"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

24 అక్టో, 2012

ఇద్దరూ ఘనా ఘనులే..

అది ఒక పెద్ద నగరం...పది అంతస్తుల భవనం లో ఒక ఆఫీసు. రాడియంట్  ఇన్సురన్స్ ఆఫీస్ ముఖ్య కార్యాలయం  ఒక అంతస్తు లో ఉంది.

ముఖ్య అధికారి రామూర్తి ,ఫోన్ లో మాటాడుతున్నాడు..".నాకు ఏదో అనుమానం గా ఉంది..అయినా మన విహారి గురించి నాకు తెలుసు కదా, ఇంకొక్క అవకాశం  ఇద్దాం."..

తలుపు మీద తట్టి ,రావచ్చా? అని తలుపు తీసుకుని విహారి ఏ లోపలి వచ్చి, చనువు గా టేబెల్ మీద కూర్చున్నాడు.

రామూర్తి , ఫోన్ పెట్టేసి."..రా ..రా.."

నువ్వు రెండేళ్ళు కింద ఒక కేస్ చేసేవు గుర్తుందా?? అదే ఆ యాభై లక్షల కేసు..

విహారి క్లెయిమ్స్ విభాగం లో పని ...భీమ చేసిన వ్యక్తి చనిపోతే, అది ఎలాంటి మరణమో ,విచారించ వలసిన బాధ్యత

అతనిది  ...చాల బాధ్యత కలిగిన ఉద్యోగం , విహారి కి మంచి పేరే ఉంది, ఇప్పటి వరకు, ఈ సంస్థ లో.

"మాలిని రావు ,గుర్తు వచ్చిందా?"రామోర్తి //

"ఏమో ,అందరి పేర్లు నాకు ఎలా గుర్తు ఉంటాయి.."విహారి..

ఒక వంకర నవ్వుతో "ఆవిడ ని నువ్వు మర్చిపోలేవు లే.. పెళ్లి అయి న పది 

రోజులకే ,హనీమూన్ ట్రిప్ లోచనిపోయాడు రావు. నువ్వే చూసావు ఆ కేసు..

ఎలా మర్చి పోయావు ,అప్పుడే.."

"సర్, నా ఉద్యోగ బాధ్యత లు నేను చాలా నిబద్ధత తో చేస్తాను, మీరే ఎన్నో 

సార్లు మెచ్చుకున్నారు , మరిచి పోయారా?"

నిష్టూరం ధనించింది..విహారి గొంతు లో..

"నేను కూడా ఊరికే ఏమి ఆధారాలు లేకుండా మాటాడను కదా, నా గురించి 

నీకు కూడా తెలుసు.."

రామూర్తి , అలమార దగ్గరికి నడిచి, "ఇదిగో ఫైల్ , మాలిని ఫైల్, పెద్ద 

మొత్తాల్లో భీమ చేసిన వారి వివరాలు ,అన్నిఒక ఫైల్ కి సేకరించెం .ఈ మధ్య 

మన భీమ  కంపని కాస్త నష్టాల్లో నడుస్తోంది నీకు తెలుసు కదా, అందుకే 

పాత కేసులు కూడా తిరిగి పరిశీలిస్తున్నాం..అందులో భాగం గానే ఈ మాలిని 

కేసు ,కాస్త దుమ్ము దులిపి ,లోతు గా పరిశీలించాం ,ఒక ఆసక్తి కరమయిన 

విషయం బయట పడింది."

విహారి గొంతు లోకి వచ్చింది గుండె..తను ఏమయినా పొరపాటు చేసాడా? ఈ 

ఉద్యోగం తనకి చాల అవసరం..

ఇలాంటి సమయం లో, తన తప్పు ఉందని బయట పడితే...నుదుట మీద 

చమట , ఏ సి గదిలో కూడా..

"మాలిని కి ఇది రెండో వివాహం... "

"ఓహ్ అంతేనా? అదేమీ తప్పు కాదే ," విహారి చేరుమాలు తో చమట 

అడ్డుకుంటూ అడిగాడు.

