"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

4 ఫిబ్ర, 2013

నిర్భయ..

అడుగులు ముందుకే 
చూపులే వెనక్కి..
ఆ అబ్బాయి ఎవడో?
ఆ వెనక నున్న అంకల్ 
కి అదేం బుద్ది ,అలా 
ఇకలిస్తాడు ..చున్ని 
పక్కకి తోలిగిందా ??

హు,ఇవాళ జీన్స్ షర్టు 
కదా, అయినా ఏదో 
మర్చిపోయినట్టు ..
ఎప్పుడూ ఆడ పిల్లని 
చూడలేదా? ఏమిటా 
చూపులు, రెండు చక్రాలు 
గా చేసి, నా చెస్ట్ మీదకి 
విసిరి ,కోసేస్తున్నాడు ..
వెధవ చూపులతో..

అమ్మ పాలు తాగలేదా 
అయినా నేను కూడా 
ఎందుకు అలా పట్టించు 
కోవడం, నా దారి న నేను 
పోతాను, అదిగో నా బస్సు..

అమ్మో ,బస్సు ఫుల్ 
ఇవాళ కూడా నిల్చునే 
తప్పదు, పుస్తకాల సంచి 
గుండెకి హత్తుకుని, 
పాకెట్లో నించి పది 
రూపాయల కాగితం 
ఇచ్చినారాయణ   కాలేజ్ 
అంటూ టికెట్ కోసం చేయి 
చాపితే, ఒక అయిదు రూపాయల 
బిళ్ళ చేతిలో పెట్టి, చెయ్యి 
నిమిరాడు, యాభై ఏళ్ళ 
నడి వయసు కండక్టరు..

చేతి మీద ఆసిడ్ పోసినట్టు 
మండింది, ఒక చూపు 
తీక్షణం గా వాడి వీపు ని 
తాకి, జారి పోయింది..
సిగ్గు లేని వాడికి ,చూపుల 
తిట్లు పడతాయా? వీడికి 
నా అంత కూతురు ఉంటుంది..

ఇంకా కళాశాల లో చెవులు 
మూసుకుని , సిగ్గు శరం 
మానం ,అవమానం ,మూట 
కట్టి సముద్రం లో పడేసి 
రావాల్సిందే...అయినా ఆ 
మలైకా , ఆ పడుకొనే అలా 
అందాలు పార పోస్తారు..
ఇంకా ఎందుకు మాలాంటి 
అమ్మాయిల మీద కూడా 
ఆ ఎంగిలి చూపులు?

అవి అందని దూరం 
అందాలు, ఇవి ఎదురుగా 
కనిపించే కమ్మని అందాలు 
అన్నాడు ఒకడు..
చూపులతో నే ఎంత 
తాగుతారో? సిగేరెట్టు ఆఖరి 
దమ్ము వరకు పీల్చినట్టు..

ఒళ్లంతా చిర చిర..ఏదో పుండు 
సలిపినట్టు బాధ..నా మానం 
ఎవరో దోచినట్టే..ఈ చూపుల 
స్పర్శ ఎంత చీదరో? అమ్మా..
నన్నెందుకు కన్నావమ్మా?

అమీబా , హైడ్రా ...తల 
లో ఆలోచనల హైడ్రా ..
అమీబా లో మారిపోతున్న 
అసహనం..రూపం..
ఈ శరీరం నాదేనా? నా సొంతమేనా?
ఏదో అరువు శరీరం ,అనిపిస్తోంది..

ఈ బరువు, ఈ బాధ, యే 
మూల నించి ఎక్కడికి 
పాకుతుందో..ఎక్కడ పడగ 
ఎత్తుతుందో? మధ్యలో ఈ 
నెలసరి బాధ ,ఒకటి, 
తునక తునకలు చేస్తూ,
ఎవరికీ అర్ధం అవుతుంది, 
ఈ చిరునవ్వు వెనక ,
కడుపు ని తిప్పేసే బాధ..

చూపులు, చూపులు 
తూట్లు పొడిచే చూపులు..
ముందుకి ఒంగి, ఉండలా 
చుట్టుకు పోవాలి అనిపిస్తుంది 
ఏమిటా గూని నడకా అనే 
అమ్మ కి తెలియదా? ఎందుకో?

ఇంటికి చేరే సరికి నిర్భయ 
కళ్ళు మూసింది, నిర్దయ 
లోకం నించి వెళ్ళిపోయింది 
నిర్ద్వందం గా ఛీ కొట్టి ,
విసిగి పోయి వెళ్ళిపోయింది.
అని వార్త..

నేను ..నేను...ఒక 
కన్ను మూయని నిర్భయ నే 
ఇంకా నేను నా సమరం 
కొనసాగిస్తున్నాను ...ప్రతి దినం 
నా ఒళ్ళు జ్వలిస్తూ, నశించి 
నిముషం ,నిముషం కొంచం కొంచం 
నిర్భయ గా జీవిస్తున్న నన్ను 
చూసారా ? మీరు..చూడండి ..











8 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. చెప్పాలంటే..
      ధన్యవాదాలు అండి ..
      మీరు నా కవితలు చదవడమే కాక, మీ అభిప్రాయం, ప్రశంశ లను కూడా రాస్తున్నారు..చాల, సంతోషం అండి ,మీకు నచ్చినందుకు..
      వసంతం.

      తొలగించండి
  2. రెండు కళ్ళల్లోంచి చూపులు
    సూదుల్లా వచ్చి
    మంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతున్నాయి..
    ఆ కళ్ళల్లో ఏప్పుడు ఒకే సంకేతం
    చొంగ కార్చే కుక్కలాంటి ఆకలుంటుంది...
    ఆ కళ్ళని వేటాడటానికి కళ్ళతోనే యుద్దం చేస్తాను..
    ఆడదానికి ఒల్లంత ముల్లుండే రోజుకోసం ఎదురుచుస్తాను....
    .ఎప్పుడో, ఎక్కడో ఈ కవిత చదివినట్టు గుర్తు....
    మేడం చాలా బాగుంది మీ కవిత...
    పురుషాదిక్య సమాజాన్ని కూకటి వెల్లతో పెకిలిస్తే తప్ప మహిళలకు రక్షన లేదు......రాస్తూ ఉండంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డేవిడ్ గారు..
      పురుషుడు అయి ఉండి పురుషాధిక్య సమాజం మీద సంధించ మంటున్నారు కవి అస్త్రాన్ని ..మీ సహ్రుదయతకు జోహార్లు.
      మరి ఒక్క సారి ధన్యవాదాలు.

      వసంతం.

      తొలగించండి
  3. వసంతం గారు మీలాంటి వారు రాస్తున్న కవితలను చదివైన మాలాంటి వారిలో కొంచమైన మార్పు వస్తే చాలు అన్న చిన్న ఆశ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డేవిడ్ గారికి..
      అవును..అదే ఆశ..చిన్ని చిన్ని ఆశ..
      ఏదో ఒక రోజు..ఒక మెలకువ..స్పృహ కలుగుతాయని ఆశ..
      మీ మాట తోడు ఈ ప్రయాణం లో చాలా చాలా అవసరం..
      డ్నన్యురాలిని..
      వసంతం.

      తొలగించండి