎంత?
    ఈ పోటీ ఎంత డబ్బు సంపాదించగలరు అన్న దాని మీద ఆధారపడిందా?
    లేక ప్రతి ఒక్కరూ తమ పిల్లలు తెలివైన వాళ్ళు, సాధించగలిగిన సత్తా ఉన్న వాళ్ళు అన్న 'పరువు ' పోరాటం మీద ఆధారపడినదా?
    'తెలివి 'ని పరీక్షించుకోవడానికీ, ఉపయోగించడానికీ ఇది ఒక్కటే మార్గమా?
    లేక ఇది తమ ప్రయత్నం, లక్ష్యం, కృషి evaluate చేసుకుని మార్గనిర్దేశం చేసుకోవడానికి ఉపయోగపడాలా?
    మన దేశానికి ఎంత మంది ఇంజనీర్లు అవసరం?
    ఎంతమంది తయారవుతున్నారు?
    అందులో ఎంతమంది ఉపయోగపడుతున్నారు?
    విదేశావకాశాలు మొదలైనవి అన్నీ కలుపుకున్నా ఎంతమంది ప్రొఫెషనల్స్ కావాలి?
    ఎంతమంది aspire చేస్తున్నారు?
    ఉద్యోగం సాధించాక పోటీ ఆగిపోతుందా?
    జీవితంలో సంతృప్తి ఉంటుందా?
    విజయానికి పరిభాష ఏమిటి?
    ఇవన్నీ నన్ను ఆలోచింపచేసే ప్రశ్నలు.


    ఇక్కడ ప్రస్తావించిన సందర్భంలో మాత్రం క్షణికంగా నిస్సహాయంగా ఫీల్ అయ్యి ఒక చిన్న అమ్మాయి తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయం అది. అందుకు బాధ్యులు ఎందరో. కానీ hind sight లోనే కారణాలు కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు సమస్యలు పెద్దగా అనిపించకపోవచ్చు. తల్లి దండ్రులుగా చాలా భయం కలిగించే విషయం. తాము కని పెంచే పిల్లలు, అనుక్షణం ప్రాణానికి ప్రాణంలా కాపాడుకునే పిల్లలు, ఏ విధంగా పెంచినా ఎలా ఎదుగుతారు, ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా ప్రభావితమౌతారు అన్నది తమ చేతిలో లేదు అన్న కఠోర వాస్తవాన్ని కళ్ళ ఉందు ఉంచే విషయం ఇది. చాలా మంది గట్టెక్కుతారు. ఒకప్పటి విద్యార్థులమే, ఇవి కాక పోతే ఇంకోలాంటి గండాలూ, ఒత్తిళ్ళూ ఎదుర్కునో, అదృష్టవశాత్తో పైకొచ్చిన వాళ్ళమే ఇప్పటి తల్లిదండ్రులం. ఓడిపోయిన లేదా పరిస్థితులకి దురదృష్టవశాత్తూ బలైపోయిన కొన్ని సంఘటనలు చాలు కొండంత బరువు నింపడానికి. మన ఆలోచనలను మళ్ళీ పర్యవేక్షించుకోవడానికి. ఆశతో ముందుకు సాగవలసినదే. ఎవరికి వారు జీవితంలో వివిధ విషయాల ప్రాముఖ్యత ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు నడవాల్సిందే. ఒకరి నిర్ణయాలు మనం తీసుకోలేము. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా సహృదయంతో అర్థం చేసుకోవాల్సిందే. చెతనైతే సాయం చెయ్యాల్సిందే. సాయం చేస్తున్న వాళ్ళని అభినందించాల్సిందే.

    రిప్లయితొలగించండి
  11. లలిత జి గారు,చక్కగా విశ్లేషించారు,సమస్య ని. విద్యార్ధులు, అందులో ఇంటర్ మీడియాట్ చదువుతున్న పిల్లలు కి చదువు వత్తది తో పాటు, ఈ ప్రేమ పలకరింపు గొడవలు ఉంటాయి, ఒక పక్క తల్లిదండ్రుల ఆశలు, మరో పక్క ,చుట్టూ కనిపించే రక రకాల ఆకర్షణలు, ఎంతో సున్నితమైన వయసు ఇది. తల్లి తండ్రులు ఎంత పర్య వేక్షిస్తున్న ,స్నేహితుల ఇన్ఫ్లు ఎన్సు ..చాల ఎక్కువ..నిజం, మీరు చెప్పింది. చేతనైతే సాయం చేయడం ,లేదా చేస్తున్నవారిని అభినందించడం..ఒక్కటే మనం చేయగలం. కృతజ్ఞతలు,చక్కని కామెంట్ రాసి, ఆలోచన రేపెట్టినందుకు.
    vasantham.

    రిప్లయితొలగించండి
  12. ఎలెక్ట్రానిక్ ఇంజినీరింగ్ చదివి ఉద్యోగానికి వెళ్ళకుండా వ్యాపారం పెట్టుకున్న ఒక వ్యక్తి నాకు తెలుసు. అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. అతనికి ఉద్యోగానికి వెళ్ళమన్నా వెళ్ళలేదు. అతనికి వ్యాపారంలో లాభాలు వచ్చి ఇప్పుడు కార్‌లో తిరుగుతున్నాడు. జీవితంలో ఉద్యోగం ఒక్కటే పరమార్థం అనుకుంటే బాగుపడము.

    రిప్లయితొలగించండి