"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

4 అక్టో, 2010

చెప్పే వారికి వినే వాళ్ళు లోకువ

నిర్ణయాలు ఆచరించే సమయం వచ్చింది అని, బట్టల బీరువా తెరిచాను, కొత్త నడక దుస్తులు అంటే ఓ ప్పది షాపులు వెతికి కొన్న నాకు సరి పడే దుస్తులు.ఒకటి తీస్తే, పది పడి పోయాయి, బీరువా నుంచి. వరద బాధితులు కోసం తెచ్చి పెట్టిన దుస్తుల్లా కుప్పలు కుప్పలు గా ఉన్నాయి, ఈ బీరువా సద్ది ఎన్ని రోజులు అయిందో? అని ఆశ్చర్య పోయాను. ఈ రోజే తెల్సింది, నాకు.సరే అని వంటిల్లు లోకి వెళ్ళి చూసాను, ఇదేమిటి ఇంత అధ్వాన్నం గా ఉంది, కామన్ వెల్త్ గేమ్స్  విల్లెజ్ లా గా ఇంత అపరిశుభ్రం గా ఉంది, ఈ బాత్రూం లు ఇంక ఎలా ఉన్నాయో?ముక్కు మూసుకుని వెళ్ళి పోయే విదేశీయు రాలి లాగా కాసేపు నేను ముక్కు మూసు కున్నాను, ఇదేమిటి మా ఇల్లే? ఇంత అధ్వాన్నం గా ఉంది ఏమిటి, అని నేను ఆశ్చర్య పోయి, ఎవరి మీద వేయాలి నెపం అని కామన్ వెల్త్ గేమ్స్ కమిటి లాగ ఆలోచిస్తే, ఎక్కువ ఆలోచిం చాకుండానే కనిపించింది కారణం, ఇదిగో ఈ నెట్టే.ఒకటి వెతకాలి అని మొదలు పెడితే వంద కని పిస్తాయి, పనికి రాని విషయాలు,అందులో మనకి పనికివచ్చే అతి సూక్ష్మ విషయం, వెతికి పట్టుకునేసరికి, ఒక పూట కాలం గడిచి పోతుంది. ఇంక స్నేహితురాళ్ళు కనిపిస్తే, ఆకు పచ్చ గా చాట్ కిటికీ లో పూర్వం, గోడ పై నుంచి కబుర్లు చెప్పుకునే పిన్ని గార్లు ని గుర్తు తెస్తూ, ఇవాళ వంకాయ కూర ఇలాగ వండాను నేను, నువ్వు ఏం చేసావు నుంచి, తెలంగాణా వచ్చేస్తుందా  నిజం గా, లేటెస్ట్ సినిమా కబుర్లు, వీధి, ఇంటి కబుర్లు, ఇంకా పిల్లల విషయాలు అన్నీ దొర్లి పోతాయి, ఇంకో పూట మాయం, కాలం గర్భం లోకి.ఇంక ఇలాగ తెలుగు లో రాయాలని ప్రయత్నిస్తే, ఈ కంప్యుటర్ బడికి వెళ్లనని మొరాయించే పిల్లాడి లాగ మారాం చేస్తుంది, దానిని దారిలో తెచ్చకునే ప్రయత్నం లో ఇంక రోజే గడిచి పోతుంది.
పిల్లల చిన్నప్పుడు రోజూ పవర్ కట్ లు ఉండేవి, గిల గిల లాడి పోయేది, ప్రాణం, ఈ చీకట్లో పిల్లలని ఎలా మరిపించాలి, చదివించాలి? అని,ఆ కష్టాలు ఏవో మరిచి పోయాం అను కుంటే, ఇప్పుడు ఈ నెట్ కష్టాలు,ఒక్క పూట నెట్ లేక పోతే,ప్రపంచం అంతా మనల్ని మరిచి పోతుందేమో , అమితాబ్ కిచ కిచమనే కబుర్లు ఏం రాసాడో, ముఖ్యమైన మెయిల్స్- ఏమి ఉండవు, మన భ్రమ- మిస్ అవుతున్నాం, ఫలానా ఫేసు బుక్ పేజీ లో మనం లేనప్పుడు ఏం రాసుకున్నారో, చాటింగ్ కిటికీ లోకి ఎవరు తొంగి చూసారో, ఈ నెట్ భూ ప్రపంచం లోంచి మనం మాయం అయిపోయామే, ఎవరు ఎలా, ఉన్నారో, ఏం అన్నారో, నిముషం నిముషం మనకి ఎలా తెలుస్తుంది? ఎంత బాధ ? ఎంత బాధ? మొబైల్ ఫోన్ లో టాక్ టైం అయి పోయినప్పుడు కన్నా ,ఇంకా బాధ, మొబైల్ లో ఛార్జ్ అయి పోయినప్పుడు కన్నా    ఇంకా పెనుబాధ ఇది, పవర్ కట్ బాధ , ఇప్పుడు చిన్నది గా ఉంది, ఈ పెను బాధ ముందు. ఇంవేర్తెర్లు వచ్చాయి కదా, ఫ్యాన్లు, టీవీ లు నిరంత రాయం గా పని చేయడానికి, ఆఖరికి ఒక పూట భోజనం అయినా మానేయ వచ్చుకాని, ఈ నెట్ లేక పోతే, ఊపిరి ఆడనంత గా గిల గిల మని కొట్టుకు పోవాల్సిందే. 
ఈ టెక్నాలజీ మన జీవితం ని సులువు చేయడం కాదు, బానిసలని చేస్తోంది. 
అసలు పక్క పక్కనే కూర్చుని, మొబైల్ స్క్రీన్ మీద మెసేజ్ లు చదువు కోవడమే ఇప్పుడు ఫాషన్ ట. ఇంకా మొబైల్ లో ఎంత ఎక్కువ మాట్లాడితే అంతా డబ్బులు తిరిగి ఇస్తాం అంటున్నారు. మాటలకి తూకం వేసి అమ్ముతున్నారుట.అమెరికా లో ఉన్న  మాచెల్లెలు అన్నట్టు ఏదో ఒక  రంగుల స్క్రీన్ లోకి చూస్తూ మాట్లాడడమే ఇప్పటి పిల్లలకి అలవాటు అయిపొయింది. కంపూటర్ స్క్రీన్ లేదా మొబైల్ స్క్రీన్, ఏదో స్క్రీన్ అంటే ఒక అసలు కి నకిలీ రూపం ఉండాలి, మామూలు గా జీవం, ప్రాణం ఉండే మనుషులు అంటే, అమ్మ, నాన్న,అక్క,ఫ్రెండ్ వీళ్ళు ఏదో ఒక స్క్రీన్ మీద కని పిస్తేనే మాట్లాడ గలుగుతారు. వీటికే మరి వ్యాపార విజయాలు తోడై ఉన్నాయి.
సరే మరి నేను అయినా ఈ కబుర్లు అన్నీ నోరు విప్పి మీకు చెప్పగలనా? ఏదో ఒక స్క్రీన్, ఒక నెట్, ఒక వినే మీరు ఉన్నారు కాబట్టి.. చెప్పే వారికి వినే వాళ్ళు లోకువ అననే అన్నారు కదా..
కొస మెరుపు: రెండు రోజులు మా నెట్ లేక పోతే,
మా ఇల్లు ఇప్పుడు అద్దం లా మెరుస్తోంది,
బట్టల బీరువా లో పోయాయి అనుకున్న రెండు డ్రెస్సులు, ఒకటో, మూడో, జాకెట్లు, మాచింగ్ వి కూడా తిరిగి దొరికాయి,
ఎప్పటి కైనా ఇందులో పట్ట వచ్చు అని దాచిన కొన్నిటికి విముక్తి లభించి, బీరువా సగం ఖాళీ అయి, కొత్తవి కొనడానికి ఒక కారణం దొరికింది...
నెట్ ఎప్పుడు తిరిగి వస్తుందా అని ప్రార్ధించే ఒకరు నాకు కని పిస్తున్నారు,
ఏదైనా మనకి అనుకూలమే..
        

