"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

23 అక్టో, 2011

ఆకాశం జాబిలి..మీ ఇంట్లోనే..

చల్లని సాయంత్రం ,

సంధ్య మేలి ముసుగు
వేసుకుని, అలవోకగా,
అల్లనల్లన నడుస్తూ,


ప్రియుడు వదిలిన
ఎర్రని చెంపలని,
మరింత ఎర్ర పరుస్తూ,
సిగ్గుతో తల వంచి,


గాలి పైటతో ,కబురు
పంపింది, పూల
బాలలూ, నా తల
నిమ్పరూ..అని.


ఆకాశం ,ఆమె
కోరిక విన్నది,
తన నేచ్చేలే
కదా అని, చెప్పింది,


మిణుకు మిణుకు
తారలు, వచ్చి,తుంటరి గా
కన్ను మీటాయి,
ఆమె ని పలకరించాయి.


తారలే అసూయ
పడేలా, తెల్లని,
చల్లని చందమామ
ఇంతలో,ప్రత్యక్షమై,


వెన్నెల పైట వేసి,
సాయం సంధ్యని
సమాయత్తం చేసింది
చీకటి ప్రభువు తో


ఏకం కమ్మని,ఎంత
చల్లని వెన్నెలో,
ఎంత వెండి వెన్నెలో,
ఎంత మంచి జాబిలో.

అమ్మా చెప్పే కథలకి మూలం జాబిలి
పిల్లాడి మారాం కి ఆరామము జాబిలే.
ప్రియుడి కోసం వేచే నెచ్చెలి చెలి ,జాబిలే,
రాని ప్రియురాలి మేడ, వెన్నెల జాబిలి నీడలే..
వెండి వెన్నెల నుంచి ఎంత కోసినా
తరగదు, వెన్నెల వెండి, అమ్మా
ప్రేమ నుంచి ఎంత తవ్వుకున్న
తరగదు, అమ్మకే కుదిరే ప్రేమ.


అమ్మా నాన్న ,అక్క తమ్ముడు,
వెన్నెట్లో తిన్న పెరుగు అన్నం
ముద్దలు ఇస్తాయి, పెద్ద అయాక
గోరంత గా పెరిగి, కొండంత ధైర్యాలు.
ఆడపిల్లల ఒప్పి గుప్పి ఆటలు,
ఆ వెన్నెట్లోనే , గిర గిర తిరిగి
గుమ్మటం లా కూర్చుని, అమ్మా
కళ్ళు తిరుగుతున్నాయే అంటే..


అప్పుడేనా పిల్లా..ఇంక ఎంతుందో
ముందు, చెమ్మ చెక్కలు, కోతి
కొమ్మచ్చులు, ఎప్పటికి ఉండాలే
నీతో, పిల్లా..ఈ వెన్నెల సాక్షిగా..
అనే అమ్మా మనసు ఎంత
చల్లనో, అమ్మా దీవెన ఎంత
వెలుగో, అమ్మా పిలుపు,
సాయంత్రం వెలిగే చందమామ ..


మైమరపు, అమ్మా లేక పోయినా
ఎక్కడయినా చందమామ ఉంటుందనే గా
చందమామ మనకి ఉన్నది,
అమ్మా చందమామ ,ఎప్పుడో


కుదుర్చుకున్న ఒప్పందం ట.
జాబిలి లాంటి చక్కదనం అని
పోలుస్తారు, ఆమె అంతా చల్లగా
ప్రేమిస్తున్దనేగా..గుండెల్లో,


పోడుపుకుని, బిడ్డ లాగే
ప్రేమిస్తుంది, అంతా మనిషిని,
అందుకే, ఆమె లేక పోతే,
అతనికి అమవాసే..


పున్నమి నాడూ అమవాసే,
ఎప్పటికి పున్నమి, జాబిలి,
నీ పెరట్లో నే కావాలా??
నెచ్చెలి ని చల్లగా నవ్వించు.


ఆ నవ్వే నీకు వెన్నెల,
ఆమె నవ్వే వెన్నెల ని అంటి
పెట్టుకుని ఉండే జాబిలి,
ఆకాశం  జాబిలి..మీ ఇంట్లోనే










..








..


















1 కామెంట్‌: