"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

22 జన, 2013

మౌనం ... ఘనీభవించి ,పెద్ద పెద్ద మంచు పలక

మౌనం ...
ఘనీభవించి ,పెద్ద పెద్ద మంచు పలక 
ప్రాంతాల అసమానత ,చిచ్చు 
రగిలి ,రగిలి ,రావణ కాష్టం లాగ 
వేడి తగిలినా, ఈ మంచు పలక కరగదు.

నడి రోడ్డు మీద స్త్రీ ని, మాన భంగం 
చేసి, ప్రాణాలు పీల్చి , మానం మీద బట్ట 
కూడా ఊడ దీసి, వెర్రి తలలు వేసిన 
మనవ మృగం వికటాట్టహాసం , చెవులని 
చిల్లులు పొడుస్తూ ఉంటే ..మౌనమ్ ,మంచు పలక 
మరింత ఘనీభవించి ,నిస్తేజం గా చూపులు 
ఆకాసానికో ,వీపుకో అతికించి , 
నిస్తేజం గా, సినిమా హాల్ తెర మీద బొమ్మ ,
వార్త పేపర్ లోనో ఒక వార్త..ఇంటి గోడ మీద 
చిన్నదృశ్య  పెట్టె లో ఒక వినోదం క్షణం లా 

రోడ్డు మీద ఆకలికి ,సొలసి పడి పోయిన 
ముదుసలి కి, మందు బాబేమో అని 
పేరు పెట్టి, వాడి ఖర్మ, అని వాహనాల లో 
బిరా బిరా పోతాం..ఒక్క పూట ఆకలి కి 
ఓర్వలేని మనం..ఆకలి చావులా?
బిర్యాని ఆఖరి ముద్ద నోట్లో పడేసుకంటూ 
నోరు పుక్కిలిస్తాం...మంచు పలక ఘనీభావిస్తూ 

ఉంటుంది..ఒక మంచు పలక మన మధ్య..
అయినా ,మనం తప్పించుకుని ,తప్పించుకుని 
హలో, హలో కుశలమా అని సెల్ ల లో 
పలక రించు కుంటూ ,పోలో మని పోతూ 
ఉంటాం, రోజు రోజు కి, మంచు పలక 
హిమాలయాల అంత ఎత్తై , కాళ్ళకి ,కళ్ళకి 
అడ్డు వస్తూ మనుషులని నొక్కేస్తూ ఉంటుంది 

మంచు పలక లు, నలు చదరం గా ,
గదులు గదులు గా..కుంచించు కు పోతూ,
అయినా , రోజు కి ఇన్ని గంటలు ఇస్తే చాలు,
ఇంతింత జీతాలు ఇస్తే చాలు, మాకు 
ఇంకేమి వద్దు, ఏమిటి ఘోరాలా?
మేమూ వెలిగించేం కదా, మిణుకు మిణుకు 
మనే కొవ్వొత్తులు, ఒక నిరసన గొంతు లో..

మంచు పలకలు, విరివిగా పరచుకుని 
భూమి ఒక మంచు గోళం అయింది ..
ఇంకా శబ్దం , మొదలు అవలేదు, ఇంకా సృష్టి 
కి ఆరంభం అవలేదు, అంతా చలనం లేని మంచు 
ఒక్క కిరణం, ఒక్క శబ్దం, ఒక్క పలుకు,
ఒక్క అరుపు, ఒక్క కేక, ఒక్క తీక్ష్ణ ,చురుకు మనే 
స్పృహ ,ఎక్కడయినా మొదలయితే ...

ఈ మంచు పలక ని బద్దలు కొట్టవచ్చు..
కాని ,ఇప్పట్లో ఏమి ఆ ఊహే లేదు..
రండి, ఈ మంచు పలకల మధ్య ,
శరీరాల వేడి రగిలించుకుంటూ , శబ్దం లేకుండా 
మౌనం దీక్ష ని, అల్లుకుంటూ , మానవ జాతి ,నర జాతి 
ఎలా కుంచించుకు పోతోందో చూస్తూ ఉందాం..

ఈ మంచు పలకలే ,
మన గుండె అంచులు గా మలిచాం..
మేం చలి గుండె ని తెల్లని రక్త నాలాలతో 
నడుపుతాం..మేమే మంచు పలకలం, అసలు..
ఇంకా వేరే సందేహమా? 
శబ్దం ఉంటే , నిరసన గళం అంటూ ఉంటే 
ఎప్పుడో ఈ మంచు పలక పగిలేది కాదా?






2 కామెంట్‌లు:

  1. ఏమిటి ఘోరాలా?
    మేమూ వెలిగించేం కదా, మిణుకు మిణుకు
    మనే కొవ్వొత్తులు, ఒక నిరసన గొంతు లో..నిజమే ఘనీభవించిన మంచుపలకలం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. డేవిడ్ గారు...
      మీరు ఓపిక గా మీ అభిప్రాయాలని ఇక్కడ రాసి పెట్టినందుకు
      నా వందనాలు..ఒక కవి కి ప్రతి స్పందన చాలా హుషారు నిచ్చి ,నడుస్తున్న మార్గం సరి అయినదే అని భరోసా ఇస్తుందండి..

      చాలా థాంక్స్..

      వసంతం.

      తొలగించండి