"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

7 ఏప్రి, 2013

ఒక నాడు సముద్రం ఒడ్డున ...

ఒక నాడు సముద్రం ఒడ్డున   

చిన్న చిన్న పిల్లలం 

ఇసకలో కట్టేం చిన్న చిన్న గుప్పెళ్ళతో 
పెద్ద పెద్ద గోపురాలు ,పైన ఒక చిన్న 
పువ్వు పెట్టి , మురిసి పోయామ్. 
ఒక గుడి కట్టేశాం అని .. 
ప్రతి గుడి కి ఒక మూల దేవుడు 
ఉండాలని తెలియని బాల్యం మరి. 

పసితనపు అమాయకత్వపు 
గుడి , మరు రోజు కి 
సముద్రం మింగేసింది ,ముచ్చట పడి.  
ఇప్పుడు ఎన్నో ,పెద్ద పెద్ద గుడులు 
చూసాం ,దణ్ణాలు పెట్టుకున్నాం 
మరి ఎవరు ఎత్తుకు పోయారో కాని 
ఏ దేవుడు లోను నా పసితనం 
ప్రతిష్టించిన దేవుడి లేని గుడి లోని 
పవిత్రత కనిపించదు. 

ఎందుకో ? 



6 కామెంట్‌లు:

  1. నీలహంస బ్లాగ్లో "కొలను" మీద కవిత పోటీ ఉంది. మీరు కూడా వ్రాయ కూడదూ.
    http://neelahamsa.blogspot.com/2013/03/blog-post_29.html

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thanks for the information..will definitely participate...for the fun of it..Thanks andi Rao S Lakkaraaju gaaru..

      vasantam..

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. చెప్పాలంటే
      ధన్యవాదాలు, నా చిన్న కవిత లో భావం మీకు నచ్చినందుకు ..

      వసంతం.

      తొలగించండి
  3. ఏ దేవుడు లోను నా పసితనం
    ప్రతిష్టించిన దేవుడి లేని గుడి లోని
    పవిత్రత కనిపించదు.

    ఎందుకో ? ..............అవును ఎందుకూ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డేవిడ్ ...థాంక్స్
      చిన్న కవిత ...మనసులో అలా మెదిలింది..
      నచ్చినందుకు సంతోషం.
      వసంతం.

      తొలగించండి