"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

14 ఫిబ్ర, 2010

ఎవరి దీ భూమి???

మేము చిన్నప్పుడు, చదువుకుంటూ,మాకు అంతా వచ్చినట్టు,ఒక పాప కి ట్యూషన్  చెప్పాము.ఒకసారి ,దోమలు మమ్మల్ని, కుట్టి చంపుతుంటే, టీచర్, దేముడు ఈ దోమలుని, పాముల్ని, తేల్లుని, ఇలాంటి వాటిని ఎందుకు తయారు చేసాడు? అని చాల అమాయకం గా అడిగింది.మాకు, నాకు, నాతో ఇంకో కసిన్ కి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. ఇలాంటి ప్రశ్నలు సిలబస్ లో లేవు   అని చెప్పి.. తప్పించు కున్నాం.కొంచం పెద్ద వాళ్ళం అయాక, ఒక రోజు మన టీవీ లో ఒక ప్రోగ్రాం చూసాను. ఆ రోజే గుర్తు వచ్చింది ,ప్రశ్న .. చక్కగా ,అందం గా  ,రంగు రంగుల చీరలు కట్టి, చాల అందం గా తయారు అయిన ఉన్నారు, ముగ్గురు వనితలు. వారి ముందు టేబుల్ మీద రాక రకాల డబ్బాలు, సీసాలు ఉన్నాయి. ఒకరి తరువాత ఒకరు, వరస గా, ఆ డబ్బాలో ఉన్న రసాయనాలు ఉపయోగించి, చీమలు   ని, బొద్దింకలు  ని, బల్లులని, ఎలా చంపాలో వివరం గా చెపుతున్నారు. ఎంత అందం గా ఉన్నారో, ఇవేమీ బుద్ధులు అనుకున్నాను. పెస్ట్ కంట్రోల్ వాళ్ళు చేసే పని ఇదే కదా.. అనుకుని, నా అహింస సిద్ధాంతం పక్కన పెట్టాను. అందం గా తిరిగే   సీతాకోక చిలుకలు ని చూసి ఆనందిస్తాము. పక్షులని, పిట్టలని , చూస్తాం, ఎంత బాగున్నాయో అనుకుంటాం. పావురాలు ని చూస్తాం, శాంతి కపోతం అంటాం,మన ఇంట్లో గూడులు కట్టి రెట్టలు వేసి అందం పాడు చేస్తే, విసుక్కుని, గూడులు బయట పడేస్తాం. ఈ పావురాల గోల భరించ లేకే, ఇప్పుడు భవనాలు ని అద్దం తో కడుతున్నారు, బయట గోడలు. పావురాలని తరిమి వేయడానికి.. గాలి, వెలుతురు ,లేని భవనాలు కడుతున్నారు. పంటలు నాశనం చేస్తాయి అని, పిట్టలు ని వడి వేసి కొడతాం.మనం అడవి లని నాశనం చేసి, పంటలు వేస్తాం, చెట్టులు లేక బోసి పోయిన అడవి ల్లోంచి ఏనుగులు గుంపులు గా వచ్చి, పంటలని నాశనం చేస్తున్నాయి అని కేరేంట్   పెడతాం  చుట్టూ.     
అడవి ల చివర పల్లెలు  ఉంటాయి, extinct   అయిపోతున్నాయి  అని పులులకి  ఒక అభయ అరణ్యం అని పెడతాం. ఈ పల్లెల లో కోడి పెట్టలు, మేకలు మాయం అవుతాయి. పులులు ని మందు పెట్టి చంపేస్తారు. టీవీ లలో ,గగ్గోలు పెడతారు. పులులు ని రక్షించండి అని పెద్ద ,పెద్ద, ఆక్టర్స్,   క్రి కెటర్లు, మనకి బుద్ధులు చెపుతారు. ఇంకా సముద్రాలని వదలం. మాంసం   చాల రుచి గా ఉంటుందని పెద్ద,పెద్ద తిమింగలా లని వేటాడి, హర్పూన్ లతో, కసి గా చంపుతారు. వాటి నూనెలని     అమ్ముతారు. చాల డబ్బు చేసుకుంటారు. మనం తినడానికి, మనకి ఉపయోగ పడేవి, జంతువలని ఉండ నిస్తాం. మన దారి కి అడ్డు వచ్చేవాటిని, మొహమాటం లేకుండా, చంపి పడేస్తాం.

నేను ఒక్క రోజు, ఒక పిట్టనో, పావురాన్నో, పామునో, పులి నో, ఒక ఏనుగనో, ఒక తిమింగాలమో అయితే బాగుండును.

దేవుడా, నాకు అడ్డం గా ఈ మనిషి ని ఎందుకు పుట్టించావు అని అడగకుండా ఉంటానా???

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి