"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

6 ఫిబ్ర, 2010

నాగరికత రోడ్డులేనా???

నిన్న మేము యీ దేశం లో, ఒక నూట ఎనభై కిలో మీటర్లు దూరం ప్రయాణం చేసాం.. ఒక ఎడారి క్యాంపు లో పిక్నిక్ కి వెళ్ళాము. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఒకటే దృశ్యం.. వెడల్పు గా నాలుగు లైన్ల రోడ్డులు, నిరంతరం ప్రయాణించే కారులు. ఇంకో దృశ్యం మారదు. పాత సినిమాల్లో, కారు లో కూర్చుంటే, సీనేరి  మార్చే వారు..అలాగా అనిపించింది నాకు.
మన దేశం లో ఇలాంటి ప్రయాణం గుర్తు వచ్చాయి. ఇంట్లో నుంచి బయలు దేరితే మా ఏలూరు వరకు ,ఎంత నయనాంద కరమో, ఆ దృశ్యాలు, కారు లోంచి బయటకి చూస్తుంటే, పచ్చగా కళ కళ లాడుతూ ఎన్ని దృశ్యాలు చూస్తామో. గాజువాక దాటి, స్టీల్ ప్లాంట్ దాటి, అనకాపల్లి లోకి వస్తామా , మన అంత ఎత్తు పెరిగి, చెరకు తోటలు, తియ్యగా  నండూరి వారి ఎంకి-నాయుడు పాటలు ని గుర్తు తెస్తాయి. మధ్యలో, నిండు గర్భిణి  లాగ ఒంగిన అరటి మొక్కలు, పండంటి పండ్లు  గెల మోసుకుని, చెయ్యి ఊపుతాయి, పుల్లని మామిడి తోటలు, నోట్లో నీరు ఊరిస్తాయి, ఇంతలో ,ఓణీలు వేసుకునే నవ యవ్వని లాగ, శారద నది, ఒయ్యరాలు పోతుంది, ఆ బ్రిడ్జి దాటి, తమల పాకు వంటి తమ్ముడు నివ్వవే అని గొబ్బమ్మ పాటలు పాడుకునే అమ్మాయలని గుర్తు చేస్తూ, తుని  దాటుతాం.
ఇక్కడ   కావాలి   అంటే మంచి టిఫిన్లు తిన వచ్చు, ఇంతలోనే, ఎతైన కొండలు ఎక్కుతుంది రోడ్డు. రోడ్డు మలుపులు తిరుగు తూ , సత్యనారాయణ స్వామి ఊరు, అన్నవరం చేరుతుంది, మన లాంటి తొందర ప్రయాణి కులకు , క్రిందనే, ప్రసాదం కూడా అమ్ముతారు, ఎంత రుచిగా ఉంటుందో. ప్రసాదం భక్తులం కదా, చేతులు నాక్కుంటూ, దూరం నుంచే ఒక నమస్కారం పెడతాం, మళ్లీ వస్తాం   అని ఒక ప్రమాణం చేస్తూ, చాలా దూరం వరకు, కొండ మీద దేముడు మనకి ఆశీర్వ దిస్తూ కన బడ తాడు.ఎంత అందమైన నది తీరంలో ,కొండల మధ్య వెలిసాడో, యీ దేవుడు. ఇలా తలుచు కుంటూ, ప్రయాణం చేస్తూంటే, బుట్టల్లో జామ కాయలు నోరు ఊరిస్తూ కన పడతాయి. మంచి పచ్చని రంగు లో, సీతా  ఫలం పళ్ళు , అరటి పళ్ళు, అన్నీ కార్లు దగ్గరకు తీసుకుని వస్తారు. రాజమండ్రి వచ్చింది. గోదావరి తల్లి ప్రసాదం యీ పళ్ళు. ఊరులోకి వెళ్ళక్కర్లేదు, ప్రక్క నుంచి ఇంకో రోడ్డు ..టొబాకో  కంపెనీలు అవీ దాటు తూ. ధవళేస్వరం పక్క నుంచి, ఇంకా అలాగా వెళ్ళుతూ వుంటే, మల్లెల ఘుమ ఘుమలు, రోజా పువ్వుల గుబాళింపులు, గాలి అంతా  నిండి , కారుకి బ్రేకులు పడతాయి.కడియం వచ్చింది.. అని కారు కు కూడా తెలుసు, ఇక్కడ పువ్వులు కొనకుండా వెళ్ళితే, రాత్రి దుర్భరం అని కారు నడిపే   వానికి తెలుసు.  పొడవైన మల్లెల మాలలు పది రూపాయలు, ఇంకా బేరం ఆడితే ఇంకా తగ్గిస్తారు, కాని ఆ పూలు అమ్మే చిన్న,చిన్న   పిల్లలు ని చూస్తే , బేరం ఆడాలని  అనిపించదు. పూల దగ్గర బేరమా?? ఎంత  కఠిన హ్రిదయాలు.. నేను ఒక పూల మొక్క చెంత  నిలిచి అంటూ పుష్ప విలాపం పాడుకుంటూ, పరుగు పెడతాం  కా రులో. గోదావరి     రెండు పాయలు  ,వసిష్త,గౌతమీ లు కలసి, నిడదవోలు, తనుకు ,రావుల పాలెం పొలాల లో బంగారం పండిస్తాయి. కమ్మని పాట లాగ ,మాటలు, అయ్య అంటూ దీర్ఘం తీస్తూ  , సంగీతం విని పిస్తారు, యీ ప్రాంతం ప్రజలు, మోతుబరులు. మొక్కజొన్న పొత్తులు  కాల్చి, నిప్పుల మీద ఆ బ్రిడ్జి దగ్గర అమ్ముతారు, ఇంకా స్వచ్చ మైన నదీ తీరం లో, ఇసుక లో పండిన పుచ్చ కాయలు, పంచదార కన్నా తియ్యగా ఉంటాయి.ఇవి అన్నీ కొనిపించి, తాడేపల్లి గూడెం దాటి మా ఊరు చేరేసరికి, పొట్టలు నిండి పోతాయి. ఇంకా మనసు ని కూడా నింపుతుంది     ఏలూరు ఊరు, మా ఊరు.
నాలుగో,ఆరో, రోడ్డులు, కారులు ఉంటేనే  నాగరికత??? ఇలాంటి నదులు, గుడులు, పొలాలు పంటలు, పళ్ళు, ఫలాలు, పండించే మన భూమి, మన దేశం కి నాగరికత లేదా? నాలుగు లైనుల  రోడ్డులు మనకీ ఉన్నాయి. రండి, చూడండి. మా దేశం.. మా నాగరికత...అని యీ దేశం, ఆ దేశం లో ఉన్న వాళ్లకు..చెప్పాలి అనిపిస్తుంది. మీరు ఏమంటారు?  

