"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

6 ఏప్రి, 2013

ఇది జీవితం ,ఇది దారి ...

ఇది జీవితం ,ఇది దారి 
అని కొలుచుకుంటూ ,అడుగులో అడుగు 
దారి అగమ్యం . 

గుచ్చుకునే ముళ్ళ చెట్లు 
గీరి గీరి పలకరిస్తాయి . 
కాసిని పూల చెట్లు వేయోచ్చుగా 
ఎవరో ? అని సణుగుతాను .. 

నువ్వే వేయోచ్చుగావెవ్వె 
అంటూ వెక్కిరించాయి. 
మూతి ముడిచి ,నొసలు చిట్లించి 
తల దించి , నాకోసం దారి నేనే 
వేసుకోవాలా ? ఏమిటి ???

అవును ,మరో దారి లేదు .. 
నీకు ఎవరి మాట నచ్చదు కదా 
నీ దారి నీది ,నీ గొయ్యి నీది 
నీ పువ్వుల చెట్లు నీవి 
నీ ముళ్ళు నువ్వే ఏరి పడేయాలి 
మరో దారి లేదు నీకు. 

ఒంటెత్తు పోకడలు గొప్ప 
ఒంటరి దారి  నవ్యత 
ఒంటరి జీవనం ధైర్యం 
ఒంటరి బతుకు నాది అంటూ 
చెప్పిన కబుర్లు ఏమయాయి ?? 

నలుగురి దారి, నలుగురు నడిచిన దారి 
ఎంత సాఫిగా ఉంటుందో ? తెంపరి పిల్లవి 
కాళ్ళు విరిగినా సరే ,నా దారి నేనే 
అంటూ గెంతేవు .. 

ముళ్ళు నరికి పూల చెట్లు నాటి 
ఇప్పుడు నువ్వు నీ దారి అంటూ 
మొదలు పెడితే ,నీ గమ్యం ఎప్పుడు చేరేవు ?
గమ్యం చేరడం ముఖ్యమా ? 
అందరి తో నడవడం ముఖ్యమా ?? 

అని ప్రశ్న లతో ఇంకా 
ఆలస్యం చేయకు .. 
ఒక్క అడుగు వేయి 
ఒక్క అడుగు ముందుకు వేయి 
ఒక్క అడుగు ముందుకే మరి..  



4 కామెంట్‌లు:

  1. గమ్యం చేరటం ముఖ్యం
    అందుకే కలుపుకోటం సఖ్యం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju gaaru,
      నమస్కారం అండీ.
      నిజమే, కలుపుకుని నడవడమే ముఖ్యం ..
      అలానే అనిపిస్తుంది ఈ వయసులో ముఖ్యం గా
      ఒంటరి నడక ,అలసట తోస్తుంది.
      యవ్వనం లో ఉండే ఆ నేస్తాలు అందరూ తమ దారి
      తాము చూసుకుంటారు.. ఆ సరికి ..మరి..
      ధన్యవాదాలు మీకు, నా కవిత లు చదివి మీ
      అభిప్రాయం రాస్తున్నందుకు..
      వసంతం.

      తొలగించండి
  2. ఆలస్యం చేయకు ..
    ఒక్క అడుగు వేయి...ముందుకు....ముందుకే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్యూ

      డేవిడ్ .. అడుగు ముందుకు వేయడమే అని మార్చింగ్ సొంగ్ చెపుతుంది.

      వసంతం .

      తొలగించండి