"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

24 ఏప్రి, 2013

నా నడక , నా బాట ..

నేను నడిచిన బాట 
మరీ అంత అంతు చిక్కని బాట 
ఏమి కాదు.. 
అయినా ఎప్పుడూ వెలుతురు లో 
చీకటి ఉన్నట్టు ఎప్పుడూ 
వెతుక్కోవడమే .. 
తడుముకోవడమే 
ఎందుకో ,ఎంత వెలుగు సరిపోదు 
చీకటి శుభ్రం గా నయం అనిపిస్తుంది 
వెలుతురు కి చెయ్యి అడ్డుపెట్టి 
చీకటి కోసం తడుము కోవడం లో 
ఏదో ఒక ఆనందం.. 
అలవాటు లో ఎంత సుఖమో ,
నన్నడుగు నేను చెపుతా 
అలవాటు లో ఉన్న శాంతి 
నువ్వు కొత్త దారి వెతుక్కోడం లో 
ఉండదు, ఎంత కష్టమైనా ,నష్టమైన 
నాది అయిన ఈ స్వర్గం నుంచి నేను 
కదలను మెదలను .. 

చీకటి లో ఒక సుఖం ,
నా మొహం లో రంగులు 
మరి కనిపించవు ,
తెల్లని చిరాకు, ఎర్రని క్రోధం 
నీలం శరీర రంగు అన్ని 
నల్లటి చీకట్లో ఒకటే 
అందుకే నల్లటి చీకటి 
నేను హత్తుకుంటాను ఇష్టం గా. 

కష్టమయినా అందుకే అలవాటు 
అయిన బాట లో నడకే నాకు ముద్దు 
మరో దారి చెబితే వద్దు.. 
జిగురు కన్నా గొప్పగా 
అంటుకుంటుంది ఈ అలవాటు జిగురు . 

నా నడక నా బాట .. 
నిర్విఘ్నం గా ఇన్నేళ్ళు సాగుతోంది ?
వెలుగు కోసం అంటే ,
నువ్వు ఎలా నవ్వుతావో నాకు తెలుసు 
చీకటి ని హత్తుకునే నువ్వు, 
చీకటి ని ఇష్టం గా హత్తుకునే నువ్వు.. 









4 కామెంట్‌లు:

  1. అలవాటు లో ఉన్న శాంతి
    నువ్వు కొత్త దారి వెతుక్కోడం లో
    ఉండదు, ఎంత కష్టమైనా ,నష్టమైన
    నాది అయిన ఈ స్వర్గం నుంచి నేను
    కదలను మెదలను ..
    -------------------------------
    నిజం చెప్పారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju garu,
      థాంక్ యూ ..

      నా కవిత మీకు నచ్చినందుకు ,

      వసంతం.

      తొలగించండి

  2. నా నడక నా బాట ..
    నిర్విఘ్నం గా ఇన్నేళ్ళు సాగుతోంది ?
    వెలుగు కోసం అంటే ,
    నువ్వు ఎలా నవ్వుతావో నాకు తెలుసు
    చీకటి ని హత్తుకునే నువ్వు,
    చీకటి ని ఇష్టం గా హత్తుకునే నువ్వు.ఎలా నవ్వుతావో నాకు తెలుసు......చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి