"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

16 నవం, 2012

ఎదురు చూపులు...


నిరంతరం

ఏ కథలు చెప్పుకుంటాయో 

ఆ గులక రాళ్ళు,

ఆ నది అలలు..

ఎప్పటికీ

అంతం లేదేమో ..

కాలం ఆగి వినాలి

ఇది ఈ కథ ముగింపు 

అని చెప్పే వరకూ

ఈ నిరంతర కథ 

గల గలా సాగి పొతూ 

ఉండాల్సిందే..

అప్పుడప్పుడు

కథ వినడానికి చంద్రుడు 

కూడా మకాం వేస్తాదు.

చిన్న పసి పాప మొహం లా

నవ్వుతూ, అమ్మ పైట లోకి 

దూరి పొతున్నట్టు..

ఆటలు ఆడుతూ,

ఏమయింది? తర్వాత ఏమయింది

అంటూ, ప్రశ్నిస్తూ ..

మొహం చిన్న బుచ్చుకుని 

ఎక్కడికో వెళ్ళీ పోతూ ఉంటాడు.

నది కి మటుకు 

అమ్మ లాగే ఓపిక ఎక్కువే

వస్తాడు లే, ఈ దొబూచలాటలు..

నాకు తెలిసినవే లే 

అంటూ,,ముసి ముసి నవ్వులు నవ్వుతుంది..

అదిగొ అలలు ఎగిసి పడలే..

ఎన్నెన్ని కథలు దాచుకుందో 

ఈ నది తన కదుపులో 

ఎన్నెన్ని చిత్రాలు చూసిందో 

మరెన్ని ఒంటరి రాత్రులు ..

గడిపిందో . ..

ఏమో ....ఏమిటొ..

ఆ కథలు నాకు వినాలని 

కోరిక..

అందుకే 

నేను...ఇలా 

నది ఒడ్డున 

ఎదురు చూపులు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి