"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

12 నవం, 2012

జీవితమే ఒక దీపావళి..

జీవితమే ఒక దీపావళి..


ఇంట్లో ఆనందం వెల్లి విరిసిన రోజు..


మతాబులు పూస్తాయి..


అంటే ఇల్లాలు చక్కగా రుచి గా 

పప్పు,ఒక ముద్ద కూర, ఒక వేపుడు, ఒక రోటి పచ్చడి..


ఘుమఘుమలాడే సాంబారు , తేలికగా రసం, గట్టి పెరుగు,


ఫెళ ఫెళ లాడే అప్పడం, రుచి కి ఓ పచ్చడి బద్ద

వండి ,వడ్డించిన రోజు..


ఇంకో రోజు..


ఒక్క కూర తో సరి పెట్టుకోండి.. 


రుస రుస లే కాకర పూవత్తులు..

క్రికెట్ ఇంట్లో ఆడతావా? నేను కొన్న 

క్రిస్టల్ వెస్ పగల గొడతావా?

బాబు వీపు విమానం మోత..

ఇంట్లో నే లక్ష్మి బాంబులు..

నా పుట్టిన రోజు?గుర్తు లేదా?

కోపం బుస కొట్టింది, పాము బిళ్ళ లు ఇంట్లోనే 

అమ్మాయి స్కూల్ లొ ఫస్ట్ వచ్చిందా?

అబ్బ ..చిచ్చు బుడ్డే..అమ్మా నాన్న మొహాలు.

తమ్ముడి కి ఏడుపు..అన్నీ అక్క కేనా??

చీదేసిన మతాబు..

అమ్మ షొప్పింగ్ బిల్ల్ చూసినప్పుడు...నాన్న మొహం లో

ఎర్రగా సీమ టపాకాయ చిమ చిమ లు..

అక్క కోసం బావ గారు వచ్చేరా ?

అక్క కళ్ళ ల్లో ఏమిటవి? విష్ణు చక్రాలా?

ఇంక హొం వొర్క్ చేయని రోజు..తమ్ముడు 

నేల మీద పడి పోయి చేసే ఆక్షన్..కడుపు నొప్పి అంటూ.

భూచక్రమే అది మరి...మా ఇంట్లొ..ప్రతి ఇంట్లొ..

ఇలాంటి ఎన్నో , సంతొషాలు

ప్రతి రోజు..

జీవితమే ఒక దీపావళి ...

సరదా, సరదా ,గా ,మీ కోసం...

దీపావళి .శుభాకాంక్షలు..

2 కామెంట్‌లు:

  1. మీ దీపావళి బాణాసంచా బాగా పేలిందండీ.. అభినందనలు..
    మీకు, మీ కుటుంబసభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ లలిత..
      మీకు నచ్చినందుకు సంతోషం..
      మది లొ వెలిగింది ఒక మతాబు..
      మరి కొన్ని కితాబులు ఇంక
      వెలిగిస్తాయి చిచ్చుబుడ్డులు
      వచ్చేను కదా ఇంక దీపావళి
      నాకు అప్పుడు..మీకు కూడా నా దీపావళి శుభాకంక్షలు
      వసంతం.

      తొలగించండి