"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

23 నవం, 2009

పాపా,అక్క,భార్య,తల్లి...లేని రోజు ..ఎడారే కదా..

చిన్న చిన్న పిలకలు వేసుకుని ,గంపెడు పుస్తకాలు మోసు కుంటూ వెళ్ళే ఒక చిన్న పిల్ల,
అమ్మ కి బుల్లి బుల్లి చేతులతో సాయం చేయడానికి ప్రయత్నించే బుల్లి బుల్లి చేతులు,
ఆ చేతులతోనే తమ్ముడు కి స్నానం చేయించే అమ్మకి నీళ్లు అందించే అక్క చేతులు,
ఇంటికి, అలసిన నాన్న , ఇంటికి రాగానే, మంచి నీళ్లు అందించే కూతురి చేతులు,
అద్దం లో అందమైన తన మొహం చూసుకుంటూ ,పౌడర్ రాసుకుంటూ , మురిసి పోయే ముచ్చటైన చేతులు,
అన్నం వడ్డించే చేతులు.. పండగ కి ముగ్గులు పెట్టే  చేతులు ,చేలో పంటలని కోసే చేతులు,
చీర కట్టుకుని ,పైట  వేసుకునే చేతులు , ఇల్లు అలికే చేతులు, అక్షరాలు దిద్దే చేతులు,
అక్షరాలు దిద్దించే చేతులు, సైకిల్ తొక్కే చేతులు, కళ్లు మూసు కుని దొంగాట ఆడే   చేతులు,
అమ్మని చుట్టుకుని ముద్దులు గుడిచే  చేతులు, అమ్మాయి చేతులు, అందమైన చేతులు,
ఈ చేతులు, ఈ అమ్మాయలు మనకి ఇంక కనిపించక పోతే???
మన దేశం లో ప్రతి సంవత్సరం , మూడు లక్షల మంది ఆడ గర్భస్థ శిశువులని చంపేస్తున్నారు .
పుట్టక ముందే చంపేయడానికి వాళ్ళు చేసిన నేరం ఏమిటి???
ఇది అన్నిటి కన్నా ఘోరమైన హత్య, పాపం.
ఏమి చేయాలి మనం.. ఇది ఆపడానికి..
మనం ఆడపిల్లల మని గర్వ పడాలి, గర్వ పడేలా, మన పిల్లలని పెంచాలి. అడ పిల్లలు ఎందు లోను తక్కువ కారు అని ఎలుగెత్తి  చెప్పాలి. మన లో తర తర లు గా పాతు కు పోయిన అపోహలు ని తొలగించుకోవాలి. ఆడపిల్లలు కి సమానం గా స్వేచ్చ , అధికారం , గురవం ఇవ్వాలి.
మన లోను ఉన్నా న్యూనత భావాలను తొలగిం చుకోవాలి.
ఆడవారూ.. మీరు సగం కాదు.. మీరు సంపూర్ణం.
మీరు ఆకాశం, భూమి కాదు, మీరు ఒక స్పందించే, ఆలోచించే హృదయం,ఒక మెదడు, ఒక శరీరం, ఒక దృష్టి, ఒక చేయూత, ఒక నిలకడ..ఒక సూర్యుడు, ఒక శక్తీ.
ఈ ఆడపిల్లలే లేని దేశం ఉహించు కొండి.
అది ఒక ఎడారి.. మెలకువ తెచ్చుకుంటారా . ఇప్పటికైనా ???

5 కామెంట్‌లు:

  1. ముగ్గురు ఆడపిల్లలతల్లిని....ఒక ప్రేమను పంచె తల్లిని...ఆదవారూ మీరు సంపూర్ణం అని మీరంటే సంతోశాపడక ఏమి చేస్తాను?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మి రాఘవ,

      మీ పరిచయం ..అవడం..ఇలా బాగుందండి అవును , ఆడ పిల్లలు లేని ఇల్లు ,ఎంత కళ తప్పి ఉంటుందో, మేం నలుగురం అక్క చేల్లెల్లం, నాకు ఇద్దరు కొడుకులే ఇంకా కోడలనే కూతురు అనుకోవాలని వెయిటింగ్..

      మీ పరిచయం చూసేను, అతడు సినిమా గురించి కూడా ఒక పోస్ట్ ఉంది చదవండి, మనకి కామన్, గా చాల అభిరుచులు కలిసాయి.

      వసంతం.

      తొలగించండి
  2. aadapillalu unna illu entha kala ga untundo naaku telusu ...naaku iddaru aadapillalu ani garvam ga cheppukuntanu .....very well vasantha gaaru

    రిప్లయితొలగించండి
  3. రమణ కుమార్ అల్లంశెట్టి గారూ ,
    నా పోస్ట్ చదివి మీ స్పందన తెలిపినందుకు నా ధన్యవాదాలు అండి ,ముందుగా ,ఎంత అదృష్టవంతులో ఇద్దరూ ఆడపిల్లల తండ్రి అయారు మీరు .. ఆప్యాయం గా ఆదరంగా తల్లి తండ్రులని కనిపెట్టి చూసుకునేది ఆడపిల్లే అండీ లేదా ,కూతురు లాంటి కోడలు ..ఆమే ఆడపిల్లే కదా ..
    మరొకసారి థాంక్యూ మీకు .
    వసంత లక్ష్మి

    రిప్లయితొలగించండి
  4. తలితండ్రుల కసాయి చేతుల వెనక కనిపించని కారుణ్యం ఏదో వుంది .
    కనిపించని సామాజిక బెబ్బులి ఏదో భయపెడుతూ వుంది.

    రిప్లయితొలగించండి