"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

13 నవం, 2012

నా జ్ఞాపకాల మతాబు

ఇవాళ దీపావళి అని కాబోలు 
గాలి బలం గా వేస్తోంది,
ఒక్క దీపం కూడా వెలిగి 
నిలిచేలా లేదు..

ధరలు కొండెక్కి కూర్చున్నాయి..
పొయ్యి మీద కి వెళితే 
పొయ్యి కే ఎసరు, గ్యాస్ ధర  
ఆకాశం అంచులు తాకింది..

పండగ రా పిల్లలు అంటే సెలవు 
నాన్నా ఉండు, ఈ గేమ్ ,
ఆడనీ ,అంటూ లాప్ టాప్ లోనే 
దీపావళి శోభ అంతా ,నా గుండె 
లోనే గూడు కట్టుకుంది.

దీపావళి ఇంక ..
చరిత్ర పుస్తకం లో పాట మే మరి 
కాలం గాలం లో చిక్కుకున్న 
పండగ లు, పర్వాలు..

ఫాస్ట్, ఫాస్ట్...అంతా ఫాస్ట్..
పండగ సి .డి లు,లక్ష్మి 
యంత్రాలు ,వందో, వెయ్యో 
పడేస్తే దొరుకుతాయి..

దేవుడు గుడి, హుండీ లో పది 
వేస్తే సరి, అన్ని పాపాలు 
కొట్టుకు పోతాయి..
అసలు అమావస్య చీకటేది?

అంతా వెలుగు ,జిలుగులు 
మట్టి ప్రమిదలు మట్టి లో 
కలిసి పోయాయి, చైనా 
వెలుగులు ట ,చీప్ గా వెలుగిస్తాయి ట ..

దీపావళి నా మనసులో 
ఎప్పుడూ వెలిగే ఉంటుంది..
అంటూ నిత్తోర్చి 
నా జ్ఞాపకాల మతాబు వెలిగించాను..
ఈసారికి సరే మరి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి