"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

4 ఫిబ్ర, 2010

ఇల్లు ,గూడు,నీడ, ఉనికి...

తలుపులు లాక్ చేసి ఉన్నాయి,నా హ్యాండ్ బాగ్ లో ఉండాల్సిన తాళాలు ,లేవు..ఏదో మతి మరపు తో, తాళాలు లోపలే మరచి పోయాను.ఏమి చెయ్యడం ఇప్పుడు? ఒక్క నిమిషం ,ఇల్లు లేని దేని లాగా ,హోమేలేస్స్ గా ఫీల్ అయ్యాను. మా ఇంటి ముందు ఉన్న,పెద్ద చెట్టు ఏదో నిన్నే సమూలం గా కొట్టి పడేసారు.కిచ కిచ మంటూ ,పొద్దున్నే లేచి ,మాకు కొంచం సుప్రభాతం లాగా ,మేలుకొలుపులు పలికే ,ఆ చిట్టి పక్షులు, సాయంత్రం ఇంటికి చేరేసరికి, దాని ఇల్లు లేదు, దానికీ తాళం లేదు, ఆ ఇంటికి ,ఇల్లే మాయం అయిపొయింది. మరి మన కారులు ,బస్సులు విశాలం గా పోవడానికి ,రోడ్డులు కావాలి కదా అంటున్నారు.ఆ పక్షులు ఏమి అయ్యయో?యీ భాష లో మనలని తిట్టుకున్నాయో, అసలు, మనమే కారణం అని తెలుసా ,ఆ పక్షులు కి.మనిషే ముఖ్యం, యీ భూమి మీద అని ఎవరు చెప్పారో? అవే కాదు, ఏదో నదిలో, అల్లరి, చిల్లరి గా ఒక గుంపుగా తిరిగే ఆ చాప పిల్లలు,అలవాటు గా తిరిగే ,నది జలాలు,ఒక్క రోజు ఒక గట్టు కట్టి,ఆనకట్ట అని, ఇంకా ఇదే , నీ ప్రపంచం, ఇంతే నీ నది, నీ ఉనికి ఇంతే అని చెప్పడ్డానికి మనం ఎవరు? ఒక చిన్న భూమి ని నమ్ముకుని, ఆరు గాలాలు, శ్రమించి, మనకి తిండి పెట్టి, తన పొట్ట పోషించుకునే ,రైతు ల దగ్గర భూమి లాగుకుని, ఇన్ని లక్షల డబ్బు,ఇచ్చి , ఇదే నీకు పరిహారం అని చేతిలో పెడితే, ఆ రైతు ఎలా బతుకుతాడు? ఇంకో పని రాదు కదా అతనికి? ఒక పట్టణం లో తెచ్చి అతన్ని పడేస్తే ఏ వృత్తి ని సాగిస్తాడు.. ఎలా బతుకు  తాడు? ఎవరు నిర్ణయించారు, అతని భూమి కన్నా, మన రోడ్డులు, పరిశ్రమలు, ఎక్కువని.ఒక జాలరి కుటుంబం, సముద్రం లో వేట కి వెళ్లి చేపలు పట్టి ,ఇంటిల్లిపాది అదే పని తో బతుకు తారు.వాళ్ళని పట్టుకు వచ్చి, ఒక పట్టణం లో పడేస్తారు, ఒక ఇల్లు ఇచ్చి. కొంత డబ్బు ఇచ్చి. ఎలా బతకాలి ఆ జాలరులు, సముద్రానికి దూరంగా?  ఎవరు నిర్ణయించారు, ఆ ఓడ రేవు ముఖ్యం ,యీ జాలర్లు కాదని. ఒక కొండ జాతి, అడవి తెగ వాడిని, తరుము తారు, ఒక concrete jungle లోకి, ఒక్క చింత చెట్టు ని నమ్ముకుని, ఇంటిల్లపాది బతికే ఆ కుటుంబం. ను రోడ్డు మీద పడేస్తారు. ఎవరు నిర్ణ ఇస్తున్నారు.. మనం ఎక్కడ, ఎలా బతకాలో, ఎవరు వీళ్ళు, ఏమిటా శక్తులు.. ఇవీ నా ఆలోచనలు  రెండు నిముషాలు నా ఇంటికి తాళం, నేను మర్చి పోయి, బయట నిలబడితే. అమ్మ ఇదిగో తాళం అని మాఅబ్బాయి ఇచ్చాడు.. ఇంకో తాళం. నేను తాళం తెరుచు కూని, నాకు ఇష్త మైన నా ఇంట్లోకి ప్రవేశించాను.
నేను, నా ఇల్లు, నా వాళ్ళు అంత క్షేమం.. ఇంకా లోకమ.. ఎవరో ఉన్నారులే.. తలుపులు గట్టిగా మూసుకున్నాయి.. నా ఇంటివే...

2 కామెంట్‌లు:

  1. మీ వాడికి రెండు తగిలించాలి. ఏమంత కొంప మునిగిపోయిందని అప్పుడె తెచ్చి ఇచ్చాడు తాళం. కాసేపాగి ఇవ్వొచ్చు కదా...

    రిప్లయితొలగించండి
  2. appude tecchi ivvaka pothe, nenu ekkado, modalu petti, ekkado thelathanu. ee alochanala sravanthi ni paggam vesi nadipinchaali kada..

    రిప్లయితొలగించండి