" తొందర పడకు, పూర్తి గా విను, రెండో వివాహం తప్పేమీ కాదు, నాకూ 

తెలుసు..కాని మొదటి భర్త కూడా

హనీమూన్ విహారం లోనే ప్రమాద వశాత్తు చనిపోయాడు.. ఒక సరస్సు లో 

పడవ ప్రయాణం చేస్తూ, నీకు గుర్తుంది కదా, మాలిని రెండో భర్త కూడా ఇలాగే 

పడవ ప్రమాదం లో పోయాడు.."

విహారి హతాసు డయ్యాడు..నిజమా? ఇంత ముఖ్య మయిన విషయం నేను 

ఎలా చూసుకోలేదు?

ఇది నిజం గా పెద్ద అపరాధమే, మొహం ఎర్ర  బడింది అవమానం తో విహారికి.

చేతులు నలుపుకుంటూ, సర్ ,ఇది ఎలా జరిగింది? ఇలాంటి అజాగ్రత్త ...

"నేను నీకు ఇంకొక్క అవకాసం ఇస్తున్నాను..నువ్వు వెళ్లి ఆవిడ ని కలిసి," 

అంటూ హఠాత్తుగా ," విహారి నువ్వు ఆవిడ ని కలిసావు కదా, నీ పరిశోధన 

లో భాగం గా.."

విహారి తెల్ల మొహం చూసి," ఇంత అజాగ్రత్త గా ఎలా ఉన్నావు? నువ్వు ఈ 

కేసు లో, పెద్ద మొత్తం, ఒకటా ,రెండా?యాభై లక్షలు ఇచ్చేముందు ఎన్ని 

వివరాలు సేకరించాలి.."

బాస్ మొహం చూసేసరికి ,తను వచ్చేసరికి ఫోన్ లో ఎవరి గురించి మాట్లాడు 

తున్నాడో ,అర్ధం అయింది..నాగురించే, ఇంకొక్క అవకాసం అన్న మాటలు 

నా గురించేనా??

విహారి చెప్పసాగాడు, ఆవిడ ఆయన పోయిన ఆరు నెలల తరువాత , 

క్లెయిమ్ చేసింది. తనకి అసలు భర్త భీమ చేసిన సంగతే తెలియదు అని, 

ఆరు నెలల తరువాత ,ఏవో కాగితాల మధ్య దొరికాయి ,పాలసీ పేపర్లు.అని 

ఆవిడ లాయరు చెప్పేడు, పెద్ద ఆవిడ అసలే బాధలో ఉంది, అని ఆవిడ 

కూడా,అవే విషయాలు రాసింది ఒక ఉత్తరం లో, సరే ఏమీ అనుమానం గా 

కనిపించ లేదు అప్పుడు నాకు...లాయరు తో ఉత్తర ప్రత్యుత్తరాలు 

జరిగాయి.. ఆవిడ కృతఙ్ఞతలు చెపుతూ ,తనకి ఉత్తరం రాసిన సంగతి కూడా

అప్పుడే గుర్తు వచ్చింది, విహారికి..

ఏమిటో పెద్ద ఆవిడ అనగానే తనకి తెలియని జాలి,,,కొంప ముంచింది ఈ 

జాలే...గొణుక్కున్నాడు..

" విహారి! ఇది నీకు ఆఖరి అవకాశం ..నువ్వు వెళ్లి మాలిని విషయాలు అన్ని 

వాకబు చేయి, నాకు ఎందుకో ,ఏదో మతలబు ఉందనే అని పిస్తోంది.."

"మన వాళ్ళు ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాదో  ,కనిపెట్టేరు, మన 

అపరాధ పరిశోధన విభాగం వారు, నువ్వు ఆ వివరాలు తీసుకుని,  నీ భార్య 

ని కూడా తీసుకుని వెళ్ళు.."

నా భార్య ఎందుకు? అసహనం ..."కాదు, నీకు తెలియదు, మాలిని ఇప్పుడు 

ఉన్నది ఒక చిన్న ఊరులో, భార్య భర్తలు ఇద్దరూ ఉంటే ,ఎవరికీ అనుమానం 

రాదు, మీరు ఏదో స్థలమో, ఇల్లో కొనుక్కోవాలని, ఆ ఉద్దేశం తో ,ఆ ఊరు

వచ్చారని చెప్పండి ,అందరికి."..అంటూ కొన్ని సలహాలు ఇచ్చేడు..రామూర్తి..

