"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

21 ఫిబ్ర, 2010

మాతృ భాష దినం ట.. ఇవాళ

మాతృ భాష దినం ట, ఇవాళ , 
మాటలు నేర్చు కోవడం మొదలు పెట్ట గానే, మాట్లాడే అమ్మ భాష మాతృ  భాష,ఆనందం  కలిగినా, బాధ పుట్టినా, నవ్వే, ఏడ్చే భాష మాతృ భాష. చిన్నప్పుడు , స్నేహితుల తో అల్లరి చేస్తూ, పరుగులు తీస్తూ, దెబ్బలు తింటూ, రాత్రి, అమ్మ పెట్టే అన్నం తింటూ, కథలు వింటూ, నాన్న సుద్దులు వింటూ, అమ్మ పాడే జోల పాటలు వింటూ, తెల్లవారు ఝామున , పాడే పిట్టల ,కోయిల పాటలు, వీచే సన్నని, చల్లని గాలి, అన్నీ, మనం మన మాతృ భాష లోనే అనుభ విస్తాం. ఇంకో భాష మనకి అనుభవమే లేదు, ఆ చిన్న తనం  లో.

అక్షరా భ్యాసం , ఓం నమాసివయః అని బియ్యం లో రాయిస్తారు, ఇప్పటికీ. ఇంక స్కూల్ లో చదువు అనే సమయానికి ఎందుకు ఆంగ్ల మాధ్యమం ,బడి లో పడేస్తున్నాం. ఇంక నువ్వు నవ్వినా, ఏడ్చినా అది ఒక అవస్థ. మాతృ భాష మరచి పోయి, కొత్త భాష లో మాట్లాడాలి, నీ ఆలోచనలు ఒక భాషలో ,నువ్వు నేర్చుకునే భాష ఇంకొకటి. తెలుగు భాష ,అని ఒకే ఒక గంట ( పిరియడ్  ), మిగిలిన సమయం లో , సైన్సు, లెక్కలు, సోషల్ అన్నీ నీకు వచ్చిన భాష లో కాదు, నీకు పూర్తి గా కొత్త అయిన ఆంగ్లం భాష లో. ఇంట్లో ఎక్కడా ఈ భాష మాట్లాడడం ఉండదు. ఇది ఒక శిక్ష, చదువు పేరుతో, నీ గొంతు కి పడే ఒక ఉరి. అయినా అందరం అదే పని, అతి మామూలు గా ,ఏమి ఆలోచన కూడా లేకుండా, గర్వం గా, పెద్ద, పెద్ద ,బడు ల లో పోటి పడి, పడేస్తున్నాం. 

 మన ప్రభుత్వాలు ఇందుకు సమ్మతిస్తున్నాయి. ప్రాధమిక  పాఠశాలలు  మూత బడుతున్నాయి  చిన్న, చిన్న గ్రామా లలో, నారాయణ, కేశవ అంటూ కార్పోరేట్  విష శక్తుల , బలమైన , పునాది లతో , ధన సంస్కారం తో విజృ ం భిస్తున్నాయి.  మార్కెట్ శక్తులు అంటూ, నమ్మిస్తున్నారు. ఆంగ్లం రాక పోతే మనుగడే లేదు అని భయ పెడుతున్నారు, మనం ఆ శక్తులకి ,ఇప్పటికే లొంగి ఉన్నాం.

కాల్ సెంటర్ ల ఉద్యోగ భద్రతే మనకు ముఖ్యం. మన వేమన చెప్పిన సూక్తులు, సుమతి చెప్పిన నీతులు, యోగులు చెప్పే మాటలు, కుటుంబ రావు గారు రాసిన చదువు, శ్రీ శ్రీ  ఎలుగెత్తిన మహా ప్రస్థానం, తిలక్ అందించిన వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అనే కవితలు, చలం పరచిన మైదానం, గోపీచంద్ అసమర్ధుని జీవ యాత్ర, ఆరు సారో కథలు, ఆరు సారా కథలు, పోసిన రావి శాస్త్రి గారు, మొదలు, ఇవాల్టి , రాజారం, మహేంద్ర, వంశీ,ఇలాంటి ఎందఱో కథల కబుర్లు వినేది ఎవరు? వినిపించేది ఎవరు? 

ఆంధ్ర భాష , గట్టి బైన్డు పుస్తకాల రూపం లో బీరువాల్లో బంధించ పడుతుంది. మాట్లాడుకుని, వాడుతూ, చదువుతూ, రాస్తూ ఉంటేనే కదా ఏ భాష అయినా వికసించేది. తలా పాపం తిలా పిడికెడు. 


కళ్ళు, చెవులు మూసుకుని , ఏమి పట్టని ప్రభుత్వం ఒక వేపు, మన భాష ని మనమే గౌరవించుకోని  ఆంధ్ర ప్రజానీకం వేరొక వేపు.  పారిస్ లో ఫ్రెంచ్ మాట్లాడు తారు, టోక్యో లో జపనీస్ మాట్లాడుతారు, చైనా లో చైనీసే మాట్లాడుతారు, ఆంధ్ర లో మటుకు  ఇంగ్లీష్ లో చదువు కుంటారు. మీకు అంటూ ఒక భాష ఏమి లేదా ? అని విడ్డూరం గా చూసారు, మేము గర్వం గా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే.


