"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

20 ఏప్రి, 2013

నా నీలి ఆకాశం ..

అలసట గా అనిపించి 
అలవోకగా వెనక్కి వాలితే 
ఆకాశం పలకరించింది ,
నేను మర్చిపోయిన ఆకాశం . 

చిన్నప్పుడెప్పుడో ,
ఒక కల విత్తనం నాటాను ఈ 
నీలి ఆకాశం లోనే, ఇంక మొదలు 
ఏడు రంగుల హరివిల్లు కోసం 
ఎదురుచూపులు . 

ఆ మధ్యే ,ఎందుకో విసుగు 
చికాకు, నిప్పులు చిమ్మే ఎండలు 
అతివృష్టి తప్ప ,నెమ్మది గా 
కలలు ఆరబోసుకునే మునుపటి 
ఆకాశం ఏది? నా నీలి ఆకాశం .. 

నా మబ్బులు తుడిచిన పలక 
లాంటి నీలి ,నీలి ఆకాశం ,ఏ 
దొంగలు కాజేసారో ? కలలే రాని 
కమ్మటి నిద్ర , ఎవరు కాజేసారో ?

మళ్లీ , మళ్లీ ఎప్పుడో ఆ కల 
విత్తనం నాటే శుభ ఘడియ , 
అని అంతటా వెతుకుతూ ఉండగా 
ఏవో మనసు  గొళ్లేలు విడి విడిన 
సందడి , చీకటి మూలల వెలుగు 
కడిగేస్తూ, చిరు చిరు దివ్వెలు 
కన్నుల వెలిగిస్తూ, కన్నుల ముందే 
నీలి ఆకాశం ,హరివిల్లు కల ని 
సాకారం చేసుకుంటూ , కమ్మటి 
నిద్దురని కంటి నిండుగా కాచి పోసింది . 

అవును, నా ఆకాశం లో నా 
నిద్దుర ,నా కల తిరిగి దొరికాయి ,
ఒక్కసారి లోపలి చూసుకున్న 
ఆ నీలి రంగు వికాసం అంటుకుంటే
మరి పోదు , నీలి రంగు వికాసం కి 
పూస్తాయి ఏడు రంగుల హరివిల్లులు. 
నా నిద్దుర , నా కల ,నా ఆకాశం . 
మరెప్పుడూ నావే , ఎప్పుడూ ఇంకా నావే .. 


6 కామెంట్‌లు:

  1. ఆ అందమైనా ఆకాశాన్ని కనులకు కట్టినట్టు చుపించారు.. చాలా థాంక్స్..:-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎగిసే అలలు
      పేరు ఎంత బాగుందో
      నా ఆకాశం మీకు నచ్చినందుకు నాకు పరమానందం.
      ధన్యవాదాలు
      వసంతం.

      తొలగించండి
  2. నా మబ్బులు తుడిచిన పలక
    లాంటి నీలి ,నీలి ఆకాశం ,ఏ
    దొంగలు కాజేసారో ? కలలే రాని
    కమ్మటి నిద్ర , ఎవరు కాజేసారో ?......అవునూ ఎవరు కాజేసారబ్బా?..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హు.. ఇంకెవరు కాలం..మనం పెరిగి పెద్ద వారం అవుతున్న కొద్దీ మన స్వచ్చమైన నీలి ఆకాశం ,మసక ,మసక గా ,మబ్బులు పట్టి, కలలు ని కూడా దోచేస్తూ ,మనం కాలానికి అనుగుణం గా ఎంత మారిపోయామో తెలుస్తుంది.. అంతా కాల మహిమే.
      వసంతం.

      తొలగించండి