"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

7 ఫిబ్ర, 2010

ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ కుసుమములు???

ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ కుసుమములు??? అని నేను పాడుకుంటాను, అని ఎప్పుడూ కల కనలేదు.ఉదయం లేస్తూనే, ఇవాళ ఆదివారం కాక పోతే, పిల్లలని నిద్ర లేపడం, లంచ్ బాక్స్ లోకి టిఫిన్ లు చేయడం, బడి కి తరమడం, ఇల్లు సర్దు కోవడం, వంట వండు కోవడం, మళ్లీ, సాయంత్రం వంటకి తయారు కావడం, మధ్యలో, ఏవో చిన్న ,చిన్న పనులు, బ్యాంకు కి వెళ్లి, డబ్బు తెచ్చుకోవడం, అప్పుడు ATM లు లేవు లెండి, కూరలు కొనడం, సరుకులు తెచ్చు కోవడం, పిల్లల కోసం  స్తేషనోరీ షాపులకి వెళ్లి, పుస్తకాలు, పెన్సిళ్ళు, రబ్బెర్లు,  ఇంకులు  తెచ్చి ఉంచడం ఇంట్లో,ఆ మధ్యలో, ఏదైనా ఒక మంచి పుస్తకం కన పడితే కొను క్కునే మురిసి పోవడం, దొరికిన టైం లో, పుస్తకం చదివి అమ్మయ్యా నేను ఇంకా ఒక అడుల్ట్ బుక్ చదివే స్థితి లో ఉన్నాను అని సంతో షించడం,బండెడు పుస్తకాలు మోసుకుని, వాడి పోయిన మొహాలతో ఇంటికి వస్తే, ఏవో టిఫిన్లు, పాలు ఇచ్చి, హోం వర్క్ పుస్తకాలు తీసి, నేను చెప్పగలనా లేదా అని ఆలోచిస్తూ, ఎప్పుడో చదివిన పాఠాలు గుర్తు తేచు కుంటూ, హోం వర్కులు చేయించడం, మళ్లీ భోజనాలు, పవర్ కట్ టైం కి , కరెంట్ పోవడం, నేను చదివిన ఇంగ్లీష్ నవల కథలు సీరియల్ లాగా, పిల్లలికి చెప్పడం, మధ్యలో, జలుబులు, జ్వరాలు, typhoidlu , డాక్టర్లు చుట్తో  తిరగడం, మధ్యలో, పరీక్షలు అని ఇంకో పెద్ద పరీక్ష నాకు, ప్రాజెక్ట్స్ కోసం నేను తిరిగి, తిరిగి , సాయం చేయడం...ఎప్పుడూ అవుతాయి, యీ బడులు, యీ పరీక్షలు, యీ పిల్లల పర్వం..అని  ఎన్ని సారులు అనుకున్నానో, ఎందుకు అనుకున్నానో?? తధాస్తు దేవతలు ఉంటారు మరి.
ఏవి ఆ పిల్లల సవ్వడులు? ఆ అరుపులు? ఆ పరుగులు? నాకు ఇప్పుడు చేతి నిండా ఖాలీ.. యీ టైం అంత నేను ఏమి చెయ్యాలి? వాళ్ళు, ఇంజినీరులు  , డాక్టరులు, పెద్ద వాళ్ళు అయిపోయి, అమ్మ ఇలా చేయి, అమ్మ ఇలా చేయొద్దు అని సలహాలు ఇస్తున్నారు.సింకు నిండా గిన్నెలు ఉంటే , వాటిని తోమడం ఒక్కటే ఇప్పుడు నేను చేస్తున్న productive పని.పిల్లలని ,తల తల తోమి, మెరిసేలా చేయడానికి, ఒక సగం జీవిత కాలం సరి పోయింది.ఇప్పుడు, ఏమి తోచక, పాతవన్నీ తవ్వి, పాతర వేసి, ఇలాగ చేయ వలసినది మనం అని ఒకటే బాధ పాడడం. ఇంట్లో కొంచం పోపు ఘాటులు ఎక్కువై, ఇదిగో యీ బ్లాగులు త ఏవో రాయి, అని, నాకు చెప్పడం, నేను ఇలా దేశం మీదకి బ్లాగులు వదలడం మొదలు అయింది.
అమ్మలూ మీరు చేస్తున్న యీ అమ్మ పనులు, ఇంకా బాగా ఆనందించండి. ఎన్నో రోజులు లేవు,పిల్లల  చదువులు అయిపోతే, మీరు ఎంత మిస్ అవుతారో యీ రోజులు..ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ కుసుమములు అని నా లాగే బాధ పాడుతారు.. ఎంజాయ్ యువర్ motherhood .. fully .ఎంజాయ్..every మొమెంట్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి