"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

14 నవం, 2012

చిల్ద్రెన్ డే ట .

ఎన్నో ,అంటే  నిజం గా చాల ఏళ్ల క్రితం..
నవంబరు పద్నాలుగు ,చాచా నెహ్రు పుట్టిన రోజు..
మేం అంటే నేను నా ప్రియ స్నేహితురాలు, ఇప్పుడు ఆడపడచు ,గుంటూర్ ధన్ గారి రవి కోచింగ్ లో మెడికల్ ప్రవేశ పరీక్ష కి కోచింగ్ అని జాయిన్ అయాం.
ఏలూరు నించి వచ్చి, గుంటూర్ లో కోచింగ్. నాకు తెలిసి ,మన ఆంద్ర లో మొట్ట మొదటి కోచింగ్ సెంటర్ అదే..
రోజూ కి రెండు షిఫ్ట్స్ ..
మాది మధ్యాన్నం షిఫ్ట్..
మా బస మెడికల్ కాలేజ్ మహిళా హాస్టల్..
అప్పుడు వారికీ సెలవులు..

మధ్యాన్నం కదా మా క్లాసు , నవంబరు పద్నాలుగు నాడు ,ఒక రిక్షా ఎక్కి ,బ్రాడి పెట్, అరండల్ పెట్, జిలాని సెంటర్, అంటూ అన్ని సెంటర్ లు వెతికేసాం...ఒక్కటి అంటే ఒక్కటి మార్నింగ్ షో ,ఉండదా ? అని..

అప్పట్లో మార్నింగ్ షో లు తక్కువ.

చ..నెహ్రు గారు, ప్రధమ ప్రధాని మీద ఇంతయినా, లేసం అంత అయినా గురవం లేదు, పిల్లలేమే కదా మేము కూడా, ఒక మార్నింగ్ షో ,వెయ్యరా? అంటూ ఓ చికాకు పరాకులు పడి పోయిన జ్ఞాపకం ఎంత బాగుందో??

పసి తనం ,బాల్యం అందరికి ఒక మధుర జ్ఞాపకాల పెట్టె.
తెరిస్తే చాలు ఘుప్పని ,ఇన్ని మల్లెలు, సన్న జాజులు, సంపెంగులు కల గలిపిన ,ఒక  పరిమళం మనసుని ఆవరించు కుంటుంది.

అయినా, మనం ఏమంత పెద్ద వాళ్ళం యామని..
పక్క వారికీ ఎక్కువ మార్కులు వస్తే ,మొహం ముడుచుకునే మన ముఖం..గుర్తుందా?
మొన్న పక్కింటి వారు ,నలభై రెండు ఇంచీల కొత్త టీ వి కొనుక్కుంటే మన మొహం కూడా అలాగే రంగులు మారి పోయింది కదండీ..

అబ్బ ,ఆవిడ నేక్లేస్ సెట్ ఎంత బాగుందో ?నాకు కూడా ఒకటి ఉంటె ,ఎంత బాగుంటుంది..
అనే మన లో, చిన్న ప్పుడు ,వాడి చేతిలో చాక్లెట్ చూసి నోరు ఊరిన మనం కనిపించటం లేదూ..

అక్క కి జ్వరం కాబట్టి స్కూల్ ,కి సెలవు రా, నువ్వు వెళ్ళొచ్చు నీకేమిటి అనే అమ్మ ఆ రోజు ఎలా కనిపించింది..నిర్దాక్షిణ్యం కి మారు రూపు లాగ.

సండే ,అయితే ఏమిటి ఆకలి కి సెలవు ఉండదు కదా ,పద గరిట పట్టుకుని వంటింట్లో కి, వంట వండు అనే ఆయన మొహం కూడా అచ్చం అలాగే లేదూ..

నేను పెద్ద దాన్ని ఎప్పుడు అయాను కనక..

వర్షం లో ఐస్ క్రీం తినాలని, కాసేపు వర్షం లో తడిసి, పిల్ల లకి మటుకు జలుబు లు జ్వరాలు రాకోడదు అని మొక్కు కుంటూ..రోడ్డు మీద నిలిచిన చిన్న మడుగుల లో కాళ్ళుతొక్కి ,ఒక చిన్న ఫౌంటెన్ తెప్పించాలని..

అని కోరుకునే నేను...ఇంకా చిన్న పిల్లనే మనసులో, 
నేనే కాదు...అందరూ, మీరు కూడా..

ఇంకో మధుర మయిన జ్ఞాపకం..మేం రామకృష్ణ నగర్ లో ఒక ఇంట్లో ఉండే వాళ్ళం. పెద్ద ,ఎత్తు అరుగుల ఇల్లు అది...ఆ ఇంటికి మేం ఎప్పుడూ తలుపులు మూసినా గుర్తు లేదు..
రాత్రి కూడా..ఎప్పుడూ బార్ల తెరిచే ఉండేవి..

అమ్మ ,నాన్న , ఆరుగురం పిల్లలం..వెరసి ఎనిమిది మందిమి..రెండు అంటే రెండే గదులు...బెడ్ రూమ్స్ అనేవి..
కాని, మాకు మటుకు, పెద్ద ఇల్లు అది..ఎంత పెద్ద దో ,మరో అరడజను ఫ్రెండ్స్ కూడా ఒక మూల ఎక్కడో కనిపించే వారు..

ఒక రోజు పెద్ద వర్షం..వడగళ్ళ వాన..జ్ఞానం వచ్చేక మొదటి సరి ,వడగళ్ళు చూడ్డం ..

అందరం అమ్మ, నాన్న గారితో సహా అందరం వర్షం లో తడు స్తూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గుండ్రం గా తిరుగుతూ ,వడగాలు కొన్ని నోట్లో వేసుకుని మరి కొన్ని టి తో ఒకరి నొకరు కొట్టుకుని గంటలు ,గంటలు గడిపేసాం.

వాన కే విసుగు వచ్చి ఆగి పోయింది..కాని ,మా సంతోషం మటుకు ,ఒక జ్ఞాపకాల వాన అయిపొయింది మనసు లో ..

బాల్యం పసితనం.ఆ అమాయక సంతోషాలు ఉండి పోవాలి అండి ,కల కాలం..

అబ్బే ,మనం ఏమంత పెద్ద మనుషులం కాదు లెండి..
పదండి ,మనం చిల్ద్రెన్ డే ట ...

పదండి...సరదాగా గడుపు కుందాం..

సరే మరి ఇవాల్టికి వంట ఇంటికి తాళం మరి..

ఉండనా మరి...





2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఠాంక్స్ అండి
      అందరికి ఇలాగే ఉంటాయి
      జ్ఞాపకాలు ,అందుకే
      ఇది నా ఒక్కరివి కావు..
      అందరివి..జ్ఞాపకాలు.
      vasantham..

      తొలగించండి