"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

1 అక్టో, 2011

వైద్యో నారాయణో ..కాదు..కాదు,వైద్య సలహా ..హరీ

సరిగ్గానే చదివారు   ఆంగ్లం లో..అన్నట్టు..ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్..అనగా..ఇదంతా..ఎలా మొదలయింది అంటే ,
కంచం లో.పసుపు పదార్ధం చూసి, కేవ్ కేవ్ అని రెండు సార్లు అరిచి ఏమిటి? అంటే అన్నం..అన్నాను కూల్ గా.ఇదేమిటి నిన్నటి వరకు నాకు  అన్నం తెల్లగా ఉన్నట్టు గుర్తు..అన్నాడు..ఆయన..అదే మరి, నీకు ఏమీ గుర్తు ఉండడం లేదు,నువ్వు గజినీవి అయిపోతున్నావు..అన్నాను ..అదేమిటి..అన్నాడు? గజినీ మర్చిపోయావా?? అదే మరి నీకు అమ్నేసియా వచ్చేసింది.. అతి ముఖ్యమైన రోజు నా పుట్టిన రోజు కూడా మర్చి పోయావు..నాకు తెలుసు, నువ్వు ఆఫీసు పనుల్లో కాదు, అమ్నేసియా వల్లే మర్చి పోయావు..అందుకే పసుపు కలిపిన అన్నం ఇదెవరు చెప్పేరు నీకు? విరక్తి గా గాలి లోకి చూస్తూ ప్రశ్న.
నాకెవరు చెప్పారా? అమెరికన్ వైద్య రిసెర్చ్  సంస్థ లో పనిచేస్తున్న మన భారతీయ డాక్టర్లు ఎన్నో సంవత్సరాలు రి సెర్చ్ చేసి, కనిపెట్టారు, పసుపు ఎక్కువ గా వాడడం వల్లే భారతీయులు కి అమ్నేసియా వ్యాధి  చాల తక్కువ గా వస్తుందని..
నీకు ఎలా తెలిసింది, అదేమిటి నెట్ లో నేను చదివేవి ఇవే కదా..
మొన్న మా ఇంట్లో పని చేసే నరసమ్మ తుమ్ములు , దగ్గు తో బాధ పడుతూంటే, అది తప్పకుండా భయంకర మైన ...............వ్యాధి(పేరు మర్చి పోయాను, క్షమించండి) ,అని హాస్పిటల్ కి పంపించ లేదూ..
నాకు వచ్చే తల నొప్పి కి కూడా..కారణం నాకు తెలుసు..నా తల లో, అదే మెదడు లో ఉన్న క్లాట్ వల్లే..
అయ్యో.. క్లాట్ ఉంటె, నువ్వు ఇలా నిల్చుని మాట్లాడ లేవు..
అని తల పట్టుకుంటే..అలా అక్షిస్ బ్యాంకు  ఆడ్ లాగ..తల పట్టు కోకు. నెట్ వల్ల ఎంత ఉపయోగమో??
మళ్లీ, ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ...
పెళ్లి భోజనాలలో వేసే లడ్డూ చూసి, వికారం గా మొహం పెట్టి, సెనగ పిండి..అని పక్క ప్లేట్ లో పడేసే నేను, ఒకానొక రోజు..కనుగున్నాను.. రోటరీ మెడికల్ టెస్ట్ల లో, నాకు, అదేమిటి నాకే..షుగర్ అనే భయంకర మైన వ్యాధి ఉందని..
ఇలాంటి వన్నీఎవరికో వస్తాయి గాని, నాకు ఇంత చిన్న వయసు లో (అంతా భ్రమ ) రావడమేమిటి? అని..నేను ఈ రోజు నుంచి హెల్తి జీవన విధానం ..అవలంబిస్తాను అని, మందులు వేసు కోడానికి మొండి కేసి, అర్జెంట్ గా మూడు వేలు పెట్టి.. మంచి షూస్ కొనుక్కుని, రోడ్లు సాఫీ చేయడం మొదలు పెట్టాను..నా బరువు తో.
అప్పుడు నాకు ,ఈ నెట్ లో, కొన్ని లింక్ లు చూపించి, ఇందులో చదువు..షుగర్ అంత భయంకర మైన వ్యాధి కాదు, కాని, నువ్వు మటుకు మందులు వేసు కోవాలి, తప్పదు..అని చెప్పగా, చెప్పగా తల కెక్కి, ఒక సంవత్సరం పట్టింది..ఇదంతా జరగడానికి  ..
ఈ సరికి, పక్క వాళ్ళ ప్లేట్ లోంచి లడ్డూ నా ప్లేట్ లోకి వేసుకునే స్థితి కి వచ్చాను.  లంచ్ కి రండి మా ఇంటికి రేపు, అని పిలుపు వస్తే, ఇంక ఆ రోజు రాత్రి అంతా ఊహలు..ఊరింపులు..ఏం స్వీట్ పెడతారో??ఖర్మ.. ఖర్మ..(ఇదంతా ఈ షుగర్ వ్యాధి ఎఫెక్ట్ అని నా అనుమానం....కాదు, కాదు, వయసు చేసే గారడి..అదే, చిన్న వయసు లో చేసే గారడీ కాదు, ఇది ఇంకో రకం..అన్న మాట.)
ఒక డజను వైద్య  సంబంధిత నెట్ సైట్ లకి మెంబెర్ అయి పోయాను..
ఒకరు, టమాటోలు రోజుకి రెండు తింటే..చాలు , మీ  షుగర్ మాటు మాయం..
ఇంకొకరు, రోజుకి ఒక్క టొమాట తిన్నాచాలు.. కిడ్ని లో రాళ్ళు..హుహ్..
పొద్దున్న టిఫిన్ తిన్నా నీరసం గా ఉంటోందా? ఉంటుంది..షుగర్ కదా..అందుకే రోజుకి ఆరు సార్లు తినండి.అబ్బ మూడు సార్లు తినడానికే, వంటింట్లో ఆరు గంటలు ..ఇంకా ..
అబ్బే వండు కోకండి..అలా తినేయండి.. పళ్ళు..ఆకులూ అలమలు..
ఇంకో సైట్ లో, పళ్ళు..హుహ్..వాటి నిండా సుగరే..విషం తో సమానం..మళ్లీ అక్షిస్ ఆడ్ పోస్..అదే తల మీద చెయ్యి.
నాకు ఒక మంచి దురలవాటు ఉంది..అంటే నాకు మంచి, ఇతరులకి దురలవాటు.....ఏమిటంటే. నేను చదివిన వన్నీ, ఇంగ్లీష్ లో ఒక పదం  ఉంది..డిస్పెంసింగ్ నోలేజ్ అంటారు.. అంటే మనకి తెలిసిన విజ్హ్ఞానం అందరికి పంచడం.
ఒక ఫ్రెండు..ఏమిటో నే నాకు ఎప్పుడూ నిద్ర గా ఉంటోంది..(రాత్రి సెకండ్  షో లు ఈ టీ వి. లో చూడడం వల్ల కాబోలు..)
నీకు షుగర్ కాని  థైరాయిడ్ గ్రంధి లోపం అయిన అవ్వాలి, వెంటనే టెస్ట్స్ చేయించుకో అని భయ పెడితే..నా దగ్గర్కి రావడమే మానేసింది.
అయినా ,నేను నా సోషల్  సేవ మానలేదు..పట్టుదల కి మారు పేరు నేనే కదా..
ఇంకో ఫ్రెండ్..నా కాళ్ళు ఒకటే నొప్పి..నాకు తెలుసు దీనికి  వైద్యం..అంటే చిట్కా వైద్యం..
టీ వి లో కూడా చూసాను..వేడి నీళ్ళల్లో పెట్టు  కాళ్ళు..తరువాత తీసి, చల్ల నీళ్ళు..లో పెట్టు ..
అబ్బ ఈ పవర్ కట్ రోజుల్లో స్నానానికే వేడి నీళ్ళు లేవు..ఇంకా కాళ్ళ కా..??ఫ్రెండ్..
జ్వరమా? తల నొప్పా??దగ్గు జలబూ..నా??? అన్నిటికి నాకు మంచి చిట్కాలు వైద్యాలు తెలుసు..అంటూంటే
ఒక్కొక్కరు పారి పోసాగారు.
ఈ సందర్భంగా  త్రీ మెన్ ఇన్ ఎ  బోట్ ..జెరోం కే జెరోం అనే రచయిత రాసిన గొప్ప నవల గుర్తు వచ్చి, నవ్వు వస్తోంది.నా లాగే అతను ఒక పుస్తకం లో ఎ  టు జెడ్ వ్యాధులు గురించి చదివి..ఒక్కటి తప్ప అన్నీ తనకి ఉన్నాయి అనుకుంటాడు. ఆ ఒక్క వ్యాధి..గైనిక్ అంటే ఆడ వారికి సంబంధించింది కనక..
ఆయుర్వేదం దగ్గర్నించి , యోగా..వెయ్యను కాని చెప్తాను మీకు ఆసనాలు, ఎలా వెయ్యాలో, అన్ని చెప్తాను. నాకు నా దగ్గర ఉన్నవిజ్ఞానం అంతా ,ఊరందిరికి పంచితే కానీ నిద్ర పట్టదు.
చేతులు పట్టుకుని ..ఈ వైద్య సలహాలు, నీ వరకే..పరిమితం చేసుకో ప్లీస్..అని బతిమాలు కుంటున్నారు, ఈ పసుపు అన్నం సలహా ఇంకా ఎవరికీ ఇస్తానో, అని భయ పడి..
నా ఆరోగ్యమే తన ఆరోగ్యం..వంట వండాలి కదా. మన ఆరోగ్యమే మహా భాగ్యం..మన భర్తలకి..(మన అంటే..ఎవరి కి వారు)...

2 కామెంట్‌లు:

  1. >>>>>
    ఒకరు, టమాటోలు రోజుకి రెండు తింటే..చాలు , మీ షుగర్ మాటు మాయం..
    >>>>>
    tomatoes contain high content of oxalic acid that can damage stomach>

    రిప్లయితొలగించండి
  2. ఊరికినే మాట వరసకి అన్నాను అండీ..ప్రవీణ్ శర్మ గారు.

    వసంతం.

    రిప్లయితొలగించండి