"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

31 అక్టో, 2012

'తల్లి కడుపు చూస్తుంది - ఆలి జేబు చూస్తుంది'


'తల్లి కడుపు చూస్తుంది - ఆలి జేబు చూస్తుంది'


goes a Telugu Saying. Agree? ముఖ పత్రం లో ఒక పోస్ట్..

ఆడవారం అందరం,తలో చెయ్యి వేసి ఖండించాం ...

ఆ సందర్భం గా నేను రాసినవి ....



అవును ఆడ వారికి జేబు లు లేవు, బ్యాంకు అకౌంట్స్ లేవు, జీతాలు లేవు, భర్త ఇంటికి జీతం తెచ్చి 

ఇచ్చినా, ఇవ్వక పోయినా, ఎలాగో?? ఒక లాగ పిల్లలికి, భర్త  కి కూడా కూడు పెట్టాలి..ఎలా??

అందుకే జేబు లో చెయ్యి పెడుతుంది...ఒక్కోసారి, ఒక బీడీ ముక్కో, ఒక సినిమా టికెట్ ముక్కో, 

ఇంకేదో కూడా కనిపించ వచ్చు.



అయినా, ఆశ, ఇంట్లో వాళ్ళ అమ్మా ఆకలి అంటారు...నాన్న తెచ్చి ఇచ్చాడా? అని అడగరు..

అందుకే జేబు లో చెయ్యి..

స్కూల్ ఫీజు కి ఆఖరి రోజు, కరెంట్ బిల్ కి ఆఖరి రోజు..

ఇవి ,తెలిసి ,తెలియనట్టు నటించే భర్త, ఎక్కడ పుట్టిస్తావో? నేనే కదా, నిన్ను, మిమ్మలిని అందరిని 

పోషించే మగ మహా రాజు ని..

నన్ను నమ్ముకో, నన్ను వేడుకో, నన్ను బ్రతిమాలు...అని ఊరిస్తాడు..

విసిగే, వేసరి, పెడుతుంది అలి, జేబు లో చేయి..

విసిగి వేసరి, ఒక అట్లా కాడ తిరగేస్తే. ఆమె గయ్యాళి..

చెప్పనా, నాకు గయ్యాళి అంటే భలే ఆరాధన,

గట్టిగ నిలబడి, నంగిరి కార్చకుండా, ఖని ఖని మని మాట్లాడే గయ్యాళి 

భార్య అంటే నాకు భలే అడ్మిరేశాను..


అవును ఆడ వారే ,స్త్రీలే.. అన్నిటికి బాధ్యులు..

తరగతి లో మార్కులు తక్కువ వస్తే,పిల్లలికి 

బడి ఎగ్గొట్టి బల దూరు తిరుగుతున్న కొడుకు,

కూతురు  ప్రేమ లో పడినా,

పప్పు లో ఉప్పు ఎక్కువయినా, 

భర్త కి అనారోగ్యం చేసినా,

ఆఖరికి ఇంట్లో కరెంట్ పోయినా..

అన్నిటికి ఇంట్లో భార్యే...కారణం..

ఏం ,ఏం చేస్తావు ఇంట్లో? కూర్చుని,

ఆ దిక్కుమాలిన సేరియల్స్ చూడదమేగా?

పిల్లలకి చదువు చెప్ప లేవూ ఆ మాత్రం..

అందుకే , మీకు డిగ్రీ ఉన్న, బుర్ర లో మాటర్ శూన్యం..

కొడుకి ని అదుపులో పెట్ట లేవూ?

ఒక్క రోజు రుచిగా చేసి పెట్టావా వంట?

ఏమిటో ,నా ఖర్మ, కట్నం కోసం ఆత్రపడి, 

నేను నిన్ను కట్టుకున్నాను, కాని, ఏనాడూ 

సుఖ పడలేదు నేను..

భర్త...బాధ కి అంతే లేదు..

చివరికి ఒక రోజు ...

అనుకున్నత పని అయింది,

భార్య పరమ పదించింది...పాపం..

అతడు ఒక్కడూ, ఎలా ఉంటాడు?

పిల్లలని ఎవరు చూస్తారు?

ఇల్లు ఎలా నడుపు కొస్తాడు?

ఈ పనులన్నీ ఆవిడా ఉంటె, 

చేసే పనులే మరి..

అయినా ఇంటికి కాపలా గా 

మరో భార్య కావాల్సి వస్తుంది, పాపం 

మగవాడు కదా...

భార్య ఉంటే ఏం పనులు 

చేసేదో ...అప్పుడే తెలిసింది మరి..

మరో భార్య కావాల్సిన రోజు న..




సమాజం అంటే...భర్తలే కదా 

వారు రాసిన రూల్స్ 

సమాజం గీసిన లక్ష్మణ రేఖలు 

భార్యలకి...అవును...

గీయని గీతాల మధ్య ఆమె 

ఒక బందీ , అటు చూడకు,

ఇటు నడవకు, ఇలా పైట వేసుకో,

అలా  విరగబడి నవ్వకు..

ఇలా పెంచు, పిల్లలని 

అలా చెప్పు కుర్రాడికి 

నువ్వు గొప్ప రా..

అని చెప్పు, చిన్నప్పుడే 

నువ్వు పెంచే పిల్లడే 

రేపు పెద్ద వాడయి...

అమ్మా ..నా పిల్లలకి 

నువ్వు జీతం లేని ఆయావి 

అని మెచ్చుకునేలా ,అమ్మ 

మురిసి పోయేలా.


ఆడ వారి గురించి 

ఎంత రాసినా నా ఆక్రోశం..

నా ఆవేదన...అవి అక్షరాలే 

అవి శర ఘాతాలయిన 

రోజు, అవి గుచ్చుకున్న రోజు..

అవి మార్పు కి శ్రీకారం 

అని చూసిన రోజు...

ఇంక నేనూ విరమిస్తాను..

విశ్రాంతి తీసుకుంటాను..














7 కామెంట్‌లు:

  1. nenr rataddamanukannadi e saying mida.ma intlo kuda e topic mida pedda argument. mother ni goppaga chepthe bhadaledu,kaani pellam chese chakiri marchipoyi dikkualini dilogue okati.monna evaro mahahanu bhavudu ee topic mida oka post vesadu.valla avidaku chupinchalannatha kachiga vundante nammandi

    రిప్లయితొలగించండి
  2. మహిళామణుళ్ళారా , రోజులు మారుతున్నాయి . 2012 ఇది . ఇప్పుడు నాకు ఏ శక్తీ లేదు అనుకొనే మహిళలు అనాగరికులు . మీరు దేల్లో తక్కువ ? అన్నిటా ఎక్కువే. భర్త ప్రేమిస్తే మీరూ ప్రేమించండి , భర్త తిడితే మీరు తన్నండి.పెళ్ళాం చేత తన్నులు తిన్నాడంటే పురుష పుంగవుడికి మరణ తుల్యము .భర్తకు వంట పిల్లలకు చదువు ప్రేమతో చెయ్యాలి . భయంతో కాదు. మహిళల్లో అంతర్లీనంగా ఉన్న శక్తి ఆది శక్తి .120 కోట్ల జనాభా గల మన దేశం ఒక మహిళ చెప్పుచేతల్లో నడుస్తూంది .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు అండి..

      అవును మా మానాన మమ్మలిని వదిలేస్తే

      మేం చక్కగా నడుపుతాం..ఇల్లు ,దేశం..

      ఆఫీసు. ఏదయినా..

      థాంక్స్ అండి..

      వసంతం

      తొలగించండి