"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

17 అక్టో, 2010

రియల్ బిగ్ హీరోలు, రియల్ రియాలిటీ షో

సూర్యోదయాలు లేవు, సూర్య అస్తమయాలు లేవు, రాత్రి- పగలు బేధం లేదు, భూమి అట్టడుగు, మైలున్నర, కింద, ఖనిజాల అన్వేషణ లో, రాగి ఖనిజం వెలికి తీయడానికి అని భూమి ని తొలుచుకుంటూ, కిందకి దిగిన ఆ ముప్ఫై ముగ్గురు కార్మికులకి ఆ రోజు తెలియదు, తాము మొత్తం అరవై తొమ్మిది రోజులు, సూర్యుడు- చంద్రుడు, లేని చీకటి గుహలో గడప వలసి వస్తుందని.
కూలిపోయిన ఆ మైన్ లో, తాము బతికే ఉన్నామని ,బయట ప్రపంచానికి తెలిసేందుకే, పది హేడు రోజులు పడుతుందని.. రోజూ ఉదయిస్తున్న సూర్యుడని, చూస్తూ, రాత్రి చల్లని చందమామ తో కబుర్లు చెపుతూ, ఫోన్ లో రోజూ, మన దేశం లో, ఉన్న స్నేహితులు, పిల్లలు తో, బంధువులతో మాట్లాడుతూ, బయటకి వెళ్ళలోక పోతున్నాను అని దుఖిస్తూ, కూర్చునే నాకు వీరి కథ , వీరి మొక్కవోని ధీరత్వం ఒక పాఠం.
ఎప్పుడూ, మనకి లేని వాటి గురించే బాధ పెడతాం ఎందుకో? ఉన్న ,అనుభవిస్తున్న సుఖాలు, సవుఖల్యాలు మనకి ఎందుకని కనిపించవు? అని పించింది.
 ఈ నిజమైన రియాలిటీ షో , మొత్తం ప్రపంచాన్నే ఆకట్టుకుంది.
ఎంజేనీరింగ్ ప్రతిభ, కి మానవత్వ విలువలు తోడై, చిలీ  దేశం , ఆ దేశ రాష్ట్రపతి పూనుకుని, అమెరికా నాసా సహాయం, తోడ్పాటు తో, ఒక ఫెనిక్ష్ అనే  మిస్సైల్ లాగా కనిపించే ఒక సన్నని పంజరం తయారు చేసారు, ఫేనిక్ష్ అనే పక్షి, బూడిద నుంచి మళ్లీ పుడుతుంది అని పురాణ కథ. 
ఈ  పంజరం ,భూమి లో తొలుచుకుని కిందకి దిగడానికి శక్తి వంతమైన డ్రిల్ యంత్రం తయారు చేసారు, చైనా సాయం తో. పదిహేడు రోజులు , భూ స్థాపితం అయిన తరువాత, ప్రపంచానికి, వీరు బతికే ఉన్నారని తెలిసిన తరువాత, వారికి, ఒక సన్నని  గొట్టం ద్వారా మందులు,  ఆహారం, ఒక వీడియో కేమెర కూడా పంపించారు.
ఆ రోజూ నుండి, వీరి మొహాలు, వీరి మాటలు విన్తునారు, టీవీ ల సాయం తో, ప్రపంచం అంతా చూసింది, ఈ నిజమైన రియాలిటీ షో ను. వారి ఇంట్లో భార్య పిల్లలు, బంధువులు అందరు వీరిని చూస్తూ,  నిముషం నిముషం వీరి మనుగడ గురించి విచారిస్తూ, ఎంత నరకం అనుభవించి ఉంటారో కదా? 
ఈ మధ్య రియాలిటీ షో అంటూ, ఒక ఇంట్లో, కొంత మంది సెలెబ్రిటి లను పెట్టి, వారిలో వారికి ఏవో స్పర్ధలు పెట్టి ,చాల అసహజం గా ఆఖరికి ఎవరో ఒకరిని బిగ్ బాస్ అని ఎన్నుకోవడం, ఈ షో అందరు చూడడమే  కాదు, ఓటులు కూడా వేసి, గెలిపించడం , ఇదంతా, మానవీయత , సభ్య సమాజ , మధ్య ఉండ వలసిన స్నేహ , సుహృద్భావ భావ శూన్యత కాదా?  ఒక సభ్య సమాజం లో ఉండ వలసిన , గొప్ప విలువలని అపహాస్యం చేస్తూ, ఈ రియాలిటీ షోలను ఎలా అనుమతించారు? ప్రజలు ఎందుకు చూస్తున్నారు? 
ఇలాంటి  సమయం లో,   ఒక ఆపద సమయం లో వ్యక్తులు ఎలా, ఒక సముదాయం గా కూడి, ఒకరికి ఒకరు ధైర్యం  చెప్పుకుంటూ,  ఉన్న వనరులని , అందరి తో పంచుకుంటూ,  పరస్పర సంభాషణ లతో బాధ, దిగులు మరిపించు కుంటూ, మనం మళ్లీ, మంచి రోజు చూస్తాం,మళ్లీ బయట ప్రపంచం లో భాగం అవుతాం అని, విశ్వాసం తో, నిరాశ అనే దెయ్యం ని తోసి, ఆశ అనే దేవుడు హస్తం ని అందు కుని, భూమి అట్టడుగు  పాతాళం లోంచి ఫెనిక్ష్ లాగ పునరజ్జీవమ్    పొంది, మానవీయత కే  మొక్కపోని విజయం ని సమ కూర్చి, ఈ నిజమైన రియాలిటీ షో, ఒక చరిత్ర సృష్టించింది.
ఇప్పటికైనా ఇలాగ  భూగర్భం నుంచి ,ఖనిజాలను వెలికి తీసే, కార్మికులకి మంచి రోజులు వస్తాయా? అనే ఆశిద్దాం. ప్రపంచం అంతా నేడు చూస్తోంది, లాభాలు ఒక్కటే దృష్తి లో పెట్టుకుని,  సరి అయిన జాగ్రత్తలు పాటించని యజమానులు ఇంక ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి,  ప్రైవేటు భాగస్వాములు కి, ప్రభుత్వం ఒక నియంత్రణ యంత్రాంగం తో నియంత్రించి, కార్మికుల కి వెసులుబాటు కల్పిస్తూ, ఆదేశాలు జారి చేయాలి. 
చిలి దేశం అందరి ప్రశంసలు ,మన్ననలు పొందింది. ఇలాంటి ఉపద్రవాలు ఎదురు అయినప్పుడు , చేయవలసిన సహాయ కార్యక్రమాలు చక్కగా నిర్వర్తిన్చిందని, అవసర మైన చోట్ల ,ఇతర దేశాల సహాయ ,సలహాలు తీసుకుందని,  మంచి పేరు పొందింది.
ఈ సంఘటన , ఒక పాఠం గా నిలుస్తుంది అనడం లో సందేహం లేదు. మానవ స్ఫూర్తి ,  సుహర్ద్రం , అవాంతరాలు  ఎదురు అయినప్పుడల్లా,    ఆశావహ దృక్పధం తో ఎలా ముందుకు సాగి పోవాలో నిరూపించింది.. 
ఇవి మనం నేర్చు కోవలసిన పాఠం. రియాలిటీ షో పేరు పెట్టి, విడదీయడ కాదు, మానవ మనుగడ ని ఇంకా అందం గా, ఇంకా సుమధురం గా ఎలా గడపాలి అని అన్వేషణ సాగించాలి..
వసుధైక కుటుంబం అని పాడుకుంటూ, సాగిద్దాం ఈ ఉత్కృష్ట మానవ, కుటుంబ సమాహర సాముహిక పయనం..

8 కామెంట్‌లు:

  1. Dear Vasanta,

    You have made an Engineering miracle into a human miracle. Very emotional indeed. A wonderful narration on human values. Hats off to you. Please carry on. Hope to see many more article like this from you.

    రిప్లయితొలగించండి
  2. Nice post..I am sure this event will be made into a movie soon. My prediction would be that a book will be out in 1-2 years and a major Hollywood motion picture in 2-3 years..Maybe you should write the book first!!....:).

    రిప్లయితొలగించండి
  3. ఈ విజయదశమికి ఆ జగజ్జనని మిత్రులందరికీ సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............

    - SRRao

    శిరాకదంబం

    రిప్లయితొలగించండి
  4. Yes, Hemant ,I can visualise this human drama unfolding in a movie, all chile miners rescued by Big Brother ,All american crew, emerging as heroes at the end...
    vasantham.

    రిప్లయితొలగించండి
  5. In this kind of trapped situations, optimism counts a lot. Yes, there were fist fights initially, but they managed to sort things out and emerge in good health.

    Belief (I believe!) is a powerful thing. Like Rhonda Byrne indicated, the universe will conspire to create favorable conditions.

    రిప్లయితొలగించండి
  6. Thanks Gopa,vasundhara..

    Yes, Gopa Belief is a powerful thing. That quote is good and note worthy.

    Vasundhara..Thanks for taking time to read and add your comment.

    vasantham.

    రిప్లయితొలగించండి