4 కామెంట్‌లు:

  1. ఈ రోజు నేను ఇదే అనుకుంటున్నాను, మీరు వ్రాసారు. బాగా చెప్పారండీ, ఇపుడే కిచెన్ శుభ్రం చేసాను. ఇంక బీరువా సంగతి రేపు చూడాలి. ఇది కొత్త బ్లాగు లాగా ఉందే, ఫాంట్ మరీ పెద్దది అయింది, వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి,మీకు వీలైతే.

    రిప్లయితొలగించండి
  2. నిహారిక గారు!
    మాటలు తో వారధి వేయడం అంటే ఇదే నేమో, మిమ్మల్ని చేరినందుకు నా మాటలతో, చాల సంతోషం గా ఉంది, నా పాత బ్లాగ్స్ కూడా చదువు తారని, ఒక ఆశ పుట్టింది..ఇలా అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను, మనసు లోని మాటలని బ్లాగ్స్ లో రాస్తే అదో తృప్తి, కొందరైనా చదివితే ఇంకా తృప్తి.

    రిప్లయితొలగించండి
  3. Dear Vasanta, Very well said. I was in the same mode for almost three years - time flies by in the virtual world. Now I am slowly realizing the quality of life outside the Matrix. We need to find a balance. May be set a specific time for net and stick to it.

    However, for being fortunate than 90% of the world (for having a shelter and food to eat), these small things shouldn't bother us. It reminds me a quote on my friend Raama's blog that said something like "I was complaining for not having shoes until I met a man with no feet"

    రిప్లయితొలగించండి
  4. Hi Gopa, Thanks for posting the comment,It was written as a realisation to start self control, and take things into our hands, rather than blame,some one, or some technology. Yes, true, we have everything, our cup of is too full and we are spilling out,instead of enjoying it.
    Thanks once again, Life is too precious, when you are complaining, did you notice, some beautiful sunsets and rainbows have passed just now? is my favourite line...vasanta.

    రిప్లయితొలగించండి