మరునాడే భార్య వినీల తో ,బయలు దేరి ,నగరం కి దూరం ఒక చిన్న పట్టణం 

కి చేరేడు విహారి. అది చిన్న ఊరు అయినా, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందు 

తోంది, స్థలాలు కొనే వారు, చక చక కొనేస్తున్నారు,ముందు .ముందు ఈ 

చిన్న పట్టణం, నగరం తో కలిసి పోతుందని వార్తలు వెలువడడం తో...

ఆ చిన్న ఊరు లో ఉన్నది ఒక్కటే చిన్న హోటల్. హోటల్ మయూరి.. అక్కడే 

ఒక గది తీసుకుని రాత్రి కి దిగేరు.

భార్య భర్తలు ఇద్దరు..మర్నాడు ఉదయం ఫలహారం తీసుకుందామని ,వచ్చి 

కాఫే తాగుతూండగా, వినీల తన వేపే చూస్తున్న ఒక పెద్ద మనిషి ని 

గమనించింది. విహారి  చేయి కడుక్కోవడానికి, బిల్లు కట్టడానికో లోపలి 

వెళ్ళాడు.

విహారి వచ్చి కూర్చోగానే, వినీల ",ఇదిగో చూడు ,ఆహా,వెంటనే వెనక్కి 

చూడకు ,ఆ మూల ఒక పెద్ద మనిషి ,నన్ను తేరి పారా చూస్తున్నాడు, 

ఎప్పుడూ ఆడ వారినే చూడనట్టు..చ"..అంటూ విసుక్కుంది.

వినీల చెప్పినట్టు ,వెంటనే తిరిగి చూడలేదు, కాని బయటకి రాగానే, ఎదురు 

పడ్డాడు. విహారి మొహం వివర్ణ మయింది. ఇతని వేష భాషలు చూస్తే నే 

తెలుస్తోంది, అతఃను కూడా నా లాగే వివరాలు పరిశోధించడానికి వచ్చిన

వాడని, హమ్...మా ఆఫీసు వారికి నా మీద నమ్మకం లేదన్న మాట..ఎంత 

అవమానం?

మాడిన మొహం తో విహారి హోటల్ గది లోకి వచ్చి, ఆఫీసు కి ఫోన్ కలిపి , 

బాస్ ని నిలదీయాలని అనుకున్నాడు.

వినీల " ఏం చేస్తున్నావు విహారి? నువ్వు, వారి అనుమానాలు నిజం 

చేస్తావా? మనం మన ప్రయత్నాలు మనం చేసి, వివరాలు సేకరించి మనమే 

ముందు గా మీ బాస్ కి అంద  జేస్తే సంతోషిస్తాడు ,కాని ఇలా నిలదీయడం 

వల్ల ప్రయోజనం ఏమి లేదు" అంటూ శాంత పరిచింది.

ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది ,సరే ,ముందు ఇక్కడ మొదలపెడదాం...అని 

తలుపు తీసుకుని ఎవరండి ? అని ప్రస్నిస్తూండ గా ఒక లావు ,బట్ట తల 

ఆయన పలకరించేడు..

మీకేం కావలి? మేం ఇక్కడ ఒక ఇల్లు కొనాలని అనుకుంటున్నాం.. అనగానే, 

ఆయన.." రండి, రండి..మంచి సమయానికి వచ్చేరు, ఇళ్ళ ,స్తలాలు అన్ని 

ఎగరేసుకు పోతున్నారు" .."ఇదే మంచి తరుణం ,బేరం చేయడానికి " 

అంటూ గట్టిగా నవ్వేడు.. " నా పేరు భగవాన్లు "

సరే ,మాకు ఒక ఇల్లు చాల నచ్చింది, మేం అలా బజారు లో తిరుగుతూ, ఒక 

ఇల్లు చూసాం, అంటూ, ఆఫీసు లో

తీసుకున్న మాలిని ఇంటి నంబరు ,గుర్తులు చెప్పగానే,

" ఓ ,ఆ ఇల్లా? అది మాలిని దేవి గారిది, కాని, ఆవిడ కి అమ్మే ఆలోచనే 

లేదే?  "పోనీ, ఒకసారి ,మేం ఆ ఇల్లు లోపల చూస్తాం, నమూనా మాకు చాలా 

నచ్చింది. ఆవిడకి చెప్పి ,అనుమతి తీసుకుంటారా? "

"సరే, సరే, దానికేం భాగ్యం.. తప్పకుండా, నేను ఫోన్ లో  చెపుతాను..మీరు 

వెళ్లి కలవండి ,దారిలో "అంటూ అభయం ఇచ్చేడు భగవాన్లు ..

