"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

19 ఫిబ్ర, 2013

మర్యాద ముసుగు

మర్యాద ముసుగు జారనీకు 
ఎంత తుడిచినా ,కన్నీటి 
జాడలు ఇంకిన ఆ జాడలు ..
చెప్పెస్తాయేమో ...మేకప్ సరిచెయ్..

ఎంత దాచినా ,నీ శరీరం బరువు 
పెరిగి , కళ్ళు ఉబ్బి, నిలకడ లేని 
కుదురు లేని మనసు ని కట్టడి 
చేస్తూ, దొరికి పోతావు..కట్టడి చెయ్యి..

మర్యాద ముసుగు జారనీకు..
నీ చీర కొంగు ,చుట్టూ తిప్పి 
గట్టిగా బిగించు, ఒక్క అడుగు కూడా 
జారకు, అదిగో, అక్కడే జాగ్రత్త..

నీ అడుగు గట్టిగా నేల మీదే ,ఇక్కడే 
ఈ నేల ,ఈ చదును చేసిన నేల ,ఈ 
గట్టి నేల మీదే వేయాలని, ముందే 
అంతా తయారు చేసి పెట్టేం...

భద్ర మహిళ లు నడిచే దారి ఇదే 
వంకాయలే కాదు ,మీరు కూడా 
కుళ్ళి పోతాయి, చెడిపోతారు..
కంచె కి కాపలా ఉండాల్సిందే..

తల వంచి, మెడ దించి, ఒళ్ళు 
అప్పచెప్పి, నోరు మూసుకుని 
ఇంకా ఏమిటో? మర్చిపోయాను...
గాలి, నీరు, అన్నం ,బట్టలు ఇస్తాం..

ఇంకా ఏమిటి ఏదో గొణుగుతారు ?
మర్యాద ముసుగు వేసుకోండి..ఆ 
మా మర్యాద కూడా మీరే మరి 
కాపాడాలి...ఏం ఆ మాత్రం చేయలేరా?

మా కోసం..మేం అన్ని ఇస్తాం కూడా..
మీకు ఏం కావాలో చెపితే అన్ని మేమే 
ఇస్తాం కదా,తిన్నది అరక్క అలా 
ఎందుకు వీధికి ఎక్కుతారు? ఏమో 

మర్యాద ముసుగు జార నీయకు ..
మరి మర్యాద ముసుగు జారనీయకు..
ఓ మహిళా, ఓ వనిత..ఓ భోళా  స్త్రీ..
నీ మర్యాద ముసుగు...తొలగించకు..

2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ధన్యవాదాలు డేవిడ్ గారు..

      చాల సంతోషం.. మీరు నా రచనలన్ని ఓపికగా చదువుతున్నందుకు ..

      మీ అభిప్రాయం కూడా, చక్కగా, ఓపిక గా రాస్తున్నందుకు. ఒక కవి

      కవయిత్రి కి కావల్సినది ఇలాంటి ప్రతిస్పందనే..


      వసంతం.

      తొలగించండి