"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

9 నవం, 2012

ప్రేమ అంటే ఏమిటి??

ప్రేమ అంటే ఏమిటి??

అని ప్రశ్నించాడు అతడు

ప్రేమ ఎన్ని రకాలు??

ప్రేమ ఒక్క సారే పుడుతుందా?

లేక మళ్ళీ మళ్ళీ నా?

నాకు ఈ విశ్వం అంతా ప్రేమే 

కనిపిస్తుంది..

మరి నువ్వు ఏ ప్రేమ


గురించి మాట్లాడు తున్నావో? 

గాలి ప్రేమ గా వీస్తుంది, అందరిని 

ఒక్క లాగే పలకరిస్తుంది..ప్రేమిస్తుంది.
.
వెలుతురు,వెన్నెల అందరికి 

ఒక్క లాగే ,కురిపిస్తాయి ప్రేమగా, 

భూమి ప్రతి రుతువు కి

వన్నె చిన్నెలతో, కనువిందు చేస్తూ 

ప్రేమిస్తుంది అందరిని ఒక్క లాగే

ఈ రుతువు ,ఈ రొజు, ఈ రాత్రి కి 

ఇక చాలు అని ఏనాడు..అనుకోవు..అవి,,

ప్రేమ ఒక భావన ,ఒక స్థితి ,ఒక అస్తిత్వ

కారకం..

మరి నువ్వు ఏ ప్రేమ గురించి 

మాట్లాడుతున్నావో

మౌనంగా అతడు కదలి పోయాడు 

ఒక్క సారి కళ్ళూ తెరచి చూడాలి మరి..

ప్రేమ కోసం

మూసిన కళ్ళు ని తెరచి.

2 కామెంట్‌లు:

  1. ప్రేమ అనుభూతి అయితే..ఇంకొక వ్యక్తి లేకుండా అది ఉండదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Chinni....
      ప్రేమ మన నించే
      ప్రారంభం అవుతుంది.
      నిన్ను ,నువ్వు ముందు ప్రేమించుకొ,
      ప్రక్రుతి లో మమేకమై,
      ప్రేమ ఒక అనుభూతి స్థాయి కి
      రావాలి, విశ్వ ప్రేమ ఒక
      అలౌకిక భావన..
      దాని కొసమే ఈ కవిత.
      vasantam

      తొలగించండి