అవసరమే, ఆంగ్లం అవసరమే.. కాని, మన భాష ని తొక్కి పెట్టి, పర భాష ని నెత్తి కి ఎక్కించు కోవడమే, పరమ నీచం, బానిసత్వం.  మన పిల్లలు , ఇప్పటి వరకు, మాట్లాడుతున్నారు, కాని తరువాత తరం, ఏమి అవుతుంది? మనం నవ్వుకో డానికి, ఏడవడానికి, మనకి ఇంక ఏ భాష ఉంటుంది? మన సంగీతం, మన పాటలు, హరి కథలు, బుర్ర కథలు, తప్పేట్ గుళ్ళు, ఒక పురాతన తరం కి చెందినా ఒక సంస్కృతి గా మిగిలి పోతుంది. ఒక డెడ్ లాంగ్వేజ్. ఒక కప్పి పెట్టిన గని, ఒక మరచి పోయిన జ్ఞాపకం. ఒళ్ళు జలద రిస్తుంది. 


ఈ దుస్వప్నం నుంచి మెలకువ తెచ్చు కుని, ఒక సజీవ , సరాగాల, మధుర మైన , సుసంపన్న మైన, అమ్మ నోటి, కమ్మటి మాట ని ,నిత్యం వాడు కుంటూ, ఈ దినాలు, తద్దినాలు లేని రోజులు కోసం మనం ఏమి చెయ్యాలో    ఆలోచించాలి,  తప్పదు, అలోన్చించే సమయం ఇది, ఆచరించే సమయం ఇది.


తెలుగు మాట మనది.. అని గర్వం గా పాడుకునే సమయం ఇది.

.

5 కామెంట్‌లు:

  1. మా పిల్లల్ని ఇంగ్లీషు మాధ్యమంలో చదివిస్తున్నా వాళ్ళకి తెలుగు చదవడం, రాయడం తెలుగు పుస్తకాలు చదవడం అలవాటు చేస్తున్నాం.కానీ తెలుగు మాధ్యమంలో చదివించే ధైర్యం చేయలేకపోతున్నాం.

    రిప్లయితొలగించండి
  2. ఓ సారీ పోస్టు చూడగలరు.
    http://kasstuuritilakam.blogspot.com/2010/02/blog-post_21.html

    రిప్లయితొలగించండి
  3. విద్యార్ధులు తెలుగులో మాట్లాడకూడదట
    * కడప జిల్లా మైదుకూరు సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో తెలుగుభాష మాట్లాడకూడదంటూ చిన్నారుల మెడలో బోర్డులు తగిలించారు.తెలుగు భాష మా ట్లాడకూడదంటూ విద్యార్థులపై ఆంక్షలు విధించడం మానవ హ క్కుల ఉల్లంఘనకు పాల్పడటమేనని, ఇది ఘోర తప్పిదమని మా నవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టి స్‌ సుభాషణ్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. (ఆంధ్రజ్యోతి 28.10.2009)
    పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే
    పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో ‘ఉపాధ్యాయులు’ వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే.
    ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్
    ఆరు, ఆపై తరగతులు చదివే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్‌ తీసుకోవడానికి ఇక మీదట జిల్లా విద్యా శాఖాధికారులే (డీఈఓ) అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ద్వితీయ భాషగా ఇంగ్లీష్‌ను తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టరేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. (ఆంధ్రజ్యోతి1.11.2009)-
    తెలుగుపై పరిశోధన.. అమెరికాలోనే ఎక్కువ
    మనదేశంలో భాషలపై పరిశోధనలు జరిపే వారే కరవయ్యారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడితో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువమంది తమిళ, తెలుగు భాషలపై పరిశోధనలు చేస్తున్న వారు కనిపించారని తెలిపారు.(ఈనాడు31.1.2010)
    అంతరించిపోతున్నఅమ్మభాష
    దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే.పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, మనదగ్గర తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం.ఇంగ్లిష్‌, రోమన్‌, జర్మన్‌ సహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. ‘ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది. అదే ఈ వేగానికి కారణం.కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు…చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష… భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హాల్డెన్‌ ప్రశంసించారు.మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే.1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించింది. – కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు 21.2.2010)

    రిప్లయితొలగించండి
  4. rahamatulla gaariki naa namskaaram, nenu meetho ekibhavisthunnanu, naa blog ki intha manchi vyakhya raasinanduku meeku naa kruthagnathalu. chala santhosham gaa undi, mana telugu ni ela raksinchu kovalo... andaru kalisi alonchinchaali.

    రిప్లయితొలగించండి
  5. SK Reddy, gaariki, namaskaaram, avunu, telugu oka bhasha gaa nerpinchamu, memu kooda pillalani english medium schools lone chadivincham. prabhutvam anda lekunda, manam emi cheya galam?? bhasha ki kooda raja poshana undaali, prabhutvam udaseenatha , mukhya kaaranam, manchi, telugu medium schools nadapa leka pothunnaru, mana pillala meeda, experiment chese dhairyam manam cheyalemu kada..tamil, kannada,malayaalam parsithihti merugu ani anukuntannanu.

    రిప్లయితొలగించండి