"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

19 ఏప్రి, 2013

కథలు రాసే వాడి మొహం ...

కథలు రాసే వాడి మొహం 
అంటూ ఏమయినా ఉంటుందా? 
ఏమో ,కథలు రాసే వాడు ఎలా 
ఉంటాడు? అని ఆలోచనలో పడ్డాను . 

పొద్దున్నే నిద్ర లేచి అరచేయి లో 
లక్ష్మి ని చూసుకుని, కాఫీ అయిందా అంటూ 
ఒక్క అరుపు, బాత్రూం లో దూరిపోతూ 
అరిచి.. ఇంత లేట్ అయిందా ? నన్ను 
నిద్ర ఎందుకు లేపలేదు? అని ఒక 
సత్కారమ్ శాలువా భార్యకి కప్పి ,
ఒక్క కిక్ తో స్కూటర్ కి ప్రాణం పోసి 
గర్వం గా ,నా కథ కి ఈ మారు అయినా 
వెయ్యిన్నూట పదహార్లు ఇస్తారా ? 
ఆ ఎడిటర్ కి నా తడాఖా తెలియదు ,
నేను తలచుకుంటే, అంటూ ఊహల్లో 
ఎప్పుడు జేరుతాడో ఆఫీసు. 

అందరూ నంగిరి మొహాలే , కథల్రాసే 
ఫలానా ఆయన అని ఒక్కరూ 
పరిచయం చేయరు, అంతా నేనే 
చెప్పుకోవాలి, ప్రవర ఖర్మ.. 
ఫలానా కథల పొటి లో నాకు 
మూడో బహుమతి , ఏదో 
మతలబు జరిగే ఉంటుంది ,లేక పోతే 
అంత గొప్ప మానవీయ కథకి 
మూడో బహుమతా ? మరి తీసికట్టు గా 
ఈ మారయినా ప్రధమ బహుమతి కొట్టేసి 
శ్రీమతి కి ఒక బంగారు గాజుల జత . ఊహు, 
గాజులు రావు, బంగారం ధర కొండెక్కి 
కూర్చుంది, ఒక ముక్కు పుడక 
చ, అన్యాయం గా ఇంత చీపు ఊహలేం ?

ప్రభుత్వ ఆఫీసు లో జరిగే అన్ని 
లంచాల కార్యక్రమాలు ,చూసి చూసి, 
దళసరి అయిన చర్మం తో ఒడుపుగా 
సొరుగు నింపి, చిల్లర మహా లక్ష్మి 
ఎందుకు కాదనాలి? అంటూ ఒక చేత్తో 
ఆ చల్లని లచ్చిం దేవి కి ఒక నమస్కారం కొట్టి, 
కాస్త తీరుబడి గా వెనక్కి వాలి, రేపు 
మంచి  రోజు, శ్రీ అంటూ రాసుకుని, కథ 
రాసేయడం మొదలు పెట్టాలి, అల్లా 
మొదటి బహుమతి వచ్చిన ఫలానా 
రచయిత కన్నా ,గొప్ప ఎలిమెంట్ ఉండాలి 
నా కథ చదివి, కన్నీరు తో తడి అయిపోవాలి 
పాకులు, అవును మార్చే పోయాను 
ఆ రొమాంటిక్ కథల పోటి సంగతి, 
ఎక్కడా ,నా శ్రీమతి శ్రీలక్ష్మి తో రొమాన్స్ 
హు .. ఎవడితో చెప్పుకోను ?అలసి పోయాను 
అంటుంది, ఇంకేం ఉంది, నా కథలకి 
ఎక్కడ నించి వస్తుంది మరి? లవ్వు  ??


సాయంత్రం తీరుబడి గా వీధి వీధి 
తిరుగుతూ, కథల కోసం ఆబగా 
షుగర్ పేషంట్ మిఠాయి కొట్ల వేపు 
చూసినట్టు, ఈ చెప్పులు కుట్టే వాడు 
నాకు తెలిసి ఎన్నేల్లుగా ఇదే పని ,
వాడి కష్టాలు , కుటుంబం వివరాలు 
అడగనా పోనీ ? వద్దులే, ఇప్పటికే
చాల కథలే వచ్చాయి, మరో
మంచి కథా వస్తువు వెదకాలి, అలా 
ఒక్క సారి ,కనక మహా లక్ష్మి వారి 
మందు దుకాణం ముందు ఆపనా ?
ఇంట్లోకి తెస్తే కాళ్ళు విరగ్గోడుతుంది 
కాని, ఇక్కడే ఒక అర గ్లాసు పుచ్చుకుంటే 
కథ రాసే మూడ్ వస్తుందేమో ?

వీధి వీధి తిరిగినా ఎక్కడా ఒక్క కథ 
స్టొరీ పుట్టలేదు, ఏమిటి ,మన దేశం లో 
కొంప దీసి దారిద్ర్యం, మధ్య తరగతి 
మిథ్య విలువల కష్టాలు ఇంక లేవా 
ఏమిటి? అమ్మో, గోప్పోళ్ళ కథ ల లో 
స్టొరీ ఏముంటుంది? నాలాంటి రచయిత 
ఇంక మట్టి గొట్టుకుపొతాడు .. చా చా 
కథలే కరువయిన దేశం రా ఇది ,గొడ్డు 
పోయింది, స్కూటర్ స్టాండ్ వేసే లోపల 
భార్య శ్రీలక్ష్మి ,ఏమండి ,మన ఇంట్లో పని 
చేసే సత్తి ని మొగుడు చావ గొట్టాడుట ,
పాపం, పని లోకి రాలేనని కబురు పంపింది 
లుంగీ లో కి మారి ఏది ఒకసారి చెప్పు మళ్లీ ,
హమ్మయ్య కథలు రాసే మొహం ఇలా ఉంటుందా ?

ఏమో మరి.. 






8 కామెంట్‌లు:

  1. కధలు వ్రాయటానికి ఇంత బాధ పడాలా?
    భార్య నడిగితే చెప్పేస్తుంది కదా ఓ కధ
    పక్కింటి వాళ్ళ గురించి.

    బాగుంది మీ కధా కల్పకం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju garu,

      నమస్కారం మీకు...
      మీకు థాంక్స్. కొలను మీద కవిత రాయమని చెప్పి, నా కవిత కి ఒక బహుమానం కూడా సంపాదించి పెట్టినందుకు. మీరు చెప్పక పోతే నాకు తెలిసేది కాదు.
      ఇంక రెండో థాంక్స్ నా కవిత లు చదివి శ్రద్ధగా మీ అభిప్రాయాలు కూడా రాస్తున్నందుకు , పాఠకుల ప్రతిస్పందన కవి కి ఉత్సాహాన్ని కలగ జేస్తుంది అనడం లో సందేహం లేదు.
      వసంతం.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. Dantuluri Kishore Varma gaariki

      నమస్కారం మీకు
      నా కవిత నచ్చినందుకు సంతోషం.
      ధన్యవాదాలు మీకు. ..

      వసంతం.

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. నేనే చెప్పాల్సి వస్తోంది, ఇందులో ఒక సటైర్ ఉంది, కథలు రాసే వాదు ఎంత మామూలు జీవితం, అందరిలాగే ఆదర్శాలు కి దూరం గా ,నడుస్తాడొ అన్నదే నా కవిత సారాంశం .. హ్మ్మ్ ..అది నా కవిత అని చెప్పుకోవడం కొంచం... బాధే మరి.. అయినా మెచ్చుకున్న అందరికి ధన్యవాదాలు.

      వసంతం.

      తొలగించండి