"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

25 ఫిబ్ర, 2013

నాకున్న రెండు చేతులూ

అడవి గర్భం లో అన్నలు 
అంచున ఖాఖీలు 
ఆడే తుపాకి ఆట లో 
ఎవరికి ఏ తూటా రాసి 
పెట్టి ఉందో ,ఎవరికి తెలుసు.. 

ఎవరి కోసమో ఆ యుద్ధం 
ఎవరికి వారు ఇది మా 
ధర్మ యుద్ధం అని గొప్పలు 
పోతారు, మధ్యలో నలిగిన
ప్రాణులు ,ఎవరో వారికి 
పెద్ద పేరూ, ఊరూ ఉండదు .. 

వారి కోసం ఎవరూ స్మ్రుతి 
చిహ్నాలు కట్టరు, వారికి ఒక 
నివాళి , అశ్రు తర్పణం 
లాంటివేం ఉండవు .. 
చదరంగం బల్ల మీద మంత్రులు 
వేసే ఎత్తు పై ఎత్తు కి పడి పోయే
మామూలు బంటులు వీరే ... 

పక్కన ఒక నల్ల పెట్టె లో 
పడేసి మూత పెట్టేస్తాం .. ఆఖరున 
రాజో ,రాజు తరపున మంత్రో 
గెలిచాక అవతలి శిబిరం పై 
వారి విజయ విన్యాసాలు చూసి 
జేజే లు కొట్టేందుకు మళ్లీ 
ఆ నల్ల పెట్టె లో పడేసిన 
మృత దేహాల చెంతనే పడుండాలి .. 

అదే మరి యుద్ధ నీతి.. 
ఆ ప్రాంతాన్ని జయిస్తావు ..కాని 
అక్కడ జీవాలు అప్పటికే 
నశించి ఉంటాయి .. 
అయినా నువ్వు ఎగర వేసే 
విజయ పతాకం లో ఎర్రెర్రని 
మరకలు కి తిరుగు లేదు 

ఇంక ఈ జిహాదిల గోల ఏమిటో 
చిదిమిన దేహాల మధ్య పరుండి 
ఏ కలలు కంటున్నవో ?
నిదుర ఎలా పడుతుందో?
పళ్ళెం లో ఎముకల దొంతర 
విరిగిన చేతులు వడ్డిస్తే 
తినగలవా? ఏ దేవుడు అడిగాడో ?
ఈ మానవ దేహాల ప్రసాదం?

నా ఇల్లు, నా నిద్ర ,నా ఆకలి 
నా కలలూ కాజేసే ఈ రాజ్యం ,
ఏ రాజ్యమూ నాకొద్దు.. 
అని చివరి సారిగా నాకున్న 
ఈ రెండు చేతులూ ఎత్తి 
మొక్కుతున్నా ...చివరి సారి 
నాకున్న రెండు చేతులూ 
ఏ క్షణం లో ఇవి ఊడి పడతాయో ..... 



2 కామెంట్‌లు:

  1. నా ఇల్లు, నా నిద్ర ,నా ఆకలి
    నా కలలూ కాజేసే ఈ రాజ్యం వద్దు అంటే ఒకే కాని
    ఏ రాజ్యమూ నాకొద్దు అంటే ఎలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హ్మ్మ్మ్ ...అధికారం చెలాయించే ఈ అధికారమూ మాకు వద్దు..

      అని నొక్కి చెప్పడమే నా ఉద్దేశం.

      డేవిడ్ గారు..

      నా రచనల్ని చదివి, చక్కని, నిశితమయిన అభిప్రాయాలు రాస్తున్నందుకు నా ధన్యవాదాలు.

      వసంతం.

      తొలగించండి