"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

1 ఫిబ్ర, 2013

ప్రేమలేఖ అంటే

సన్నజాజి తొడిమ కి తెలుసా 
తను మోసేది పరిమళం అని?
నిశి రాతిరి కి తెలుసా తను 
పూసేది నలుపు రంగు అని?

పుడమి ని తడిపే వాన చుక్క 
కి తెలుసా ,చుక్క చుక్క ..
పచ్చదనం కి ఊపిరి అని..
నల్ల ,నల్ల మబ్బులకేమి 
తెలుసు ,చమక్ చమక్ 
వెండి తీగలు మోస్తోందని..

మన్నించే మాట కి తెలుసా 
మన్నన  వెనువెంటే అని..
ప్రేమించే మనసుకి తెలుసా 
ప్రేమ కి కూడా ఒక మనసు 
ఉంటుందని, అప్పుడే ప్రేమ 
నిలిచే ఉంటుందని..

మాట ,మాట కి ఒక అర్ధం 
అలాగే ,మౌనం కి ఒక అర్ధం..
ఏ భాష అక్కరలేని మరో 
భాష..ఒక్క కంటి చూపు..
పెదవి ని దాటని ఒక 
చెలి చిరునవ్వు, పంటి 
కింద తొక్కిపెట్టిన చిరు 
చిరు హాసం..అదే మరి 
ఆమె భాష..అదే మరి నీకు 
ఆమె పంపే తోలి ప్రేమలేఖ..

కన్నులతో చెప్పిన 
పెదవులు పలకని తొలి 
ప్రేమ లేఖ ని అందుకున్న 
ఆమె వదనం లో నీకు 
అరచేతిలో చందమామ 
కనిపించిందా? అయితే 
సరే, కాసిన్ని తారలు కూడా 
తెంపి ఆమె నల్లని జడ నింపు..

ఆ వాలు జడ ఒక్కసారి 
విసిరితే ,నీ ఒళ్లేనే రాలుతాయి 
లే చుక్కలు, తారలు..
గోదావరి నది ఒమ్పులన్ని 
ఆమె మేని లో ఉన్నాయి నిజమే 
కాని, ఆమె కళ్ళ నిండి ఒక్క 
కన్నీరు చుక్క కారినా 
గోదావరి కి వరద ఒచ్చిన్నంత 
భీభత్సం , సరే మరి కాసుకో..

ప్రేమలేఖ అంటే ఏదో కాగితం 
కలం ,కాసింత పడి కట్టు 
పదాలు కాదబ్బాయ్..నీ 
మనసులో పూసిన ప్రతి 
సంతోషం ,ఆమె మనసులో 
ప్రతిఫలించాలి, ఆమె మనసులో 
నీ నవ్వే గుడిగంటలు కావాలి..

మాటలే అక్కర్లేని మనసు 
పుస్తకం లో రాయని మాటలు 
తోట పూయించే సన్నజాజి 
పరిమళం..తొడిమ కి తెలియని 
పరిమళం..పూవు కి ఎక్కడిదో?

అదే కదా ప్రేమతో ప్రేమ 
ని పూయించడం..ప్రేమ ప్రేమ ని 
ప్రేమించడం..మనసు ని 
పరిమళం తో నింపడం..






2 కామెంట్‌లు:

  1. గోదావరి నది ఒమ్పులన్ని
    ఆమె మేని లో ఉన్నాయి నిజమే
    కాని, ఆమె కళ్ళ నిండి ఒక్క
    కన్నీరు చుక్క కారినా
    గోదావరి కి వరద ఒచ్చిన్నంత
    భీభత్సం , సరే మరి కాసుకో..

    ప్రేమలేఖ అంటే ఏదో కాగితం
    కలం ,కాసింత పడి కట్టు
    పదాలు కాదబ్బాయ్..నీ
    మనసులో పూసిన ప్రతి
    సంతోషం ,ఆమె మనసులో
    ప్రతిఫలించాలి, ఆమె మనసులో
    నీ నవ్వే గుడిగంటలు కావాలి.........చాలా చాలా బాగుంది.......

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డేవిడ్ గారికి ,
      మీ ఓపిక కి జోహర్లు అండి..
      ప్రతి కవిత, రచన చదివి మీ అభిప్రాయం రాసేరు.
      ధన్యురాలిని..
      ఇంతకన్నా మాటలే లేవు నాకు..
      వసంతం.

      తొలగించండి