"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

19 ఫిబ్ర, 2013

మైదానం



ఒక బీరువా, ఒక కుర్చీ ,ఒక 
గోలెం లో ప్లాస్టిక్ మొక్క లాగ 
తన ఇంట్లో గోడకి వేలాడి పడి 
ఉండే పెళ్లి ఫోటో ఫ్రేం లాగ 
ఎక్కడ ఉండి పోతానో ..
జీవితాంతం నేను ఎక్కడ 
ఉండి పోతానో, ఒక ఫ్రేం లో 

అని ..నాకూ మెలకువే ..
రాజేశ్వరి కి అమీర్ దొరికేడు ..
మొహం, క్షణికం..తూ అంటూ 
ఉమ్మేసారు..అయినా వారు 
మైదానం అంచులు చూసారు..

చీకటింటి గదులు, 
పిడికిట బిగించిన మదులు 
నలిపివేసే కామ కోరికలు 
తెల్లారిన రాత్రులు ..

ఇంకానా అని ఏ క్షణం 
మెలకువ వస్తుందో అని 
అను క్షణం మెలకువ ,స్పృహ 
అనుక్షణం ఒక నిరీక్షణ..

నన్ను బంధించిన గొలుసులు 
ఏమిటా అని ఒక రోజు చూసాను..
ఫకాలున నవ్వు వచ్చింది, ఊరికే 
ఇలా అంటే విరిగి పోయేవే ,పెద్ద 

గట్టి సంకెళ్ళు కావే, అయినా 
ఏమిటో ,ఇలా ఉన్నాను..కాపలా 
కుక్క లాగ విశ్వాసం గా, ఇంత అన్నం 
అంత ప్రేమ పంచుతున్నారని కాబోలు..

ఏమిటో నేను ఇలా నన్ను నేను 
బంధించుకున్నాను..
ఎప్పుడో ఒక విశాల మైదానం లోకి 
పారిపోకుండా నన్ను ఆపగలరా?
ఎన్ని కాపలాలు పెట్టినా..

మైదానం లోని విశాలత్వం..
మైదానం లో విశృంఖలత ..
మైదానం లోని నిరాడంబరత ..
మైదానం లో నగ్నత ,అన్ని, అన్ని 

నన్ను చిటికెలు వేసి..
కవ్విస్తూ, సవాలు చేస్తూ, 
నిన్ను నువ్వు బంధ విముక్తి 
చేసుకో గలవా? అని అను క్షణం ..

ఇదిగో ,ఈ క్షణం..వస్తోంది 
అని నిరంతరం ఎదురు చూపులు 
వాకిలి గుమ్మానికి అతికించి..
మైదానం పిలుపు కోసం..అనుక్షణం..

ఒక పిచ్చి మనసు ని నేను..














4 కామెంట్‌లు:

  1. నన్ను బంధించిన గొలుసులు
    ఏమిటా అని ఒక రోజు చూసాను..
    ఫకాలున నవ్వు వచ్చింది, ఊరికే
    ఇలా అంటే విరిగి పోయేవే ,పెద్ద
    గట్టి సంకెళ్ళు కావే, అయినా
    ఏమిటో ,ఇలా ఉన్నాను..కాపలా
    కుక్క లాగ విశ్వాసం గా, ఇంత అన్నం
    అంత ప్రేమ పంచుతున్నారని కాబోలు....అంతేనంటరా? అంత బలహినమైనవా బందాలు? అన్నట్లు చలం చెప్పినట్లు మైదానం అంత బాగుంటుందా మేడం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. డేవిడ్..గారు,

      మీరు ముఖ పత్రం లో ఉన్నట్టూ అయితే ,

      మీకు వెంటనే నేను ఒక ఆహ్వానం పంపిస్తాను.

      నేను ఒక గ్రూప్ మొదలు పెట్టేను,

      చలం ..ప్రేమ తత్వం అని..

      ఎవరు చెప్పినవి, వినక, మీరే చదవండి, మైదానం.

      ఐ ఏదో విష్రుంఖలత కాదు, ఒక ఆడ మనసు స్వేచ్చ కోసం

      పడిన యాతన..ఒక చెంప దెబ్బ లా కఠినం గా ఉంటుంది.

      సమాజానికి.. చాలా రాయ వచ్చు ...ఇంకా...

      ఒక్క పాతివ్రత్యమనే అసహజమగు గుణము కోసం, అనేక సహజమయిన సద్గుణాలన్ని చంపారు. ధైర్యము, స్వేచ్చ,సూనృతము ,దేరత్వము,ఉదారత, లోక జ్ఞానము,విద్య,ఆరోగ్యము,చాతుర్యము, మొదలయిన గుణాలన్నీ పోయినాయి స్త్రీ నుండి.

      శశిరేఖ ...పుస్తకం నిండి.
      బలహీన బంధాలు ఎందుకు అయాయి...యే ప్రాతిపదికిన పాతుకున్న బంధాలు అవి..

      చాలా చాల ,ప్రశ్నలు ఉన్నాయి...జవాబు కోసం..

      మీ అభిప్రాయం చెప్పినందుకు చాల ధన్యవాదాలు...అండి..

      వసంతం.


      తొలగించండి
  2. వసంతం గారు ఈపుడో పదేళ్ళ క్రితం చలం మైదానం, శశిరేక చదివాను కాని ఎందుకో పూర్తి స్థాయిలో అర్థం చేసుకొలేక పోయాను. బహుషా అప్పటి నావయసు ఆ చైతన్య స్తాయిని అర్థం చేసుకొలేక పోయిందేమో. మైదానం కొంతవరకు అర్థం చేసుకొగలిగాను కాని శశిరేకను అర్థం చేసుకోలేకపొయాను శశిరేక భర్త నిర్బంధం ఇష్టం లేక కృష్నుడి దగ్గరకు రావడ్దం, ఆ తర్వాత సుందరరావుతో వెళ్ళిపోవడం, తర్వాత రామరావును ఇష్టపడడం ఎందుకో అర్థం చేసుకోలేకపోఅయాను. మళ్ళి ఒకసారి చదవడానికి ప్రయత్నిస్తాను చుదాం అర్థం చేసుకోగలనేమో....ఇక మీ ముకపత్ర ఆహ్వానం పంపండి మేడం తప్పకుండా మీ గ్రూపులో చేరతాను. కనిసం మీ గ్రూపుద్వారనైన చలం ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పకుండా పంపుతాను..మీరు ఏ పేరుతో ఉన్నారో సెలవిస్తారా?

      వెల్లిపొవడం అనేది...ఒక భౌతిక మైన కార్యం లా కాకుందా, మానసికం మనకి నచ్చిన వారితో ఉండడం సాధ్యం అవుతే ఎలా ఉంటుంది, అని ఒక ఉటొపీ గా అర్ధం చేసుకోవాలి...నేను చదివి, షుమారు నలభై ఏళ్ళు అయిందేమొ చలం గారి పుస్తకాలు, వివరాలు గుర్తు ఉండవు కాని, ఆ ప్రేమ భావన, ఆ స్త్రీ మీద ప్రేమ..అన్నీ ఇంకా మనసు లో చాలా ఫ్రెష్ గా గుర్తు ఉన్నాయి
      ..నన్ను ప్రభావితం చేసిన వారిలో ఇద్దరు..చలం గారి ప్రెమ తత్వం..ఉప్పల లక్ష్మణ రావు గారి అతడు- ఆమె..మీకు అహ్వానం తప్పక పంపిస్తాను..
      వసంతం.

      తొలగించండి