ఇదరూ బయటకి వచ్చేరు.. గుమ్మం లోనే హోటల్ లో కనపడిన పెద్ద 

మనిషి..ఎదురు అయాడు..

ఇద్దరూ గతుక్కుమని, చూడనట్టు, బయలు దేరారు..

నువ్వు హోటల్ కి వెళ్ళు, ఆవిడ ని నేను ఒక్కడిని కలవడమే మేలు, ఆడ 

వారు ఉంటే ,మరోలా ఉంటుంది, వారి ప్రవర్తన..ప్లీస్. అంటూ వినీల ని 

ఒప్పించి విహారి ఒక్కడు వెళ్లి తలుపు కొట్టేడు.

పనమ్మాయి వచ్చి తలుపు తీసింది..

"మాలిని గారి ఇల్లే కదా? ఉన్నారా? "

ఇంతలో ఎవరూ ? అంటూ మాలిని గది లోకి వచ్చింది.

తెల్లని జుట్టు, గంభీరం గా, ఒక రకమయిన ఠీవి ఉట్టిపడుతోంది, అందం 

మూర్తీభవించి నట్టుంది మాలిని ..

"నా పేరు విహారి, అలా నడుస్తూ, వీధిలో ,మీ ఇల్లు చూసేను, నాకు చాలా 

నచ్చింది, మీరు అమ్మే టట్టయితే??"

" మేం ఇల్లు ఎందుకు అమ్ముతాము? ఇప్పట్లో అమ్మే ప్రసక్తే లేదు, మీకు 

నచ్చినందుకు సంతోషం.."

"మీరు చాలా ఏళ్ళు నించి ఈ ఊరు లోనే ఉంటున్నారా ?"

"లేదు, లేదు, ఈ మధ్యే కొన్నాను, నాకు చాలా నచ్చింది..చూడండి ఎంత 

వెలుగో ఈ గదిలో, ఇలా ఉండాలి ఇల్లు అంటే "...

విహారి కి అనుమానం పెరిగి పోతోంది లో లోపల..ఈ మధ్యే  కొన్నారు ట 

అంటే భీమా డబ్బుల తో నే అయి ఉంటుందేమో . కాని ఆవిడని చూస్తే ఎంత 

హుందా గా ఉంది..

"కూర్చోండి, నేను  టీ తాగే సమయం ఇది.."

ముళ్ళ మీద కూర్చున్నట్టు ,కూర్చుని సోఫా లో, ఎలాగో టీ  తాగేడు .

ఇంక లేచి వెళదాం ..అనుకుంటూ లేచే సరికి..

మాలిని  ఆహ్వానం..." ఇల్లు లోపల కూడా చూడండి, మీకు నచ్చింది 

అన్నారు కదా "

మరో సారి, అంటూ ..బయటకి అడుగులు వేస్తూండగా ,తలుపు తెరుచుకుని  

ఒకతను ..."మూర్తి ...రా..రా.."

అతను వచ్చి, మాలిని చేయి చనువుగా పట్టుకున్నాడు.

ఎవరి కొత్త పాత్ర ఈ కథ లో ?? విహారి మనసు అతలాకుతలం..

"ఆ ,విహారి ,ఇతని పేరు మూర్తి, మేం ఇద్దరం పెళ్లి 

చేసుకోబోతున్నాం..త్వరలో.. అతను ఒక్కడు , నేను ఒక్కర్తిని,

ఇద్దరం కలిసి ఇక మిగిలిన జీవితం గడపాలని నిశ్చయించు కున్నాం .."

విహారి మనసు ,మరో మాట తో పూర్తి గా బెంబేలు పడి  పోయింది.

"మేం పెళ్లి అయిన మర్నాడే ,హాని మూన్ ప్రయాణం కి ఊటీ కి 

వెళుతున్నాం.."ఊటీ సరస్సు గుర్తు వచ్చి ,విహారికి ...

" నేను మీ ఇల్లు చూడ డానికి నా భార్య తో మరో సారి వస్తాను.."

విహారి బయట పడి,  నాలుగు అడుగులు వేయక ముందే భగవాన్లు ఎదురు 

అయాడు..విహారి ని చూసి," ఇల్లు చూసారా??

" ఆవిడ అమ్మే యోచన లో ఉంటే ,నాకు వెంటనే తెలియ చేయండి..ఇదిగో 

మా హోటల్ ఫోన్ నంబర్."

"నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను..."

భగవాన్లు నవ్వుతూ, మాటకి ముందు నవ్వుతాడు అతను గట్టిగా...


ఈ ఊరులో మీలాంటి వాళ్ళు, కాష్ పెట్టుకుని, కాచుకుని కూర్చున్నారు..త్వరపడండి ,మీరు కూడా, ఆలసించిన

ఆశా భంగం " ..

విహారి హోటల్ చేరి, గది లో కూర్చుని, వినీల కి విషయం అంత వివరించేడు..

ఇంతలో ఆఫీసు నించి ఫోన్.

మాలిని , మూర్తి పేరు మీద భీమా చేసిందని.

విహారి, వినీల రాత్రి అంతా ,నిద్ర పోలేదు..

ఉదయమే, ఫలహారం చేస్తూ ఉండగా, మూర్తి కనిపించాడు..హోటల్ లో.

విహారి ,మూర్తి గారు, రండి, రండి,

ఈవిడ నా భార్య వినీల..కూర్చోండి ...

లేదు, లేదు, నాకు వేరే పని ఉంది, నిన్న నా హెల్త్ చెక్ అప్ అయింది, ఆ 

ఫలితాలు తీసు కోవాలి, అంటూ హడావిడిగా వెళ్లి పోయాడు.

విహారి ,వినీల ఒకరి మొహం ఒకరు చూసుకుని, తెల్ల బోయారు.

మాలిని భీమ పాలిసి ఎందుకు తీసుకుంటుంది? మూర్తి పేరు మీద?? అది కాక 

అప్పుడే హెల్త్ చెక్ అప్ కూడా అయింది ..చాలా చురుకు గా ఉందే , ఈవిడ..

ఇద్దరూ హోటల్ గది కి చేరి, ఏం చేయాలో ఆలోచిస్తూ, మరునాడే వెళ్లి ఈ పెళ్లి 

ఆపాలి అని నిశ్చయించు కున్నారు,

కాని ,కారణం లేకుండా ఆపడమెలా?? గట్టి రుజువు చూపితే కాని, పెళ్లి  

ఆపలేం , మాలిని పరువు నష్టం దావా వేస్తే ,

మళ్లీ ,అది ఒక పెద్ద తల నొప్పి, నాకు..

విహారి కి ఆ రాత్రి  శివ రాత్రే..

మరునాడే, భగవాన్లు నించి ఫోన్..

" మీరు చెప్పమన్నారు కదా..ఆ ఇల్లు అమ్మకం అయితే..పాపం మీరూ ఆశ 

పడ్డారు. మాలిని ఏమిటో రాత్రి కి రాత్రి ,ఇల్లు అమ్మేసుకుని వెళ్లి పోయింది..."

అయ్యో, అనుకున్నంత పని అయింది..మాలిని అనుకున్నంత పని చేసింది..

ఆవిడ అమాయకురాలు కాదు, రుజువు దొరికినట్టే, ఎలాగయినా పట్టుకోవాలి.

మాలిని ఇంటికి పరుగు పెట్టేడు..విహారి.

అప్పుడే ఇల్లు ఖాళి, భగవాన్లు బయట కి వస్తూ, వచ్చేరు," మీకు ఆ అదృష్టం 

లేదు, ఎవరో ,ఎక్కువ ఆశ పెట్టి  ,ఎగరేసుకు పోయారు, మంచి ఇల్లు.."

ఇల్లు సరే ,నా ఉద్యోగం ఏమవుతుందో?? విహారి..

బయట గుమ్మం లో ,మళ్లీ ఆ పెద్ద మనిషి..హోటల్ లో ,అన్ని చోట్ల ,తనని 

నీడ లాగా అనుసరిస్తున్న ఆ పెద్ద మనిషే ..

ఇంకా దాపరికం ఎందుకు? ఇద్దరం ఒకే ఆఫీసు వాళ్ళమే..కదా..పర్సు లోంచి 

తీసి  విహారి, తన పేరు, హోదా రాసి ఉన్న కార్డ్ ఒకటి 

అందించేడు..రాడియంట్ ఇన్సురంస్ కంపనీ పేరు కింద తన 

పేరు..వివరాలు ..

ఆ పెద్ద మనిషి కూడా, తన కార్డ్ తీసి ఇచ్చేడు.

అంబ్రెల్లా ఇన్స్యురంస్ కంపనీ చిహ్నం గొడుగు కింద అతని 

పేరు...వివరాలు..కమల కర్..అని ఉంది.

విహారి ఆశ్చర్యం తో నోరు తెరిచాడు.

మా కంపనీ కాదు, మా ఆఫీసు వారు ,నా మీద అపనమ్మకం తో, నా వెనకే 

పంపించిన మరో ఆఫీసరు కాదు..

మరో కంపని..అంటే మాలిని ఇక్కడ కూడా భీమ చేసింది అన్నమాట.

ఎంత మాయ లాడి ? మాయ లేడి ?? విహారి మనసు విల విల లాడింది..ఎలా 

ఆడించింది?

అప్పటికి వినీల ఏమంది?? మీకు ఇంత జాలి  ఏమిటి ? తెల్ల జుట్టు, పెద్ద వయసు అంటే ,చాలు పెద్ద వారు అని మీకు

గవురవం..హ్మ్మం...నిజమే...తను ఇలా అమాయకం గా నమ్మడం ఇంక 

తగదు.

కమలా కర్, " మూర్తి మా భీమ కంపనీ లో మాలిని పేరు మీద పాలసి 

తీసుకున్నాడు, మాకు అనుమానం వచ్చి,విచారించుదాం ,అని నేను 

వచ్చేను .."

"ఎందుకు అనుమానం ?" విహారి, పాలసి ఏ కదా..

"హు..మూర్తి కి ఇది నాలుగో పెళ్లి, ముగ్గురు భార్యలు 'బాత్  టబ్ ' లో మునిగి 

చని పోయారు..మాలిని నాలుగో భార్య.."

ఇద్దరూ, రాత్రికి రాత్రి మన కళ్ళు గప్పి పారి పోయారు..

విహారి ,కమలాకర్  కరచాలనం చేసుకుని విడి పోయారు..

ఎవరు ముందు బాత్  టబ్ లో స్నానం చేస్తారో, లేదా ముందు పడవ 

ప్రయాణం చేస్తారో?? ఊటీ సరస్సు లో ? ఏమో

ఊటీ ఒక్కటేనా ఏమిటి ఈ దేశం లో??

మాలిని, మూర్తి ఇద్దరూ ఘనా ఘనులే..

వేచి చూడాలి, ఇంక, ఎవరు ముందు క్లెయిమ్ చేస్తారో..పాపం..ఆ వార్త కోసం..

మేము అల్ప ప్రానులం ..మరి..


హిచ్కోక్ క్రైమ్ స్టొరీ ఎపిసోడ్ కి అనుసరణ ...సరదాగా...








































5 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. థాంక్స్ ,పద్మర్పితా..

      ఓపిక గా చదివి ,మీ అభిప్రాయం కూడా రాసినందుకు.

      వసంతం.

      తొలగించండి
  2. చిన్నపుడు చదివిన డిటెక్టివ్ నవలల మాదిరిగా ఉంది భలే రాసారు వసంత గారు.

    రిప్లయితొలగించండి
  3. చిన్నపుడు చదివిన డిటెక్టివ్ నవలల మాదిరిగా ఉంది భలే రాసారు వసంత గారు.

    రిప్లయితొలగించండి
  4. వసుధా !
    ధన్యవాదాలు అండీ , నాకు చిన్నప్పుడు ఈ అపరాధ పరిశోధన నవలలు , కథలు భలే ఇష్టం గా ఉండేది .. ఇలా ఓ చిన్న ప్రయత్నం చేసాను ..నచ్చినందుకు చాలా సంతోషం .
    వసంత లక్ష్మి .

    రిప్లయితొలగించండి