"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

12 అక్టో, 2010

మహా వ్యాపార మార్కెట్ దేశమా ? భారత్ దేశమా?? మజాకా నా??

కొత్త మోడల్ అడిడాస్, అయిదారు వేలు, ఉంటాయి అవీ, నాకు లేదు అని బాధ పడుతూంటే, కాళ్ళే లేని ఓ యువకుడు కన్పించాడు నాకు.. ఈ మెయిల్ ఇప్పుడు నడుస్తోంది, అందరు చదివే ఉంటారు. మెయిల్ చదివేసాం కదా, హమ్మయ్య ఇప్పుడు మళ్లీ,  కొత్త షూస్ గురించి ఆలోచించ వచ్చు. నాకు ఉన్నాయి కదా మరి, కాళ్ళు, కలలు.. 
కొత్త గా వచ్చినా ఒక సినిమా.. దో గుణ చార్ అనే సినిమా కథ చదివాను, నెట్ లో. ఒక కారు కొను క్కోవడానికి, ఒక మధ్య తరగతి ,కుటుంబ పెద్ద, పడే కష్టాలు ఉనాయి ట. అందులో. ఏదైనా కొనుక్కోడానికి ఇప్పుడు పోటి పడి బ్యాంకు లు అప్పులు ఇచ్చేస్తున్నారు .మన భారత దేశం అంతా ఒక పెద్ద బజారు లాగా కనపడు తోంది ట, అన్నీ దేశాలకి. 
విత్తనాలు కొనుక్కుంటాం అంటే బ్యాంక్లు  పాపం ఆలోచిస్తారు, ఈ బీద రైతు ఎలా తీరుస్తాడు, నా అప్పు, అని ,కాని అదే ఉద్యోగం, వ్యాపారం చేసుకునే తెల్ల కాలర్ ,వారు, అంటే మట్టి అంటని, కుర్చీ లో కూర్చుని ,ఉద్యోగాలు, చేసి, నెల ,నెల, జీతం తీసుకునే వారికి, పోటి పడి మరి అప్పులిస్తారు.
మూడో కారు ,రెండో ఫ్రిడ్జే, కొత్త , టీవీ అతి పెద్దది, అంటే గోడంత , సినిమా ఇంట్లో నే చూసేంతది వీటికి అయితే, సంతకం పెట్టి, క్రెడిట్ కార్డు చూపిస్తే చాలు ,అర గంట లో ఇంటికి వచ్చేస్తుంది. 
శర వేగం గా మారి పోతున్న ఈ టేక్నోలోజి  తో మనం పోటి పడాలి అంటే, ఇంట్లో సామాన్లు బయటకి నడవాల్సిందే, కొత్తవి రావాల్సిందే. 
ఇలాగ మూడో దో, నాలుగోదో కొనుక్కున్తునా ,మనం మొట్ట మొదటిసారి కొన్న టీవీ, కారు ,ఫ్రిడ్జే వాటి ఆనందమే వేరు.
అప్పు చేసి కొన్న మొదటి కలర్ టీవీ ఇంటికి వచ్చిన   రోజు పొందిన ఆనందం, వాయిదా పధ్ధతి లో కొన్న ఆల్విన్ ఫ్రిడ్జే, దాన్లో చేసిన మొదటి ఐస్ క్రీమ్ రుచి, ఆఖరి వాయిదా కట్టేసినప్పుడు కలిగిన యాహూ అని అరవాలి అనేంత గొప్ప గర్వం తో కూడిన వెలుగులు,  మొదటి సారి కారు కొని, దేవుడి గుడి దగ్గర  కొబ్బరి కాయ కొట్టి, ఇంట్లో కుటుంబ సభ్యులతో , వీధి లో ఝామ్మని  పరుగులు తీయడం లో కలిగిన గొప్ప ఆనందం, అలాగే, ఒక స్కూటర్ కొన్నా, మొదటి వాహనం ఎంత  తృప్తి నిస్తాయో, ఇదే కారు, నాలుగేళ్ళు వాడేసి, అమ్మేసి, రెండో కారు కొన్నప్పుడు, అది ఒక మామూలు రోజు, అన్నీ రోజు ల లాగే.. కొత్త వస్తువులు కొనడం లో ఏదో మజా ఉంటుంది. 
కలలు కని, కూడబెట్టి డబ్బులు, పది రకాల షాపులు, మోడల్స్ చూసి, చర్చించి ఇంట్లో వారితో, ఆఫీసు లో, ఆఖరికి ఒక రోజు తెగించి, మనమే దో షాప్ కోనేస్తున్నంత భావంతో, దర్జా గా ,అడుగు పెట్టి, సేల్స్ మాన్ ని , ముప్పై రకాల ప్రశ్నలతో వేధించి, గారంటీ, వారంటీ అంటూ, పరిజ్ఞానం ప్రదర్శించి, కూడా బెట్టిన డబ్బు అంతా, షాప్ వారికి సమర్పించి,  భార్య మొహం లోకి ఒక సారి గర్వం గా చూసి, పది జాగ్రత్తలు చెప్పి, రిక్షా వాడికి, ఆ వస్తువు ఇంట్లో కి చేరే సరికి, పిల్లల కేరింతలతో.. భార్య చేసిన స్వీట్ తో, ఆ రోజే రోజు  , ఆ ఆనందమే ఆనందం  . ఆ తృప్తే తృప్తి.
ఇదే ఆనందం మళ్లీ, రెండోదో, మూడోదో, కొన్న రోజు చచ్చినా రాదు. మొదటి సారి కొన్న ఈ మధుర ఘడియలు, ఇలాగ జ్ఞాపకం గా మిగిలి పోతాయి.
త్రీ డి టీవీ ట , మొహాలు కనిపించే కొత్త సెల్ ఫోన్ ట..రెండు తలుపులు ఉండి, నేను పట్టేంత పెద్ద ఫ్రిడ్జే ట.. చాలా ఉన్నాయి నా లిస్టు లో..
మన దేశం , సూపర్ పవర్ కావాలంటే, నేను ఉడతా భక్తి గా ఏదో చేయాలి కదా మరి. 
బియ్యాలు, కూరలు పండిస్తేనేం, పండించ లేక పోతేనేం, మన సూపర్ మార్కెట్లు, అమెరికా ఆపిల్ ళ్ళు , ఆస్ట్రేలియా లిచి పళ్ళు అమ్ముతారు, అవీ తిని బతికేద్దాం.. 
మహా వ్యాపార మార్కెట్ దేశమా ? భారత్ దేశమా?? మజాకా నా???

4 కామెంట్‌లు: