"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

30 ఏప్రి, 2013

అక్షరం

అక్షరమే అని ఊరుకోకు 
అక్షరమా అని పరిహసించకు 
అక్షరంతో చేస్తావా యుద్ధం ?
అని వెట కారం చేయకు . 

అక్షరం శాంతి, అక్షరం క్రాంతి 
అక్షరం పేలని బులెట్ 
అక్షరం నిబిడీకృత మిసైల్ 
అక్షరం పదునైన కత్తి . 

అక్షరం అజ్ఞానానికి అంతం 
చెప్పే అవకాశానికి నాంది 
అక్షరం వెలిగించే దీపం లో 
నలు దెసలా కాంతే కాంతి . 

అక్షరం అందరి హక్కు 
కాదు అది వ్యాపార సొత్తు. 
అక్షరం కాదు కబంధ 
హస్తాల సొంత సొత్తు. 

అక్షరం తెచ్చే జ్ఞానం 
తేవాలి విజ్ఞానం , అంతే కాని 
గోడ మీద తగిలించే ఉత్త 
కాగితం ఫోటో కాదు ,అక్షరం . 

కూడు ,గుడ్డ నీడ , ఈ మూడింటికి 
జత కూర్చండి నాలుగో పరమార్ధం . 
అక్షరం అనే అమృతాన్నిఅందరికి 
సమంగా పంచేద్దాం ,రండి రండి .

అసమానత , అన్యాయం ,
అధర్మం ,అనాగరికత అన్నిటి పై 
ఎక్కుపెట్టిన అస్త్రం అక్షరమ్. 
సంస్కారం తెచ్చి పెట్టె అక్షరమే ,అక్షరమ్. 

అక్షరం కి సలాం చేద్దాం ,
అక్షరాని కి నమస్తే అందాం 
అక్షరమా స్వాగతం అందాం 
అక్షరమే అండ దండ అందాం 
అక్షరానికి  నేను గులామ్. 
అక్షరానికి నేను ఆరాధన చేస్తా 
అక్షరం తో వారధులు వేస్తా 
అక్షరం తో నలుదెసల యానం చేస్తా 
అక్షరం తో కథలే చెబుతా 
అక్షరం తో పాటలే పాడుతా 
అక్షరం తో కదం తొక్కుతా 
అక్షరం తో పధం సాగుతా 
అక్షరమే నా పధం 
అక్షరమే నా గమ్యం 
అక్షరమే నా ధ్యేయం ,అక్షరమే మన ధ్యేయం . 



2 కామెంట్‌లు:

  1. అక్షరం అందరి హక్కు
    కాదు అది వ్యాపార సొత్తు.
    అక్షరం కాదు కబంధ
    హస్తాల సొంత సొత్తు....nijame kadaa

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డేవిడ్ ..

      ధన్యవాదాలు ..

      అక్షరం ని బంధించి కార్పరేట్ ఖరీదు కి అమ్ముతున్నారు

      చాల నిరాశ ,బాధ గా ఉంటుంది..

      చదువు విలువ అంటే ' విలువ " అయిపోయింది..

      హ్మ్మ్మ్ .. ఇలా ఏదో రాసుకుని తృప్తి పడడమేనా ??

      చదువు ,అక్షరం అందరిది అని అందరూ చెప్పలి, చెప్పి ఒప్పించాలి

      వసంతం.

      తొలగించండి