"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

28 ఏప్రి, 2013

సుఖం ..దుఖం ..

మరపు అదృష్టమో 
కాదో ,వద్దు వద్దు అనుకున్నవి 
పదే పదే గుర్తు  చేస్తుంది . 
ఎంతటి గొప్ప అనుభూతి అయినా 
రేపటికి మసక బారుతుంది . 

వాడిన మల్లెపూలు ఎత్తి 
కిటికీ బయట విసిరేసినట్టు 
అనుభూతి విభూతి లా జలజల 
రాలిపడిపోతుంది మాపటికి .


పురాతన దుఖాలు మటుకు 
రేగి ,రేగి, పుండులా 
ఎప్పుడూ సలుపుతూ ఉంటాయి ,
దుఖం కి జీవిత కాలం అంత ఎక్కువేమిటో ? 

దుఖం వెనువెంటే నీడ లా 
సుఖం పక్క పక్క నే హితుడి లా 
సూర్య చంద్రులు లాగ ఒకరి మొహం ఒకరు చూడరు . 
నాకేమో రెండు కలిసిన  క్షితిజ రేఖ దగ్గర 
ఉండిపోవాలని చిరకాల కోరిక ,ఫలించేనా ? 

సుఖం అంటే ఏమిటో ఎలా తెలిసేను 
నీకు దుఖపు క్షణాలతో పోలికతో కదా 
సమ స్థితి అంటూ లేదు అంతా 
సాపేక్షం అమ్మా అంటూ నా కొడుకు చేసేడు ఉపదేశం . 

తరచి చూస్తే అదే కదా సత్యమ్  
అదే కదా సత్యం శివం సుందరం .  






4 కామెంట్‌లు:

  1. పురాతన దుఖాలు మటుకు
    రేగి ,రేగి, పుండులా
    ఎప్పుడూ సలుపుతూ ఉంటాయి ,
    దుఖం కి జీవిత కాలం అంత ఎక్కువేమిటో ?
    --------------------
    అదే నాకూ అర్ధం కాదు !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju garu, అవునండీ ,అదే నాకు అర్ధం కాదు,
      కాలం గాయాలని మానుపుతుంది అంటారు కాని,
      లోతుగా చూస్తే నివురు గప్పిన లావాలా కూర్చుంటుంది
      ఎప్పుడయినా ఎరప్ట్ అవడానికి తయారు గా
      ధన్యవాదాలు మీకు,
      నా కవిత సారాంశాన్ని చక్కగా పట్టుకున్నందుకు

      వసంతం.


      తొలగించండి
  2. మరపు అదృష్టమో
    కాదో ,వద్దు వద్దు అనుకున్నవి
    పదే పదే గుర్తు చేస్తుంది .
    ఎంతటి గొప్ప అనుభూతి అయినా
    రేపటికి మసక బారుతుంది . .......నిజమే కదా....మీ కవిత బాగుంది.

    రిప్లయితొలగించండి