6 కామెంట్‌లు:

  1. మంచి కవితలా ఉందండి మీ వర్ణనా అదీ కాకుంటే మీరు వాడిన ఫాంటూ,బ్లాగు మూస దాన్ని కాస్త కప్పేసాయి.
    ఇంతకీ మీరు ఏదేశములో ఎడారిలో ఉన్నారు అన్నది చెప్పలేదు :)

    రిప్లయితొలగించండి
  2. chala thanks rajendra kumar gaaru, thappakunda, naa blog ni improove chesthanu. naa paatha blogs kooda chadivi, mee abhiprayam raayandi.

    రిప్లయితొలగించండి
  3. You forgot to mention the number accidents you saw along the way and people died and living with broken bones, broken lives on the indian roads.
    Roads are meant to travel and reach you to the destination.
    Read the news paper every morning including the district editions and praise the indian roads

    రిప్లయితొలగించండి
  4. mee profile chadivaanu, maadee asalu visakha.nee.chala santhosham anipinchindi.inka onamaalu diddutunnanu blogs lo...mee salahaalu chala avasaram.

    రిప్లయితొలగించండి
  5. roads unnadi prayaanam ke, accidents ikkada avavu antaaraa?? 6 lanes road meeda kooda chala avuthayi. road la pakkana allukunna mana culture gurinchi raasaanu, okka roaddule kaadu.

    రిప్లయితొలగించండి