"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

11 ఏప్రి, 2013

ప్రకృతి కి వికృతి ..

తీయగా పాడు 
అంటూ కోయిలని 
శాసించలేవు.. 

చల్లగా వీచు 
అంటూ గాలిని 
ఆజ్ఞాపించలేవు 

ఆగిపో ,చలించడం 
ఆగిపో అంటూ 
నది నీరు ని 
కోరలేవు .. 

ఒక్కసారి మాయం 
అయిపో కాంతి ని 
తీసుకు పో  అంటూ 
వెన్నెల కి 
మసిబూయలేవు 

అలలు ను  ఆపు 
ఒక్కసారి అంటూ 
సాగరానికి 
అడ్డు కట్టు వేయలేవు . 

ప్రతి రోజు 
ఉదయించే సూర్యుడి ని 
ఏమయినా ఆపగలవా?
ఈ ఒక్క రోజు ఆగిపో 
అనేది అసంభవ క్రియ . 


ఈ ప్రకృతి సమస్తం 
తమ  శాశనం 
తాము రాసుకున్నాయి 
సమ తూకం లో 
తామే ఒక నిదర్సనం . 

ఎందుకో 
మనిషే ఒక అసమాపక క్రియ 
ఒక అసంపూర్ణ కథ 
ప్రకృతి కి వికృతి .. 
ఏనాడు ప్రకృతి కి
పర్యాయ పదం మనిషి 
అవుతాడో ఆ రోజే 
యుగాది .. 












6 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది గురువుగారు..

    రిప్లయితొలగించండి
  2. "ఏనాడు ప్రకృతికి
    పర్యాయ పదం మనిషి
    అవుతాడో ఆ రోజే
    యుగాది."

    చాలా చాలా బాగా రాశారు. సూపర్బ్!

    రిప్లయితొలగించండి
  3. 9919929934

    ధన్యవాదాలు అండీ ,నా కవిత నచ్చినందుకు .
    వసంతం.

    రిప్లయితొలగించండి
  4. Y.V.Ramana garu,

    కవిత సారాంసం ని చక్కగా పట్టుకున్నారు .
    మీకు నా ధన్యవాదాలు అండీ
    వసంతం.

    రిప్లయితొలగించండి